ఈ కారు వస్తే ఇక పెట్రోల్ కార్లు మర్చిపోవాల్సిందే.. దారిలో ఎక్కడా ఆగకుండా 630 కి.మీలు డ్రైవ్ చేయచ్చు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తన వాహనాలను విక్రయిస్తుంది. ఇండియాలో ఇప్పుడు కియా అంటే చాలా ఫేమస్. ఇక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కార్ల తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కంపెనీ సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ ఈవీ సెగ్మెంట్‌లో కూడా తన సత్తాను చాటుతుంది. ఇప్పటికే పలు ఈవీ మోడళ్లను లాంచ్ చేసిన కియా తాజాగా కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్‌ను ఆవిష్కరించింది. దీని పేరు 'ఈవీ4 (Ev4)'. ప్రస్తుతం ఇది అందుబాటులో లేనప్పటికి త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ప్రపంచం మొత్తం కూడా ఈవీల వైపు చూస్తున్న నేపథ్యంలో కియా మోటార్స్ ఈ కొత్త కారుతో మార్కెట్ వాటాను పెంచుకోనుంది.

కియా ఈవీ4 సెడాన్, హ్యాచ్‌బ్యాక్ రెండు వెర్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండబోతుంది. కంపెనీ ఈ కారును మొదటగా తన సొంత దేశంలో విక్రయించే ఆలోచనలో ఉంది. ఆ తరువాత ఇతర దేశాల్లో కూడా విడుదల చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌‌లో లభిస్తుందని సమాచారం ఉన్నప్పటికి ICE వేరియంట్‌లో అమ్మకానికి ఉంటుందో లేదో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈవీ గురించి మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఇది అతి త్వరలో దక్షిణకొరియాలో విడుదల అవుతుంది.

Kia Unveils EV4 Design Range

మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లో లభించే అవకాశం ఉంది. మొదటిది 58.3 kWh, రెండోది 81.4 kWh. ఇక Ev4 రేంజ్ విషయానికి వస్తే, చిన్న బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 430 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే పెద్ద బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌తో ఏకంగా 630 కి.మీల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది అనువైన మోడల్.

ఇటీవల కాలంలో టూర్స్ లేదా దూర ప్రాంత ప్రయాణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో Ev4తో ఎక్కడ ఛార్జింగ్ కోసం ఆగకుండా హాయిగా లాంగ్ రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు 150 kW ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటాయి. ఇది శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంటుంది. ప్రధానంగా ఈ కారులో అందించిన బ్యాటరీలను ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి దానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని జోడించారు.

Kia Unveils EV4 630 Km Range

బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి కేవలం 31 నిమిషాల సమయం పడుతుందని కియా కంపెనీ పేర్కొంటుంది. దీనిలో అధునాతన ఫీచర్స్‌ను అందించారు. క్యాబిన్ థీమ్ ఆకట్టుకుంటుంది. లోపల నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి వాటిలో పాటు ఇతర ఫీచర్స్ యాక్సెస్ కోసం 30 అంగుళాల స్క్రీన్‌ను కూడా అందించనున్నారు. ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అద్బుతుంగా ఉంటుంది.

కారు ముందు భాగంలో నిలువుగా ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ LED DRLలు, స్పోర్టీ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, టేపరింగ్ రూఫ్‌లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ప్రయాణికుల రక్షణకు సంబంధించి ADAS ఫీచర్, ఐ-పెడల్ 3.0 రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా ఇతర అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

Kia Unveils EV4

కియా ఈవీ4 మార్చి నెలలో దక్షిణ కొరయాలో విడుదల కావచ్చు. ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్లో ఈ ఏడాది చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాలో EV4 సెడాన్ వెర్షన్ మాత్రమే విడుదల చేయనున్నారు. భారత్‌లో విడుదలపై కియా మోటార్స్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. దీనిపై కంపెనీ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 1, 2025, 11:01 [IST]
English summary
Kia unveils ev4 electric vehicle with up to 630 km range full details here
Read more on: #kia motors #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+