టాటా, మహీంద్రా జాగ్రత్త! అదిరిపోయే కియా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్.. బిగ్ రివల్యూషన్ స్టార్ట్!

ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా ఉండటం పైగా ఈ మధ్య కాలంలో పర్యావరణ స్పృహ ఎక్కువ అవడం కారణంగా ఈవీలను కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులంతా కూడా ఈ సెగ్మెంట్ వాహనాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా బ్రాండ్ కియా ఇండియా (Kia India) విభాగం దేశీయ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ కియా ఈవీ6, ఈవీ9 కార్లను వినియోగదారులకు అందిస్తుండగా, పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో ఇతర కంపెనీలకు గట్టిగా బదులు చెప్పడానికి రానున్న రోజుల్లో రెండు ఈవీ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

కియా మోటార్స్ ఈవీ మార్కెట్లో తన సత్తాను చాటడానికి Kia Carens EV (కారెన్స్ ఈవీ), Syros EV (సైరోస్ ఈవీ) లను లాంచ్ చేయబోతుంది. ఇప్పటికే టాటా, మహీంద్రా, హ్యుందాయ్ వంటి బ్రాండ్‌లు EV మార్కెట్‌ను శాసిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వీటిని పోటీలోకి దింపడానికి సిద్ధమైంది. EV6, EV9 మోడళ్లు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మాత్రమే లభిస్తున్నాయి.

Kia Upcoming New Electric Car Carens

అయితే ఇప్పటివరకు మాస్ మార్కెట్‌ను టచ్ చేయని కియా ఈ రెండింటినీ కవర్ చేసే EV పోర్ట్‌ఫోలియోను నిర్మించడం ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో ప్రధాన ఈవీ మేకర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కియా ప్రీమియం విభాగం నుంచి మాస్ మార్కెట్‌కి మారే యత్నంలో భాగంగా మరింత తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతోంది. కారెన్స్, సైరోస్ ఈవీలకు కంపెనీకి అత్యంత కీలకమైన కార్లు.

కారెన్స్ ఈవీ రాబోయే నెలల్లో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అదే సైరోస్ ఈవీ మాత్రం ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2026 ప్రారంభంలో అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది. భారతీయ కుటుంబాలకు అనువైన MPVగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కారెన్స్, ఇప్పుడు కొత్త వెర్షన్‌తో వారిని అలరించడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో సైరోస్ ఈవీ కూడా దీనికి మద్దతుగా కియా సేల్స్ పెంచడానికి అత్యంత కీలకం కానుంది.

Kia Upcoming New Electric Car Syros

Kia Syros EV: కియా సైరోస్ ఈవీని 2026 జనవరి-మార్చి మధ్య లాంచ్ చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కొనుగోలుకు లభించవచ్చు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 400 కి.మీల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న సైరోస్ ఐసీఈ వేరియంట‌్‌లో ఉన్నట్లుగానూ కొన్ని ఫీచర్స్ ఉండవచ్చు. హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు వంటివి సేమ్ ఉంటాయి.

ఇది ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ కాబట్టి పవర్‌ట్రెయిన్‌కు అనుగుణంగా డిజైన్‌తో పాటు, ఇతర ఆప్షన్ల విషయంలో కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ కారు భారతీయ మార్కెట్లో మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV వంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లకు పోటీ ఇచ్చేలా ఉంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ టెక్నాలజీ, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుందని అంచనా.

Kia Upcoming New Electric Car Carens Design

Kia Carens EV: కియా కారెన్స్ ఎలక్ట్రిక్ కారును చాలా సార్లు టెస్టింగ్ చేశారు. రాబోయే నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఎంపీవీ మోడల్. మన దేశంతో పాటు దక్షిణ కొరియాలో కూడా టెస్టింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీనిలో ఛార్జింగ్ పోర్ట్ స్థానం భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 400-500 కి.మీల మధ్య రేంజ్‌ను అందించే అవకాశం ఉంది.

Take a Poll

More from DriveSpark

Article Published On: Tuesday, March 25, 2025, 7:25 [IST]
English summary
Kia upcoming new electric cars syros carens expected launch and more details
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+