ఇకపై భవిష్యత్తులో రోడ్లపై ఈ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి! కియా నుంచి అదిరిపోయే హైబ్రిడ్ కారు వచ్చేస్తుంది!
భారతదేశంలో కార్ల మార్కెట్ గత పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలే రోడ్డుపై ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది. పర్యావరణంపై ప్రభావం, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి కొత్త టెక్నాలజీలవైపు మళ్లుతోంది. ఈ పరిణామంలో హైబ్రిడ్ కార్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇవి పెట్రోల్/డీజిల్‌తో పాటు బ్యాటరీ ద్వారా కూడా నడుస్తాయి. ఈ రెండింటి కలయిక ద్వారా కారు మరింత సమర్థవంతంగా పని చేయడమే కాక, అధిక మైలేజ్ కూడా ఇస్తోంది. ఈ హైబ్రిడ్ వాహనాలు, భారత వినియోగదారులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి అన్నివర్గాల వారూ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం మైలేజ్‌కి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు, బెస్ట్ ఎంపికగా మారాయి.
భారత మార్కెట్‌లో హైబ్రిడ్ కార్ల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ వాహన తయారీదారులు ఇప్పుడు తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లను హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదల చేసేందుకు దూకుడుగా ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కియా మోటార్స్. ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో విశేషంగా ఆదరణ పొందిన "సెల్టోస్" మోడల్‌ను, హైబ్రిడ్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. కియా సెల్టోస్ హైబ్రిడ్ వచ్చే ఏడాది లాంచ్ కానున్నట్టు సమాచారం.

అయితే ఈ కారుకు సంబంధించిన అధికారిక విడుదల తేదీని ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయినప్పటికీ, ఈ కొత్త మోడల్ ద్వారా కియా తన భవిష్యత్ కార్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు అర్ధం అవుతుంది. 2030 నాటికి తన వాహనాలలో 25 శాతం హైబ్రిడ్ మోడళ్లుగా ఉండేలా కియా మోటార్స్ ప్రణాళికను రూపొందించుకుంది. ఈ భారీ లక్ష్యంలో సెల్టోస్ హైబ్రిడ్ ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో, కియా కారెన్స్ హైబ్రిడ్ మోడల్ కూడా అభివృద్ధిలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా, హ్యుందాయ్ కూడా తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన "క్రెటా"ను హైబ్రిడ్ వేరియంట్‌గా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే, భారతీయ రహదారులపై హైబ్రిడ్ కార్లు త్వరలో భారీగా సందడి చేయబోతున్నాయని అర్ధం అవుతుంది. వీటి రాక ద్వారా ప్రజలు తక్కువ మెయింటనెన్స్‌తో రోజువారి ప్రయాణాలు చేయవచ్చు.

భారత మార్కెట్‌లో కియా సెల్టోస్ హైబ్రిడ్ కారును విడుదల చేయడానికి మార్కెట్లో ప్రజల నుంచి ఈ విధమైన కార్లకు మంచి మార్కెట్ కలిగి ఉండటమే అని చెప్పవచ్చు. కియా తన వ్యూహాన్ని కేవలం పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల మీద కాకుండా, వివిధ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందించాలన్న దిశగా ప్రణాళికలు వేసింది. హైబ్రిడ్ వాహనాలు, ప్రత్యేకంగా HEVలు, ఇంధనపరమైన పొదుపుతో పాటు, తక్కువ ఉద్గారాలు విడుదల చేసే లక్షణం కలిగి ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లలో విజయవంతంగా అమ్మకాలు నమోదు చేసిన సెల్టోస్, భారతదేశంలోనూ తన బలాన్ని నిరూపించుకుంది. రాబోయే కొత్త హైబ్రిడ్ వేరియంట్ ద్వారా మరింత మంది వినియోగదారులు కారును కొనుగోలు చేయడానికి విశ్వాసంతో ముందుకు వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయాలనే వ్యూహాలతో కియా మోటార్స్ ముందుకు సాగుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








