హీరోయిన్‌కు 78లక్షల కారు గిఫ్టుగా ఇచ్చిన స్పెషల్ పర్సన్.. ఆమె ఆనందానికి హద్దే లేదు
బీఎండబ్ల్యూ సంస్థ ప్రముఖుల అభిమాన వాహన తయారీ సంస్థ. సాధారణ ఇంజిన్ వాహనాలైనా లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా, అమ్మకాలు, గిరాకీ విషయంలో అస్సలు వెనుకబడదు. మలయాళ చిత్రసీమలో పాపులర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సుందరి సురభి సంతోష్. 'కుట్టనాడన్ మార్పాప్పా' చిత్రంలో కుంచాకో పక్కన హీరోయిన్గా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు ఈమె జీవితంలోకి ఒక కొత్త సంతోషం వచ్చింది. ఆమె భర్త ప్రణవ్ తనకు సరికొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్1 ను బహుమతిగా ఇచ్చారు. ప్రణవ్ స్వయంగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
ఆమెకు చాలా ఇష్టమైన బ్లూ కలర్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ వీడియోను పంచుకున్నారు. బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన,మోడ్రన్ డిజైన్ అందిస్తుంది, ముఖ్యంగా దాని పెరిగిన కొలతలు దానికి ఆకట్టుకునే లుక్ ఇస్తాయి. 4,616 మిల్లీమీటర్ల పొడవు, 2,800 మిల్లీమీటర్ల వీల్‌బేస్ ఉన్న ఈ వాహనం, దాని విభాగంలోనే అతిపెద్ద క్యాబిన్ లే అవుట్ అందించే మోడల్‌గా మారింది. ఇది విశాలమైన స్థలాన్ని అందించి, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తమ అత్యంత విలాసవంతమైన కొత్త ఎలక్ట్రిక్ కారును ఇటీవలే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అదే బీఎండబ్ల్యూ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్. ఈ కారు మెరుగైన సౌకర్యం, భద్రత, వైవిధ్యాన్ని అందిస్తుంది. కేవలం డిజైన్ పరంగానే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైన రేంజ్‌తో ఈ కారు వినియోగదారులను ఆకర్షిస్తోంది.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చిన ఈ ఐఎక్స్1 కారు ప్రత్యేకతలు, దాని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారు రూపకల్పన చాలా ప్రత్యేకంగా, విలాసవంతంగా ఉంది. ఈ కారు బీఎండబ్ల్యూ ప్రత్యేకమైన కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల వంటి డిజైన్ అంశాలతో ఎస్‌యూవీ స్వభావాన్ని నొక్కి చెబుతుంది. ఈ కారు మినరల్ వైట్, కార్బన్ బ్లాక్ వంటి రంగుల ఆప్షన్లలో లభిస్తుంది.

కారు లోపలి భాగం చాలా విలాసవంతంగా ఉంటుంది. విశాలమైన క్యాబిన్‌లో వైడ్‌స్క్రీన్ కర్వ్డ్ డిస్‌ప్లేతో సహా లేటెస్ట్ టెక్నాలజీ అందించారు. స్పోర్ట్స్ సీట్లు సరైన సౌకర్యాన్ని, మంచి మద్దతును అందిస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్ ఉండటం వల్ల ప్రయాణ అనుభవం మరింత ఆనందదాయకంగా మారుతుంది.
ఈ కారు పర్ఫామెన్స్, సేఫ్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఈ కారు ఐదవ తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఉండే అత్యంత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటార్ 204 హార్స్‌పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది ఇన్ స్టంట్ ఫాస్టెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఐఎక్స్1 ఒకేసారి ఛార్జ్ చేస్తే 531 కిలోమీటర్ల అద్భుతమైన డ్రైవింగ్ దూరాన్ని అందిస్తుంది.

ఈ జర్మన్ వాహన తయారీ సంస్థ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. డ్రైవర్ హెల్పింగ్ సిస్టమ్స్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ప్రామాణిక సేఫ్టీ ప్రత్యేకతలు ఈ కారులో అందించారు. ఇది ప్రయాణీకులకు అత్యధిక భద్రతను అందిస్తుంది.
బీఎండబ్ల్యూ ప్రారంభ స్థాయి ఎస్‌యూవీ అయిన ఎక్స్1 విద్యుత్ వెర్షన్ ఈ కొత్త ఐఎక్స్1. ఈ కొత్త ఐఎక్స్1 రాకతో, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్లలో లభించే భారతీయ లగ్జరీ వాహనాల మార్కెట్‌లో మొట్టమొదటి మోడల్‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 నిలిచింది అనే ఘనతను బీఎండబ్ల్యూ సాధించింది.


Click it and Unblock the Notifications








