56 దేశాల్లో తిరుగులేని కార్ల కంపెనీ.. కారు మీ వద్దకు రావాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే.. ఆ కంపెనీ ఏదో తెలుసా

అంతర్జాతీయంగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా పేరుగాంచిన లంబోర్ఘిని (lamborghini) ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. అధునాతన ఫీచర్లు, స్పోర్ట్స్ మోడల్ తరహా లగ్జరీ కార్లను విడుదల చేస్తుంది. ఇతర కార్ల తయారీ కంటే సేల్స్ విషయంలో మెరుగైన స్థానంలో నిలిస్తుంది. ఇండియాలో కూడా ఈ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా లంబోర్ఘిని కార్లు కనిపిస్తాయి. చాలా మంది సిని తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పిల్లల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. రోడ్లపై ఈ కార్లు ప్రయాణిస్తుంటే దాని చుట్టు ప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరి చూపు కూడా వీటి మీదే ఉంటుంది. రోడ్లపై సెకన్లలోనే రయ్ మంటూ దూసుకుపోతుంది. ఇండియాలో మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తూ లగ్జరీ కార్ల విభాగంలో మంచి అమ్మకాల గణంకాలను సాధిస్తుంది.

ఇదిలా ఉంటే కంపెనీ తాజాగా 2024 ఏడాదికి సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. లంబోర్ఘిని వెల్లడించిన దాని ప్రకారం, 2024 ఏడాదిలో అంతర్జాతీయంగా కలిపి మొత్తం 10,687 వాహనాలను విక్రయించి సరికొత్త రికార్డును సాధించింది. ఇది దాని మునుపటి రికార్డును అధిగమించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో 186 అంతర్జాతీయ డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్ ద్వారా ఇన్ని సేల్స్ నమోదు అయ్యాయి. 2024 లో కంపెనీ కీలక మైలురాయి చేరుకుంది.

Lamborghini 10687 Sales Units In 2024 year

గ్లోబల్ మార్కెట్లో లంబోర్ఘిని కార్లకు మంచి డిమాండ్ ఉందని ఈ గణంకాలను చూస్తేనే తెలుస్తుంది. చాలా కాలంగా కంపెనీ పలు కొత్త మోడళ్లను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. గత 18 నెలల్లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది. అలాగే తన కార్లను పూర్తిగా హైబ్రిడ్ వేరియంట్లుగా మారుస్తుంది. దీంతో సాధారణ ఇంధనాలతో పాటు ఇంజిన్‌కు అదనపు శక్తిని అందించడానికి ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా జత చేస్తారు.

హైబ్రిడ్ సిరీస్‌ కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. పూర్తి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిపై దృష్టి సారిస్తూనే, హైబ్రిడ్ కార్లను కూడా తీసుకురావడానికి కంపెనీ ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆటోమోటివ్ పరిశ్రమలో లంబోర్ఘిని తన కార్ల ఇంజిన్ పనితీరుపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. హైబ్రిడ్ టెక్నాలజీలోకి కంపెనీ రావడం వలన కార్ల అమ్మకాలు చాలా వరకు పుంజుకున్నాయి. ప్రధానంగా 2023 మార్చిలో వచ్చిన Revulto కీలక పాత్ర పోషించింది.

Lamborghini Company Recorded 10687 Sales

ఈ లగ్జరీ కారు ఆర్డర్‌లు 2026 వరకు బుక్ అయ్యాయి. కస్టమర్లు దీన్ని పొందాలంటే కొంత కాలం వరకు వెయిట్ చేయాల్సిందే. దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దీంతో పాటు EVO స్పైడర్, స్టెరాటో, STJ, STO, హురాకాన్ సిరీస్ వంటి మోడళ్ల ఉత్పత్తి తుది స్టేజీకి చేరుకుంది. 2024 ఆగస్టులో విడుదల అయిన డెమెరారియో హురాకాన్ సిరీస్‌కు కొనసాగింపుగా ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.

అలాగే, లంబోర్ఘిని ఉరుస్, సిగ్నేచర్ SUV కార్ల పనితీరు అద్భుతంగా ఉంటుంది. 2024 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి బీజింగ్ ఆటో షోలో కంపెనీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎడిసన్ ఉరస్ SEని ప్రపంచానికి పరిచయం చేసింది. వీటితో పాటు 2025 ఏడాదిలో పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్లాన్ చేసింది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 13, 2025, 9:30 [IST]
English summary
Lamborghini luxury car company recorded 10687 sales units in the year 2024
Read more on: #lamborghini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+