గంటకు 343 కి.మీ.స్పీడ్..హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలో వెళ్లొచ్చు.. ఇది కారా లేక ఫైటర్ జెట్టా
ప్రముఖ ఇటాలియన్ సూపర్‌కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తమ సరికొత్త మోడల్ టెమెరారియోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దాదాపు రూ. 6 కోట్ల ధరతో విడుదలైన ఈ మోడల్, గతంలో ఎంతో ప్రజాదరణ పొందిన హురాకాన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ సూపర్‌కార్ కేవలం 8 నెలల్లోనే భారతీయ రోడ్లపైకి రావడం విశేషం.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది హై-పెర్ఫార్మెన్స్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్‌కార్. అంటే ఇది మెరుపు వేగంతో దూసుకుపోవడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనం కెపాసిటీనీ కూడా కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా టెమెరారియో చాలా కొత్తగా, స్పోర్టీగా కనిపిస్తుంది. షార్క్ ఫిన్ తరహా ముందు భాగం, లోవర్ లిప్ స్పాయిలర్, హెక్సాగోనల్ LED DRLలు కారు ముందు భాగానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.

వెనుకవైపు హెక్సాగోనల్-థీమ్ టెయిల్ లైట్లు, మధ్యలో అమర్చిన ఎగ్జాస్ట్, ఏరోడైనమిక్ ORVMలు లంబోర్ఘిని సిగ్నేచర్ డిజైన్‌ను గుర్తు చేస్తాయి. ఈ సూపర్‌కార్ 20-అంగుళాల ముందు, 21-అంగుళాల వెనుక చక్రాలపై ప్రయాణిస్తుంది. తేలికపాటి కార్బన్-ఫైబర్ చక్రాల వంటి ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.
లంబోర్ఘిని టెమెరారియో అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ షాసిపై నిర్మించారు. బ్రేకింగ్ కోసం ముందువైపు 10-పిస్టన్ కాలిపర్‌లతో 410ఎంఎం డిస్క్‌లు, వెనుకవైపు నాలుగు పిస్టన్ కాలిపర్‌లతో 390ఎంఎం డిస్క్‌లు అమర్చబడి ఉన్నాయి.

రివల్టో నుండి ఇన్ స్పైర్ అయిన ఫైటర్ జెట్ తరహా కాక్‌పిట్ టెమెరారియో ఇంటీరియర్‌లోని ప్రధాన హైలైట్. 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8.4-అంగుళాల వెర్టికల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 9.1-అంగుళాల కో-డ్రైవర్ డిస్‌ప్లే ఈ ప్లగ్-ఇన్ సూపర్‌కార్‌లోని ముఖ్యమైన ఫీచర్లు. వెంటిలేటెడ్, హీటెడ్ ఫీచర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, ఫిజికల్ బటన్లతో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఇతర ఫీచర్లు.
టెమెరారియో సిటీ, స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా వంటి స్టాండర్డ్ మోడ్‌లతో సహా మొత్తం 13 డ్రైవ్ మోడ్‌లను, రీఛార్జ్, హైబ్రిడ్, పెర్ఫార్మెన్స్ వంటి హైబ్రిడ్-నిర్దిష్ట మోడ్‌లను అందిస్తుంది. మూడు స్థాయిలతో కూడిన ప్రత్యేక డ్రిఫ్ట్ మోడ్ డ్రైవర్లను కంట్రోల్డ్ డ్రిఫ్ట్‌లు చేయడానికి అనుమతిస్తుంది. ఆన్‌బోర్డ్ టెలిమెట్రీ, డాష్‌క్యామ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హురాకాన్ కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లగల కెపాసిటీ టెమెరారియోకు ఉందని కంపెనీ చెబుతోంది. లంబోర్ఘిని ఫ్లాగ్‌షిప్ మోడల్ రివల్టోను పోలి ఉండే మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేసిన 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్ టెమెరారియో గుండె లాంటిది. V8 ఇంజన్ ఒక్కటే 789 bhp పవర్, 730 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అదే సమయంలో ఎలక్ట్రిక్ మోటార్లు 295 bhp పవర్, 2,150 Nm టార్క్‌ను అదనంగా అందిస్తాయి. దీంతో కారు కంబైన్డ్ పవర్ 907 bhpకి చేరుకుంటుంది. ఇది ఈ సూపర్‌కార్ కేవలం 2.7 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది. ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

లంబోర్ఘిని టెమెరారియో గరిష్ట వేగం 343 కిలోమీటర్లుగా కంపెనీ నిర్ధారించింది. 7 kW AC ఛార్జర్‌తో 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగల 3.8 kWh బ్యాటరీ కారులోని PHEV సిస్టమ్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రయాణంలో బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా సాయపడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








