నీళ్లలోనైనా, కొండలు గుట్టల్లోనైనా.. ఎక్కడికైనా దూసుకుపోయే లగ్జరీ ఎస్యూవీ..ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక్టా
లగ్జరీ ఎస్యూవీ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఈ కంపెనీ సరికొత్త డిఫెండర్ ఒక్టా (Defender Octa) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది డిఫెండర్ శ్రేణిలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఎస్యూవీగా నిలవనుంది. ఇవి ధరలోనూ చాలా ఖరీదుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లగల సామర్థ్యంతో వాటిని రూపొందిస్తుంటారు.
చాలా మందికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది జాగ్వార్, ల్యాండ్ రోవర్ మధ్య జాయింట్ వెంచర్ అని భావిస్తుంటారు. ఈ రెండు పొత్తులో ఉన్న మాట వాస్తవమే కానీ రెండు కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల క్రింద కార్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తాయి. ఆ కోణంలో ల్యాండ్ రోవర్ నుంచి వివిధ రకాల కార్లు అమ్ముడవుతున్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినవి రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లు.

ఈ కార్లను చాలా మంది ధనవంతులు, సినీ ప్రముఖులు రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లను కొనుగోలు చేస్తున్నట్లు తరచూ వార్తాపత్రికల్లో చూస్తుంటాము. అందుకే ల్యాండ్ రోవర్ కస్టమర్లను మరింత ఆకర్షించే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు రేంజ్ రోవర్, డిఫెండర్ కార్ల కొత్త వెర్షన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే డిఫెండర్ కొత్త 'ఆక్టా' వెర్షన్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయింది.
సాధారణంగా రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లు రెండూ ఆఫ్-రోడ్ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. దీని అర్థం వీటిని సాధారణ రోడ్లపై తీసుకెళ్లగలిగినప్పటికీ, కఠినమైన కొండలు, గుట్టలు, మట్టి రోడ్ల మీద కూడా ధైర్యంగా ప్రయాణించవచ్చు. ల్యాండ్ రోవర్ ఆ సైజ్ లోని కెపాసిటీతో రేంజ్ రోవర్, డిఫెండర్ కార్లను నిర్మిస్తుంది.

అయితే, ఇటీవల విడుదల చేసిన డిఫెండర్ ఆక్టా కారును ఒక అడుగు ముందుకు వేసి అదనపు ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో డెవలప్ చేశారు. కొత్త కారుకు సంబంధించి విడుదలైన ఫోటోలు కొత్త డిఫెండర్ ఆక్టా దుమ్ముతో కూడిన ఇసుక, కఠినమైన రాతి రోడ్లు, నీటిలో కూడా నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చూపిస్తున్నాయి.
కొత్త డిఫెండర్ ఆక్టా హైడ్రాలిక్ ఇంటర్‌లింక్డ్ 6D డైనమిక్స్ సస్పెన్షన్ టెక్నాలజీతో డెవలప్ చేశారు. ఈ సస్పెన్షన్ టెక్నాలజీని డిఫెండర్‌లో అందించడం ఇదే మొదటిసారి. అదనంగా, కారు ఇతర సస్పెన్షన్ భాగాల్లోనూ మార్పులు చేశారు. వాటిలో పొడవైన, మందమైన విష్‌బోన్‌లు, ప్రత్యేకమైన యాక్టివ్ డంపర్లు ఉన్నాయి.

అలాగే ఫ్రంట్ వీల్స్ పై బ్రెంబో కాలిపర్‌లతో 400ఎంఎం డిస్క్ బ్రేక్‌లు అందించారు. కొత్త డిఫెండర్ ఆక్టాను సాధారణ డిఫెండర్ కార్ల కంటే 68ఎంఎం వెడల్పుగా రూపొందించారు. ఇది ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా, కారు సులభంగా డెంట్ అవ్వకుండా దాని అడుగు భాగం నేల నుండి సాధారణం కంటే 28 మిమీ ఎత్తులో ఉండేలా నిర్మించారు.
కొత్త డిఫెండర్ ఆక్టా 4.4-లీటర్ ట్విన్-టర్బో మైల్డ్-హైబ్రిడ్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 467 kW పవర్, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల ఇంజిన్‌తో కొత్త డిఫెండర్ ఆక్టా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత పవర్ ఫుల్ డిఫెండర్. దీని వలన కొత్త డిఫెండర్ కేవలం 4 సెకన్లలోనే 0 నుంచి 100కిమీ వేగాన్ని అందుకుంటుంది.

ఇండియన్ లగ్జరీ కార్ల మార్కెట్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, సాహసయాత్రలు ఇష్టపడేవారు ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. డిఫెండర్ ఒక్టా విడుదల చెన్నై వంటి నగరాల్లో వర్షాకాలంలో రోడ్లు జలమయం అయినప్పుడు, ఈ వాహనం చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ వాహనం చాల విలాసవంతంగా ఉంటుంది. అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఈ వాహనంలో ఉన్నాయి. ఈ వాహనం డిజైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ వాహనంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ వాహనం ఎలాంటి రోడ్ లో అయినా చాలా సులభంగా ప్రయాణం చేయగలదు. భారతీయ మార్కెట్లో లగ్జరీ ఎస్యువీ లకు మంచి ఆదరణ ఉంది.

డిఫెండర్ ఒక్టా లాంటి కార్లు ఆఫ్ రోడింగ్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతాయి. ల్యాండ్ రోవర్ బ్రాండ్ కు భారతీయ మార్కెట్ లో మంచి పేరుంది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండడం వలన, ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ కారు ప్రీమియం ఫీచర్స్, లేటెస్ట్ టెక్నాలజీ, పవర్ ఫుల్ ఇంజన్, ఆఫ్ రోడ్ సమర్ధత దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి.
మొత్తానికి, 1 మీటర్ నీటిలో నావిగేట్ చేయగలగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. రాళ్లు, గుంతలు, బురద, నీరు వంటి కఠినమైన పరిస్థితుల్లోనూ సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తయారుచేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.59 కోట్లు. అధిక ధర కారణంగా, ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్ముడయ్యే అవకాశం ఉంది. డిఫెండర్ ఒక్టా భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని చెప్పవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








