ఎంజీ విండ్సర్ సంచలనం.. లాంగ్ జర్నీలకు ఈవీలు పనికి రావు అన్న వాళ్లకు ఇది గట్టి సమాధానం
ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV)తో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలంటే చాలామంది భయపడతారు. ఎక్కడ ఛార్జింగ్ ఆగిపోతుందో, మధ్యలో ఆగిపోతామేమోనని అనుమానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భయాలన్నీ పటాపంచలు కానున్నాయి. ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windzor EV) అనే ఎలక్ట్రిక్ కారు లేహ్ (Leh) నుంచి కన్యాకుమారి వరకు ఏకంగా 3757 కిలోమీటర్ల సవాలుతో కూడిన యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కేవలం 83 గంటల 43 నిమిషాల్లో ఈ ప్రయాణాన్ని పూర్తి చేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ రికార్డు వివరాలు, కారు ఫీచర్లు తెలుసుకుందాం.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీకి చెందిన ఎంజీ విండ్సర్ ఈవీ లేహ్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది. 3757 కిలోమీటర్ల దూరాన్ని 83 గంటల 43 నిమిషాల్లో పూర్తి చేసి, ఈ ఫీట్‌తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

మౌంటెన్ గోట్(Mountain Goat) అనే ప్రొఫెషనల్స్ టీమ్ ఈ సవాలుతో కూడిన ప్రయాణాన్ని చేపట్టింది. ఈ యాత్ర లడఖ్‌లోని ఎత్తైన, కఠినమైన పర్వత ప్రాంతాలు, ఎడారిలాంటి భూభాగాల గుండా వెళ్లి, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల తీర ప్రాంతాన్ని చేరుకుంది. ఈ ప్రయాణం ద్వారా విండ్సర్ ఈవీ ఎంత నమ్మకమైనదో, ఎంత స్థిరమైన పనితీరును అందిస్తుందో స్పష్టమైంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లపై ఉండే అపోహ ఏమిటంటే.. సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టం అని. అయితే, ఈ యాత్ర ఆ అపోహలను పూర్తిగా తొలగించింది. ఈ 3757 కి.మీ ప్రయాణంలో ఎంజీ విండ్సర్ కేవలం 20 ఛార్జింగ్ స్టాప్‌లు తీసుకుంది. ఈ చార్జింగ్ పాయింట్లను కనుగొనడానికి ఇ-హబ్ బై ఎంజీ(e-Hub by MG) యాప్‌ను ఉపయోగించారు.

ఈ యాప్ ద్వారా 36 ప్రముఖ ఛార్జ్-పాయింట్ ఆపరేటర్‌లతో భాగస్వామ్యం ఉంది. కాబట్టి భారతదేశం అంతటా ఉన్న 13,000 కు పైగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను సులభంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారానే భారతదేశంలో ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో కూడా స్పష్టమైంది.
విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 2024 లో లాంచ్ అయినప్పటి నుంచి భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది. ఇది ఏరోగ్లైడ్ అనే ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తుంది. లోపల ఏరో లాంచ్ సీట్లు ఉన్నాయి.. ఇవి బిజినెస్ క్లాస్ సౌకర్యాన్ని ఇస్తాయి.

విండ్సర్ ప్రో ఈవీలో 52.9 kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, V2L (వెహికల్ టు లోడ్), V2V (వెహికల్ టు వెహికల్) కనెక్టివిటీ ఉన్నాయి.
యాంబియెంట్ లైటింగ్, ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వుడెన్ ఫినిష్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 604 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, కనెక్టెడ్ DRL, పవర్డ్ టెయిల్‌గేట్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి. మొత్తంగా విండ్సర్ ఈవీ సరసమైన ధర, అధిక ప్రాక్టికాలిటీ, ప్రీమియం ఫీచర్లు, నమ్మదగిన ఛార్జింగ్ నెట్‌వర్క్ కారణంగా మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.


Click it and Unblock the Notifications








