కొత్త హైబ్రిడ్ కారు అడుగుపెట్టింది.. క్యాబిన్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రీమియం ఫీలింగ్

లగ్జరీ వాహనాలకు పేరుగాంచిన లెక్సస్ (lexus), భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. RX సిరీస్‌లో భాగంగా RX 350h Exquisite అనే కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. తన విలాసవంతమైన డిజైన్, నాణ్యత గల మెటీరియల్స్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారు ప్రీమియం SUV సెగ్మెంట్‌లో వినియోగదారులకు కొత్త ఎంపికను అందిస్తుంది. లెక్సస్ ఎప్పుడూ తన కార్లలో ఫీచర్ రిచ్ క్వాలిటీ, క్లాసీ ఇంటీరియర్, నిశ్శబ్ద రిఫైన్డ్ డ్రైవ్‌కు ప్రసిద్ధి. అదే ధోరణిని కొనసాగిస్తూ ఈసారి మరింత అందుబాటు ధరలో ఒక లగ్జరీ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త RX 350h Exquisite వేరియంట్‌ను కంపెనీ రూ. 89.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తోంది.

ఇది గత లగ్జరీ వేరియంట్‌తో పోలిస్తే మరింత విస్తృత కస్టమర్ బేస్‌కి చేరుకునేలా చేస్తుంది. ఈ ధరలో లెక్సస్‌కి ప్రత్యేకమైన క్రాఫ్ట్‌మన్షిప్, నమ్మదగిన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, పూర్తి ఫీచర్లతో కూడిన ఆధునిక SUV అందుబాటులో రావడం ఒక ప్రత్యేకతే. అదనంగా కస్టమర్లు తమ వాహనాన్ని ఇంకా ప్రీమియంగా మార్చుకోవాలనుకుంటే, రూ. 2.03 లక్షల అదనపు ఖర్చుతో 21-స్పీకర్ మార్క్ లెవిన్సన్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ని పొందే అవకాశాన్ని లెక్సస్ అందిస్తోంది.

Lexus New Rx 350h Exquisite Luxury Car Launched In India At Rs 89 99 Lakh

మ్యూజిక్ లవర్స్ కోసం ఈ సౌండ్ సిస్టమ్ ప్రత్యేకమైన థియేటర్ లెవల్ ఆడియో క్వాలిటీని అందిస్తుంది. ప్రీమియం కేబిన్‌లో ఈ ఆడియో సెటప్ డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తుంది. లెక్సస్ ముందుగా అందించిన లగ్జరీ వేరియంట్ స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎక్స్‌క్విజిట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇదే సిరీస్‌లో ఇప్పటికే ఉన్న మోడళ్లతో పోల్చితే దీని డిజైన్‌లో లగ్జరీ ఫీచర్లు మాత్రం తగ్గకుండా అందించబడ్డాయి.

కొత్త Lexus RX 350h ఎక్స్‌క్విజిట్ మోడల్‌లో పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యం.. ఈ మూడు సమానంగా కలిగి ఉండే, ఆధునిక హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. ఈ వేరియంట్‌లో 2.5-లీటర్ల, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ను శక్తివంతమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపి ఉపయోగించడం వల్ల కేవలం స్మూత్ డ్రైవ్ మాత్రమే కాదు, చాలా రిఫైన్డ్, స్పందనాత్మకమైన డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది.

Lexus New Rx 350h Exquisite Luxury Car Launched In India At Rs 89 99 Lakh

ఈ హైబ్రిడ్ సిస్టమ్ 246 hp వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తిని సమర్థవంతంగా రోడ్డు మీదికి పంపించడానికి లెక్సస్ ఇందులో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ను జత చేసింది. ఇది గేర్ మార్పులను మరింత నిశ్శబ్దంగా, ఎలాంటి జర్క్‌ లేకుండా చేస్తుంది. పనితీరు పరంగా చూస్తే ఈ SUV పూర్తిగా అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. 0 నుండి 100 kmph వేగాన్ని ఇది కేవలం 7.9 సెకన్లలో చేరుతుంది.

ఈ మోడల్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని విశాలమైన క్యాబిన్. ప్రయాణికులు రిలాక్స్‌గా కూర్చునేందుకు కావాల్సిన లెగ్‌రూం, ఆర్మ్‌రూం, హెడ్‌రూం ప్రయాణికులకు కంఫర్ట్‌గా అనిపిస్తాయి. ముందు సీట్లలో 10-మార్గాల పవర్ అడ్జస్ట్మెంట్ అందించబడింది, అదీ మెమరీ ఫంక్షన్‌తో కలిసి, తద్వారా డ్రైవర్, ప్రయాణికులు తమకు నచ్చిన పొజిషన్‌ను సులభంగా సెట్ చేసుకోగలరు. వెంటిలేషన్, హీటింగ్ ఫీచర్లు ముందు & వెనుక సీట్లలో అందించారు.

Lexus New Rx 350h Exquisite Luxury Car Launched In India At Rs 89 99 Lakh

సాంకేతికత పరంగా ఈ వేరియంట్‌లో 14-అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ అమర్చబడింది, ఇది స్మార్ట్ కనెక్టివిటీ, నావిగేషన్, మీడియాను సులభంగా యాక్సెస్ చేసేలా ఉంటుంది. పార్కింగ్ లేదా ట్రాఫిక్ పరిస్థితుల్లో సహకారం అందించడానికి 360-డిగ్రీ సర్ఫౌండ్ వ్యూ కెమెరా ఉంది. భద్రతపై కూడా లెక్సస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో Level-2 ADAS, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 4, 2025, 18:54 [IST]
English summary
Lexus new rx 350h exquisite luxury car launched in india at rs 89 99 lakh
Read more on: #lexus #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+