లోకల్ మెకానిక్ vs కంపెనీ సర్వీస్.. మీ కారు ఎక్కువ కాలం మన్నాలంటే ఎక్కడ సర్వీసింగ్ చేయించాలి?

భారతదేశంలో కార్లు, బైక్‌ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వాహనాల సర్వీసింగ్ ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. వాహనం ఎక్కువ కాలం మన్నాలన్నా, మంచి పర్ఫామెన్స్ కనబరచాలన్నా క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.

అయితే, వాహన యజమానులను తరచుగా వేధించే ప్రశ్న ఏమిటంటే.. లోకల్ గ్యారేజీలో సర్వీస్ చేయించాలా, లేక కంపెనీ ద్వారా రిజిస్టర్ అయిన అధీకృత సర్వీస్ సెంటర్‌లో చేయించాలా? ఈ రెండింటిలో ఏది మీ కారుకు ఎక్కువ లైఫ్ ఇస్తుంది, దేని ద్వారా సర్వీసింగ్ చేయించుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Local Mechanic vs Company Service Which Gives Your Car a Longer Life

స్థానిక గ్యారేజ్: తక్కువ ఖర్చు, కానీ నమ్మకం ప్రశ్నార్థకం
అనధికారిక వర్క్‌షాప్‌లు లేదా లోకల్ గ్యారేజీల అతిపెద్ద ఆకర్షణ తక్కువ ధరకే సర్వీసింగ్ లభించడం. ముఖ్యంగా చిన్న పట్టణాలలో, కంపెనీ సర్వీస్ సెంటర్‌ల కంటే 30 నుండి 50 శాతం వరకు తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి చాలా మంది వీటిని ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కంపెనీ సర్వీస్ సెంటర్‎తో పోలిస్తే ధరలు దాదాపు 30 నుండి 50 శాతం వరకు తక్కువగా ఉంటాయి.

లాభాలు: ఆయిల్ మార్చడం, బ్రేక్ రిపేర్, టైర్ సర్వీస్ వంటి సాధారణ పనులు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. లోకల్ గ్యారేజీల్లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. మెకానిక్‌తో నేరుగా మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు.

Local Mechanic vs Company Service Which Gives Your Car a Longer Life

నష్టాలు: వాడిన స్పేర్ పార్టుల క్వాలిటీ పై హామీ ఉండదు. వాహనంపై కంపెనీ వారంటీ ఉంటే, లోకల్ గ్యారేజీలో పని చేయించడం వలన వారంటీ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. కొత్త టెక్నాలజీ ఉన్న వాహనాలకు (ఉదాహరణకు: ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆడాస్ సిస్టమ్ గల కార్లు) సరిగా నిర్వహించడంలో లోకల్ మెకానిక్‌లకు అవగాహన ఉండదు.

కంపెనీ సర్వీస్ సెంటర్: ఖరీదు, కానీ నమ్మకమైనది
కంపెనీ ద్వారా రిజిస్టర్ అయిన సర్వీస్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకున్న టెక్నీషియన్లు, ఓఈఎమ్ (OEM) విడిభాగాలను మాత్రమే ఉపయోగిస్తారు.

Local Mechanic vs Company Service Which Gives Your Car a Longer Life

లాభాలు: సర్వీసు సెంటర్లోని నిపుణులుకు మీ కారులోని ప్రతి భాగం, ప్రతి ఫీచర్, సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసు. అసలైన విడిభాగాలను మాత్రమే ఉపయోగిస్తారు, దీనివల్ల వెహికల్ సేఫ్టీ, పర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్, అత్యాధునిక ఆడాస్ సిస్టమ్ గల కార్లను కంపెనీ సర్వీస్ సెంటర్లలో మాత్రమే సురక్షితంగా నిర్వహించగలుగుతారు.

నష్టాలు: లోకల్ గ్యారేజీలతో పోలిస్తే ఖర్చు దాదాపు 30 నుండి 50 శాతం ఎక్కువ ఉంటుంది. సర్వీస్ కోసం కొన్నిసార్లు చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. పెద్ద సర్వీస్ సెంటర్లలో వ్యక్తిగత కస్టమర్ సంబంధాలు తక్కువగా ఉంటాయి.

ఏది ఎంచుకోవాలి?
లోకల్ మెకానిక్‌ను ఎంచుకోవాలా, కంపెనీ సర్వీస్‌ను ఎంచుకోవాలా అనే నిర్ణయం మీ కారు మోడల్, మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీ వెహికల్ పాతదై, వారంటీ కంప్లీట్ అయి ఉంటే, లోకల్ గ్యారేజ్ చవకైన, సౌకర్యవంతమైన ఆప్షన్ కావొచ్చు.

కొత్త కారు, ఈవీ లేదా హైబ్రిడ్: కొత్త టెక్నాలజీ, ముఖ్యంగా ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వెహికల్స్ కోసం తప్పకుండా కంపెనీ సర్వీస్ సెంటర్‌నే ఎంచుకోవాలి. ఇది వాహనం దీర్ఘాయుష్షు, సేఫ్టీకి తప్పనిసరి అవసరం.

చిన్న పనులు: ఆయిల్ మార్చడం లేదా బ్రేక్ ప్యాడ్స్ మార్చడం వంటి చిన్న చిన్న రిపేర్లు లోకల్ గ్యారేజీలో చేయవచ్చు, కానీ ఎల్లప్పుడూ క్వాలిటీ స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడేలా చూసుకోవాలి.

చివరగా, సరైన నిర్ణయం మీ వెహికల్ వయసు, మోడల్, టెక్నాలజీ, వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడిన సర్వీసు, నమ్మదగిన సర్వీసు మధ్య బ్యాలెన్స్ పాటించగలిగే వారే తెలివైన వాహన యజమాని.

More from DriveSpark

Article Published On: Thursday, October 23, 2025, 13:30 [IST]
English summary
Local mechanic vs company service which gives your car a longer life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+