ఒక్క ఛార్జ్‌తో 449 కి.మీ..తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. ఒక్కరోజే 150 విండ్‌సర్ ఈవీ ప్రో కార్ల డెలివరీ!

ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎంజీ మోటార్స్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు విండ్‌సర్ ఈవీ ప్రోను విడుదల చేసింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేకాదు, దీని ధర కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. విడుదలైన వెంటనే ఈ కారుకు భారీ స్పందన లభించింది. ఏకంగా ఒక్క రోజులోనే 150కార్లను డెలివరీ చేసి ఎంజీ తన సత్తా చాటింది.

భారతీయ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఒక సెన్సేషన్‎గా మారిన మోడల్ ఎంజీ విండ్‌సర్ ఈవీ (MG Windsor EV). ఒకప్పుడు మార్కెట్‌ను ఏలుతున్న టాటా నెక్సాన్ ఈవీని కూడా వెనక్కి నెట్టి దూసుకుపోతున్న ఈ వాహనానికి రేంజ్ తక్కువగా ఉందనే విమర్శలు చాలా మంది వినియోగదారులు వ్యక్తం చేశారు. ఇది గమనించిన కంపెనీ వెంటనే దీనికి పరిష్కారంతో ముందుకొచ్చింది.

MG Windsor

స్టాండర్డ్ మోడల్‌ కంటే అన్ని విధాలా 'ప్రో'గా ఒక కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. పెంచిన రేంజ్‌తో పాటు, ఫీచర్ల విషయంలోనూ అదరగొట్టిన విండ్‌సర్ ఈవీ ప్రో ధర విషయంలోనూ ఎవరినీ నిరాశపరచలేదని చెప్పాలి.

ఇప్పుడు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఎంజీ మోటార్స్ ప్రారంభించింది. బెంగళూరులో ఒక్క రోజులోనే 150 యూనిట్ల విండ్‌సర్ ఈవీ ప్రో డెలివరీలను పూర్తి చేసి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది ఈ కారు. బుకింగ్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లు పొందిన ఈ ఎలక్ట్రిక్ SUV డెలివరీలను కంపెనీ 2025 మే 16న ప్రారంభించింది.

MG Windsor EV Pro

విండ్‌సర్ శ్రేణిలో ఇది సరికొత్త టాప్-ఎండ్ వేరియంట్. స్టాండర్డ్ మోడల్‌ కంటే అనేక కొత్త ఫీచర్లతో ఈ వాహనం వస్తోంది. భారతదేశంలో రూ. 17.49 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ కారు మొదటి 8,000 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) ఎంపికలో కొనుగోలు చేసే వారికి కేవలం రూ. 12.49 లక్షలే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రారంభ ధర ముగిసిన తర్వాత విండ్‌సర్ ఈవీ ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ.18.09లక్షలకు పెరిగింది. మరోవైపు BaaSఎంచుకునే వారికి రూ.13.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. కొత్త వేరియంట్‌కు మరింత లగ్జరీ అనుభూతిని అందించడానికి ఇంటీరియర్‌ను కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్, ఐవరీ రంగుల్లో పూర్తి చేశారు. తక్కువ వేరియంట్లలో ఉన్న ఏరో వీల్స్‌కు భిన్నంగా ప్రో వేరియంట్‌కు కొత్త రూపాన్నిచ్చే కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కూడా కంపెనీ అందించింది.

MG Windsor EV Front

ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ అనే మూడు కొత్త రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది. 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు విండ్‌సర్ ఈవీ ప్రోలోని ముఖ్యమైన ఫీచర్‌లు.

ఇవి కాకుండా ట్రాఫిక్ జామ్ అసిస్ట్‌తో కూడిన లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ వంటి కొత్త ఫీచర్లను కూడా ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో వేరియంట్‌లో కంపెనీ చేర్చింది. వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్, వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ ఈ మోడల్‌కు మరింత వైవిధ్యతను అందిస్తున్నాయి.

MG Windsor EV

ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రోలో 52.9 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం పెరిగినప్పటికీ, పనితీరు గణాంకాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడిన ఈ వాహనం 134 bhp పవర్‌తో గరిష్టంగా 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో 449కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, విండ్‌సర్ ఈవీ ప్రోలో 7.4kWh ACఛార్జర్‌ను కంపెనీ అమర్చింది. ఇది బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 9.5గంటల సమయం పడుతుంది. అయితే, 50 నిమిషాల్లో 20శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయగల 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ వాహనం సపోర్ట్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 20, 2025, 13:10 [IST]
English summary
Long range ev under 14 lakh mg delivers 150 windsor evs in a single day
Read more on: #mg motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+