6 లక్షల బడ్జెట్‌లో సూపర్ కార్లు.. తక్కువ ధరలో టన్నుల కొద్దీ ఫీచర్లు.. ఈ 3 కార్లు కూడా దుమ్ము రేపుతాయ్!

టాటా పంచ్ (Tata Punch) ఒక పాపులర్ మైక్రో SUVగా మనదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది దాదాపు రూ. 6.20 లక్షల నుండి రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 18.8 నుండి 26.99 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

ఐదుగురు ప్రయాణికులకు అనుకూలమైన సీటింగ్, 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందిస్తున్నారు. అయితే, చాలా మంది వినియోగదారులు టాటా పంచ్‌కు ప్రత్యామ్నాయంగా మరికొన్ని కార్లను కూడా పరిశీలిస్తున్నారు. అవేంటో, వాటి ధర, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

Tata Punch

హ్యుండాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter): హ్యుండాయ్ ఎక్స్‌టర్ కూడా ఒక పాపులర్ మైక్రో SUV, టాటా పంచ్‌కు ఇది డైరెక్ట్ పోటీదారు. ఇది మరింత అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ధర రూ. 6.21 లక్షల నుండి రూ. 10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈ హ్యుండాయ్ ఎక్స్‌టర్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలను కలిగి ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 19.2 నుండి 27.1 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఇందులో కూడా 5 సీట్లు ఉంటాయి. 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

Nissan

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite): నిస్సాన్ మాగ్నైట్ టాటా పంచ్‌కు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 6.14 లక్షల నుండి రూ. 11.76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 17.4 నుండి 20 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

కొత్త మాగ్నైట్ బయటివైపు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది స్టార్మ్ వైట్, బ్లేడ్ సిల్వర్, సన్‌రైజ్ కూపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఓనిక్స్ బ్లాక్‌తో సహా అనేక రంగుల్లో లభిస్తుంది. ఈ SUVలో ఐదుగురు ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

Baleno

మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno): మారుతి సుజుకి బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 6.70 లక్షల నుండి రూ. 9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరకు 22.35 నుండి 30.61 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

ఈ బాలెనో కారు మరింత లేటెస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ రంగుల్లో కూడా లభిస్తుంది. 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2025, 12:10 [IST]
English summary
Looking beyond tata punch check out these 3 cars with great features and prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+