తక్కువ ధరలో ఫ్యామిలీ మొత్తం సేఫ్టీగా టూర్లకు ప్రయాణించాలా.. బెస్ట్ 7సీటర్ డీజిల్ ఎస్యూవీలు ఇవే

ఫ్యామిలీతో లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించాలని అనుకుంటే ఒక 7-సీటర్ వెహికల్ చేతిలో ఉంటే ఇంకేమీ ఆలోచించాల్సిన పనిలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రాక్టికాలిటీ, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లను సరసమైన ధరలో అందించే అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైన పని.

ఎస్‌యూవీలు ప్రస్తుతం ట్రెండింగులో ఉన్నందున తక్కువ ధరలో కొనుగోలు చేయగల కొన్ని డీజిల్ 7-సీటర్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. మీరు చాలా కాలంగా 7-సీటర్ కారు కొనాలని కోరుకుంటున్నట్లయితే ఈ మోడల్స్‌ను పరిశీలించవచ్చు.

Looking for an Affordable 7-Seater Diesel SUV Check Out These Models You Can Buy Confidently

టాటా సఫారీ (Tata Safari):
బోల్డ్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, అద్భుతమైన పర్ఫామెన్స్‎కు పేరుగాంచిన టాటా సఫారీ ఒక ప్రీమియం 6/7 సీటర్ ఎస్‌యూవీ. ఇది 170 bhp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ క్రయోటెక్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, రోల్ఓవర్ మిటిగేషన్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు సఫారీలో ఉన్నాయి. లగ్జరీ, సేఫ్టీ ఎక్కువగా ఉండే 7-సీటర్ డీజిల్ ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రూ.14.65 లక్షల నుండి రూ.25.15 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధరతో టాటా సఫారీ భారతదేశంలో అత్యంత పాపులర్ ఫ్యామిలీ ఎస్‌యూవీలలో ఒకటి.

Looking for an Affordable 7-Seater Diesel SUV Check Out These Models You Can Buy Confidently

మహీంద్రా XUV700 (Mahindra XUV700):
5 , 7 సీటర్ లేఅవుట్‌లలో లభించే మహీంద్రా XUV700 మీ మనసును గెలుచుకుంటుందనడంలో సందేహం లేదు. బోల్డ్ డిజైన్, పవర్ఫుల్ ఇంజిన్‌లు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఈ వాహనం మార్కెట్లో రూ.14.17 లక్షల నుండి రూ.23.78 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధరతో లభిస్తుంది. ఇందులో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.

7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ సూట్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఈ వాహనంలో ఉన్నాయి. లగ్జరీ, పర్ఫామెన్స్, సేఫ్టీతో కూడిన మోడల్‌ను కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎస్‌యూవీ.

మహీంద్రా స్కార్పియో N (Mahindra Scorpio N):
స్కార్పియో పేరుతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రూ.13.71 లక్షల నుండి రూ.24.24 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధర కలిగిన ఈ ఎస్‌యూవీ, పెట్రోల్‌తో పాటు డిఫరెంటు ట్యూనింగ్‌లతో కూడిన 2.2 లీటర్ ఎంహక్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఎస్‌యూవీలో ఉన్నాయి.

Looking for an Affordable 7-Seater Diesel SUV Check Out These Models You Can Buy Confidently

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic):
ఇతర ఎస్‌యూవీల మాదిరిగానే స్కార్పియో క్లాసిక్ కూడా పవర్, ఫీచర్లలో ఏమాత్రం తగ్గకుండా రోడ్డుపైకి వస్తుంది. దీనికి కూడా 2.2 లీటర్ ఎంహక్ డీజిల్ ఇంజిన్ ఉంది. పెద్ద ఫ్యామిలీలకు కూడా అనువైన విశాలమైన 7- లేదా 9-సీటర్ క్యాబిన్ లేఅవుట్‌లో అందించబడే ఈ మోడల్‌కు రూ.13.03 లక్షల నుండి రూ.16.76 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధర ఉంటుంది.

మహీంద్రా బోలెరో (Mahindra Bolero):
మహీంద్రా బోలెరో ఒక స్ట్రాంగ్, నమ్మకమైన, ప్రాక్టికాలిటీ ఎస్యూవీ. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ మోడల్‌కు రూ.9.29 లక్షల నుండి రూ.11.50 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ ధర ఉంటుంది. సరసమైన ధర కావడంతో, ఇది లగ్జరీ కంటే పవర్, లో మెయింటెన్స్ ఖర్చు కావాలనుకునే వాళ్లకు బెస్ట్ ఛాయిస్.

More from DriveSpark

Article Published On: Sunday, October 5, 2025, 7:11 [IST]
English summary
Looking for an affordable 7 seater diesel suv check out these models you can buy confidently
Read more on: #mahindra #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+