తక్కువ ధరలో కొత్త కారు కొనాలా? రూ. 3.25 లక్షల నుంచి లభిస్తున్న పేద-మధ్యతరగతి మోడళ్లపై ఓ లుక్ వేయండి
ఇండియాలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు టూవీలర్ కలిగి ఉండటం వారి కలగా ఉండేది. అయితే రాను రాను ఆ ధోరణి మారిపోయింది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరలో అయిన లభించే వాటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లోకి పేద,మధ్య తరగతి కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహన తయారీదారులు సైతం బడ్జెట్ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉండే కార్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చాలా కార్లు ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్నాయి. కొత్తగా ఆకర్షణీయమైన డిజైన్‌తో బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్స్‌తో కారును సొంతం చేసుకోవాలని అనుకుంటున్న వారికి మార్కెట్లో లభిస్తున్న అలాంటి కొన్ని మోడళ్ల గురించి కింది కథనంలో అందించడం జరిగింది. ఆ కార్ల గురించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం.
అతి తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి సౌరశక్తితో అలాగే, ఎలక్ట్రిక్‌తో రన్ అయ్యే వేవ్ మొబిలిటీ ఎవా కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పేద, మధ్య తరగతి కస్టమర్లకు ఇది అత్యంత అనువైన మోడల్. దీని రూఫ్ పైన ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ ద్వారా శక్తిని పొందుతుంది. దీంతో డ్రైవింగ్ పరిధిని 10 కి.మీ వరకు వస్తుంది. తర్వాత బ్యాటరీ శక్తితో ప్రయాణిస్తుంది.

ఇది 12.6, 18 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌తో ఏకంగా 250 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జింగ్ వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇది 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ప్రారంభ ధర రూ.3.25 లక్షల నుంచి మొదలుకుని రూ.4.49 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
బడ్జెట్ ధరలో లభిస్తున్న కార్లలో మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో K10 దేశంలో ఒక ప్రసిద్ధ కారుగా ఉంది. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 4.09 లక్షల నుంచి మొదలుకుని రూ. 6.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు పెర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా అనిపిస్తుంది. పెట్రోల్‌తో CNG లో కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయంలో కస్టమర్లను అసంతృప్తికి గురిచేయదు.

మారుతీ సుజుకీ ఆల్టో K10 24.39 నుంచి 33.85 kmpl మైలేజీని అందించడం విశేషం. చిన్న ఫ్యామిలీ వినియోగదారులకు ఇది బెస్ట్ కారు. బడ్జెట్ ధరలో లభిస్తూనే అధునాతన ఫీచర్స్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. క్యాబిన్ లోపల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ వంటి పలు ఫీచర్స్‌లో వివిధ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.
మరో దిగ్గజ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌కు చెందిన క్విడ్ దేశంలో మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఇది రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల మధ్య కొనుగోలుకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. మైలేజ్ విషయానికి వస్తే, 21.46 నుండి 22.3 kmpl వరకు అందిస్తుంది. ఈ కారు చిన్న ఫ్యామిలీకి అత్యంత అనువుగా ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు పవర్ విండోలు, కీలెస్ ఎంట్రీ, ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు వంటి పలు భద్రత ప్రమాణాలను ఈ కారులో అందించారు.


Click it and Unblock the Notifications








