విమానంలో కాదు.. కార్లోనే ఫస్ట్ క్లాస్ ఫీల్! ఇంధ్రభవనం లాంటి కారు బుకింగ్స్ మళ్లీ స్టార్ట్

లెక్సస్ ఇండియా తాజాగా తన ప్రసిద్ద లగ్జరీ MPV మోడల్ LM 350hకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. తాజాగా ఈ కారు కోసం మళ్లీ బుకింగ్‌లను ప్రారంభించింది. దీన్ని మార్చి 2024లో భారత మార్కెట్లో విడుదల చేసింది. విలాసవంతమైన ప్రయాణానికి పేరుగాంచిన ఈ లగ్జరీ ఎంపీవీకి పెరుగుతున్న డిమాండ్‌తో పాటు సరఫరా పరిమితులు ఎదురవడంతో, 2024 సెప్టెంబరులో కంపెనీ తాత్కాలికంగా బుకింగ్‌లను నిలిపివేసింది. ఇప్పటికే పొందిన ఆర్డర్‌లను సకాలంలో డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మోడల్‌కు నిరంతరంగా వస్తున్న డిమాండ్, కస్టమర్ల ఆసక్తి తగ్గకపోవడంతో మళ్లీ బుకింగ్‌లను ఓపెన్ చేసింది. ఈ కారు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది కంపెనీ నుంచి వచ్చిన పెద్ద గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.

లెక్సస్ LM 350h మళ్లీ బుకింగ్‌కు అందుబాటులోకి రావడం లగ్జరీ MPV విభాగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలుస్తోంది. వినియోగదారులు తమ కలల కారును సొంతం చేసేందుకు మళ్లీ అవకాశం పొందారు. ఈ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, 2024 మార్చిలో లెక్సస్ ఇండియా విడుదల చేసిన LM 350h ప్రారంభ ధర రూ.2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

Luxury Car Lexus Lm 350h Mpv Bookings Openend

ఇది కేవలం ఓ ప్రయాణ వాహనం మాత్రమే కాక, ఒక పర్సనల్ లగ్జరీ లౌంజ్ అనిపించేలా ఉంటుంది. లగ్జరీకి ఒక కొత్త నిర్వచనాన్ని ఈ మోడల్ వినూత్నంగా ఉంటుంది. ఈ కారు అత్యాధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 2.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 246 bhp పవర్, 239 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ శక్తివంతమైన ఇంజిన్‌కు e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడినది, ఇది డ్రైవింగ్ అనుభవాన్ని అత్యంత స్మూత్‌గా మారుస్తుంది. ఇంటీరియర్ చాలా విశాలంగా ఉండటం కారణంగా లోపల కూర్చున్న వారు లగ్జరీ ఫీలింగ్‌ను పొందుతారు. లాంగ్ రైడ్స్ అయినా, షార్ట్ ట్రిప్స్ అయినా, ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా ఒక క్లాస్-అప్ అనిపిస్తుంది. ఈ కారులో కూర్చుంటే, ఒక విమానంలో ఫస్ట్ క్లాస్ సూట్‌లో కూర్చొన్న అనుభూతిని కలిగించేలా నిర్మించారు.

m 350h Mpv Bookings Reopened

దాని డిజైన్, ఇంటీరియర్ భాగాల ఆకృతి, వినియోగదారులకు బాగా నచ్చే మంచి థీమ్ సెటప్ అన్ని కూడా కారు డిమాండ్‌ను పెంచేలా చేశాయి. ఈ MPV నాలుగు సీట్ల సెటప్‌తో వస్తుంది, రెండవ వరుసలో ఉన్న సీట్లు విమానాల్లో ఉండే సీట్లలా డిజైన్ చేయబడ్డాయి. వీటిని పూర్తి స్థాయిలో వెనక్కి వాల్చుకోవచ్చు, పాదాల కోసం ప్రత్యేక లెగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని వల్ల ప్రయాణికులకు మంచి విశ్రాంతి లభిస్తుంది.

ఇంటీరియర్‌లో విలాసవంతమైన అనుభూతిని కలిగించేలా రూపొందించారు. 48 అంగుళాల స్క్రీన్, 23-స్పీకర్ మార్క్ లెవిన్సన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ప్రైవేట్ హోం థియేటర్ అనిపించేలా ఉంటుంది. ప్రయాణంలో ఎప్పుడూ చల్లగా ఉండేందుకు బిల్ట్-ఇన్ ఫ్రిడ్జ్, హాయిగా తల వాల్చేందుకు దిండు-రకం హెడ్‌రెస్ట్‌లు ఉండడం ఈ కారును మరింత ప్రత్యేకంగా చేశాయి.

Luxury Car Lexus Lm 350h Mpv Bookings

ప్రయాణ సమయంలో అవసరమైన ప్రతి చిన్న చిన్న అంశాన్ని కూడా లెక్సస్ పరిగణలోకి తీసుకుంది, ఫోల్డబుల్ టేబుళ్లు, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, USB ఛార్జింగ్ పోర్టులు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రీడింగ్ లైట్స్, లగ్జరీ గ్లాసెస్ స్టోరేజ్, అంబ్రెల్లా హోల్డర్ వంటివి కారులో ఉన్నాయి. అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్, కొత్త సెన్సార్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ లోపల కూర్చున్న ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా క్యాబిన్ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 8, 2025, 10:50 [IST]
English summary
Luxury car lexus lm 350h mpv bookings reopened full details check here
Read more on: #lexus #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+