ఈ కారు కావాలంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే 3ఏళ్ళు ఆగాల్సిందే.. ఆ విషయంలో ఇండియా రికార్డు ..!
ఇండియాలో కూడా కార్ల మార్కెట్ భారీగా పెరిగిపోతుంది. కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే మిడ్ సైజ్ కార్ల నుంచి లగ్జరీ కార్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాలో లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా లంబోర్ఘినీ, మెర్సిడెస్-మేబ్యాక్ వంటి బ్రాండ్లు రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.
లంబోర్గిని భారతదేశంలో కొత్త అమ్మకాల రికార్డును నెలకొల్పింది. ఈ కారు కావాలంటే 2027వరకు ఆగాల్సిందే. అంటే 2027 వరకు బుకింగ్‌లు బుక్ అయ్యాయి. దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతున్నందున ఈ వాహనాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, పోర్స్చే, రోల్స్-రాయిస్, లంబోర్గిని వంటి బ్రాండ్లు ముఖ్యంగా యువ కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతున్నాయి.

కరోనా మహమ్మారి పోయినప్పటి నుంచి గత మూడు సంవత్సరాలలో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగింది. లంబోర్గిని ఛైర్మన్, సీఈవో స్టీఫెన్ వింకెల్మాన్ ఇండియా మార్కెట్ ప్రాముఖ్యతను గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. "ఇండియా మాకు పెద్ద ప్రాపర్టీ. భవిష్యత్తులో మార్కెట్ పెరిగే కెపాసిటీ భారీగా ఉంది. ఇండియాలో లంబోర్గిని కొనుగోలుదారు చేసే వాళ్లు 40ఏళ్ల లోపు వాళ్లే. చైనా తర్వాత ఇండియా మాకు మెయిన్ కస్టమర్ బేస్'' అని అన్నారు.
2024లో లంబోర్గిని ఇండియాలో113 కార్లను విక్రయించింది. ఇది 2023 కంటే 10శాతం ఎక్కువ, మొదటి సారిగా మూడంకెల అమ్మకాల స్థాయిలను లంబోర్గిని దాటింది. ఆ కంపెనీ మోడళ్లైన హురాకాన్, ఉరుస్, వోలువో ధర రూ. 4 కోట్ల నుంచి రూ. 8.89 కోట్ల వరకు ఉంటాయి. ఈ వాహనాలు పూర్తిగా డెవలప్ అయి దిగుమతి చేసుకున్నందున 100శాతం దిగుమతి సుంకం విధిస్తారు.

ఇండియాలో ఆ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటైన ఉరుస్ SUVకంపెనీ అమ్మకాల్లో సగం ఇదే ఉంటుంది. కంపెనీ ఆర్డర్లు వచ్చే ఏడాదిన్నర పాటు పూర్తిగా నిండిపోయాయి. ఇండియా ఇతర మార్కెట్ల కంటే చిన్నది. ఇక్కడ కస్టమర్ల సగటు వయస్సు 40కంటే తక్కువ. ఇది చైనా తర్వాత రెండవ తక్కువ కాలంలో పెద్ద మార్కెట్‌గా నిలిచింది. ఈ మార్పు వల్ల లంబోర్గిని అమ్మకాలు భవిష్యత్‌లో భారీగా ఉంటాయని అర్థం అవుతుంది.
మెర్సిడెస్ మేబ్యాక్ ఇండియాలో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024లోనే వారు అమ్మకాలలో గణనీయంగా 145శాతం పెరుగుదలను చూశారు. మెర్సిడెస్-మేబాచ్ గ్లోబల్ హెడ్ డేనియల్ లెస్కోవ్ మాట్లాడుతూ.. "భారతదేశం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మా టాప్ 10 మార్కెట్లలో ఒకటి. త్వరలోనే టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. ఇతర కంపెనీలకు లేని కొత్త మార్కెట్‌ను ఇక్కడ ఉపయోగించుకునే అవకాశం.. లగ్జరీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న కోరిక చాలా బాగుంది" అన్నారు.

మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ ఇండియా అంతటా రూ. 4.2 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయిస్తున్నారు. లంబోర్గిని, మెర్సిడెస్ మేబ్యాక్ రెండూ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించాలని, అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
లంబోర్గిని ఇండియాలో తన నాల్గవ షోరూమ్‌ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే మెర్సిడెస్ మేబ్యాక్ అమ్మకాల పరిమాణం పరంగా ఇండియాలో టాప్ ఐదు మార్కెట్లలో ఒకటిగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా 4 మిలియన్ల వార్షిక వాహన మార్కెట్లో లగ్జరీ కార్లు కేవలం 1శాతం మాత్రమే ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : లంబోర్గిని, మెర్సిడెస్ వంటి బ్రాండ్లు ఆధిపత్యం చెలాయించే ఈ విభాగంలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇండియన్స్ హై-ఎండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం ప్రారంభించారు. అయితే 2027 వరకు బుకింగ్‌లు అవ్వడంతో దానిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న వాళ్లు దిగ్భ్రాంతి చెందుతున్నారు.


Click it and Unblock the Notifications








