అమ్మకాల్లో రికార్డులు బద్దలు! మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓకు ఎందుకింత క్రేజ్?

భారతీయ మార్కెట్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో తనదైన ముద్ర వేసిన కార్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) ఒకటి. ఈ కారు 2025 మార్చి నెల అమ్మకాల నివేదిక తాజాగా విడుదలైంది. దాని ప్రకారం మహీంద్రా ఈ ఒక్క నెలలోనే ఏకంగా 7,055 ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కార్లను విక్రయించి అదరగొట్టింది.

అయితే, గత 2024 మార్చి నెలలో ఈ సంఖ్య కేవలం 2,072 మాత్రమే. దీని ద్వారా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ అమ్మకాల్లో ఏకంగా 240 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది నిజంగా అద్భుతమైన పెరుగుదల అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి ఆదరణకు కారణం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Mahindra XUV 3XO Price

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారు వినియోగదారులు పెట్టిన డబ్బుకు పూర్తి విలువనిచ్చే ప్రొడక్ట్‎గా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర కేవలం రూ. 7.99 లక్షలు మాత్రమే. మరోవైపు టాప్ వేరియంట్ ధర రూ. 15.56 లక్షలు మాత్రమే. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ముందుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారులోని ఫీచర్ల జాబితాను చూద్దాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారులో 7 స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వెనుక ఏసీ వెంట్స్, ముందు భాగంలో వెంటిలేషన్ కలిగిన సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ఆకర్షించే రూపం కొనుగోలు దారులను ఎట్రాక్ట్ చేస్తుంది.

Mahindra XUV 3XO Front

అంతేకాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో పుష్కలంగా అందించారు.

సేఫ్టీ విషయానికి వస్తే, అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ (ADAS - అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ కూడా తన కార్లలో ప్రయాణికుల భద్రతకు పెద్ద పీఠ వేస్తోంది.

Mahindra XUV 3XO Features

పర్ఫామెన్స్ విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ TGDi పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ అనే మొత్తం 3 ఇంజన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగానే ఇది 7.99-15.56 లక్షల రూపాయలకు విలువైన ప్రొడక్టుగా పరిగణిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి బ్రెజ్జా (Maruti Brezza), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet), స్కోడా కైలాక్ (Skoda Kylaq), రెనాల్ట్ కైగర్ (Renault Kiger),నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) వంటి కార్లకు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఒక ప్రత్యామ్నాయం అని మా అభిప్రాయం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 10:15 [IST]
English summary
Luxury cars beware mahindra xuv 3xo priced so low showrooms are overflowing
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+