మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌కు జపాన్‌లో సెన్సేషన్ డిమాండ్! జిమ్నీ కారును కావాలంటున్న అక్కడి జనం!
దేశీయ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాలో ప్రతి ఏడాది వాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో కార్లను విడుదల చేస్తూ, ఇతర వాహనాల తయారీ కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంది. లోకల్‌గా కార్లను విక్రయిస్తూ అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాలకు కూడా తన మోడళ్లను ఎగుమతి చేస్తుంది. ఆఫ్‌రోడ్ కింగ్ అయినటువంటి మారుతీ 3-డోర్ జిమ్నీ (3-Door Jimny) కారును ఇక్కడే తయారు చేయడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఆ తరువాత 2023లో 3-డోర్ వెర్షన్‌ను మరింత అప్‌డేట్ చేసి 5-డోర్ జిమ్నీని తీసుకొస్తామని ప్రకటించగా, తన మాటను కూడా నిలబెట్టుకుంది. భారత్‌లో ఈ మోడల్‌కు అంతగా ఆదరణ లభించలేదు. ప్రధానంగా మహీంద్రా థార్ కారణంగా జిమ్నీని తక్కువ కొనుగోలు చేశారు.
థార్‌కు వచ్చిన డిమాండ్‌లో కనీసం సగం వరకు కూడా ఈ మోడల్ సంపాదించలేకపోయింది. భారతీయ మార్కెట్లో జిమ్నీఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికి, ఈ ఆఫ్‌రోడ్ కారును విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇండియాలో తయారైన 5-డోర్ జిమ్నీని మారుతీ జపాన్‌కు ఎగుమతి చేసింది. మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఇకపై జపాన్ రోడ్లపై సందడి చేయడానికి సిద్ధమైంది. అక్కడ ఈ కారుకు మంచి డిమాండ్ ఉందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారతదేశంలో ప్రత్యేకంగా తయారు అయిన జిమ్నీ 5-డోర్‌లో రైట్-హ్యాండ్ డ్రైవ్ (RHD), ఎడమ చేతి డ్రైవ్ (LHD) మోడళ్లను అక్కడి ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మారుతీ సుజుకీ జపాన్‌లో ప్రస్తుతం అక్కడే స్థానికంగా తయారు చేసిన జిమ్నీ 3-డోర్‌ను మోడల్‌ను విక్రయిస్తుంది. ఇప్పుడు వాటి ప్రక్కన మేడ్ ఇన్ ఇండియా 5-డోర్ జిమ్నీ అందబాటులో ఉంచన్నారు. ఈ మెడల్‌ను జపాన్‌లో 'జిమ్నీ నోమాడ్' అని పిలుస్తారు.
మారుతీ సుజుకీ కొన్ని నెలల క్రితం భారత్ నుంచి ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ SUVని జపాన్ దేశానికి ఎగుమతి చేసింది. ఇక్కడే తయారైన ఈ కారుకు అక్కడి మార్కెట్‌లో విపరీతమైప ఆదరణ లభించింది. దీంతో కంపెనీ 5-డోర్ జిమ్నీ ఎస్‌యూవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆశించిన ఫలితాన్ని ఇవ్వని మోడల్‌ను అక్కడ మాత్రం విజయవంతం చేయాలని పట్టుదలతో కృషి చేస్తుంది. మొదటి దశ షిప్‌మెంట్ అక్కడికి చేరుకుంది.

కొన్ని రోజుల్లో వీటిని షోరూమ్‌లకు చేరవేస్తారు. ప్రస్తుతం అక్కడ అమ్మకానికి అందుబాటులో ఉన్న జిమ్నీ 3-డోర్‌ను కొసాయ్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ జపాన్‌లో 600సీసీ ఇంజిన్‌తో జిమ్నీ స్టాండర్డ్‌ను, అలాగే 1.5 లీటర్ ఇంజిన్‌తో జిమ్నీ సియెర్రాను అక్కడి వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అయితే జిమ్నీ పేరులో కస్టమర్లు గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త 5-డోర్‌కు జిమ్నీ నోమాడ్ అని పేరు పెట్టారు.
జపాన్‌లో విక్రయించబడనున్న మోడల్, ఇండియా దానితో పోలిస్తే స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. జపాన్ ఉద్గార నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా దీని ఇంజిన్‌లో మార్పులు ఉంటాయి. జిమ్నీ నోమాడ్ ఫీచర్స్ ఇండియా మోడల్‌లాగానే ఉంటాయి. ఇది 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనికి 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఈ కారును అధికారికంగా అక్కడ అమ్మకానికి అందుబాటులో ఉంచడానికి ముందు సుజుకి జిమ్నీ నోమాడ్ 5-డోర్ SUV బుకింగ్స్‌ను తాజాగా తెరిచారు. దీంతో కస్టమర్లు దీన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జిమ్నీ సియెర్రా 3-డోర్‌ని బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ కొత్త 5 డోర్ మోడల్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో వీరికే ముందు ప్రాధాన్యత ఇస్తారు.


Click it and Unblock the Notifications








