మహీంద్రా కార్లపై మోజు.. వీటి కోసం షోరూమ్‌కు క్యూ కట్టిన జనం.. డిజైన్, ఫీచర్లకు అట్రాక్ట్

దేశీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా తన కార్ల సేల్స్‌లో మంచి వృద్ధిని కనబరుస్తుంది. తాజాగా 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గత నెలలో కంపెనీ మొత్తం 69,768 యూనిట్ల వాహనాలను విక్రయించి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విషయాన్ని మహీంద్రా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌లో 41,424 యూనిట్ల వాహనానాలను విక్రయించి ఏకంగా 18 శాతం వృద్ధిని సాధించింది. అదే ఎగుమతులతో కలుపుకుని మొత్తం యుటిలిటీ వాహనాల సేల్స్ 42,958 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ రావడంతో కంపెనీ అమ్మకాలు పుంజుకున్నాయి. ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో 19,502 యూనిట్లు అమ్ముడుపోయాయి.

వాహన పరిశ్రమ రంగంలో గత కొంత కాలంగా సానుకూలమైన వృద్ధి కనబడుతుంది. దేశీయ వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ వస్తుండటంతో పాటు, అంతర్జాతీయంగా కూడా ఇండియాలో తయారైన వాహనాలకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో ఇక్కడి కంపెనీలు పోటి పడుతూ, సరికొత్త వాహనాలను ప్రజలకు అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పెరిగిన ఈ పోటీని మహీంద్రా కంపెనీ సైతం తట్టుకోడానికి అధునాతన వాహనాలను విడుదల చేస్తుంది.

Mahindra Car Sales

మహీంద్రా వాణిజ్య వాహనాల విక్రయాలతో పాటు, ప్యాసింజర్ వాహనాల విభాగంలో కూడా వృద్ధి సానుకూలంగా ఉంది. FY2025 మొత్తం ఎగుమతుల్లో 22 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే దేశంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. దీంతో వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో దేశీయంగా ట్రాక్టర్ల సేల్స్ పుంజుకుని డిసెంబర్ నెలలో 22,019 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే మంచి వృద్ధి కనబడింది.

2023 ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 ఇదే నెలలో ట్రాక్టర్ల సేల్స్ 22 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ అమ్మకాలు పెరగడంపై మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ నక్రా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, డిసెంబర్‌లో మొత్తం 69,768 వాహనాలను విక్రయించి 16 శాతం వృద్ధిని సాధించాం, అదే సమయంలో 41,424 SUVలను విక్రయించి 18 శాతం వృద్ధిని నమోదు చేశామని ఆయన తెలిపారు.

డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్(DJSI) వరల్డ్ లీడర్ హోదాను సాధించిన ఏకైక భారత కంపెనీగా మహీంద్రా నిలిచింది. ఇంతటి ఘనతను సాధించడం చాలా సంతోషకరం అని విజయ్ నక్రా ఒక ప్రకటనలో అన్నారు. ఆటోమొబైల్ రంగంలో DJSI ర్యాంకింగ్‌ను కంపెనీ పనితీరును ప్రతిబింబిస్తుంది. ప్రపంచ ఆటోరంగ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను రూపొందించడంలో ఇది అత్యంత ముఖ్యమైనది.

మహీంద్రా కంపెనీ మార్కెట్లో మెజారిటీ వాటాను సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇటీవల రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసి ఈవీ మార్కెట్లో తన సత్తాను చూపించడానికి సిద్ధమైంది. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ ( XEV 9e) ఎలక్ట్రిక్ కారు ధర రూ.21.90 లక్షలు, బిఈ 6ఇ (BE 6e) ధర రూ.18.90 లక్షలుగా ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు.

ఇండియాలో ఇప్పడు ఈవీల హవా నడుస్తున్న సమయంలో మహీంద్రా ఈవీ కార్లతో సంచలనానికి తెర లేపింది. ఈ రెండు కార్లు డ్రైవర్-సెంట్రిక్ క్యాబిన్‌ల‌ను కలిగి ఉంటాయి. వీటి లోపల అధునాతన థీమ్ ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్లకు మాత్రం ఎలాంటి కొదవ లేదు. క్యాబిన్‌లో డజన్ల కొద్ది ఉన్నాయి. మహీంద్రా అడ్రినాక్స్ సాఫ్ట్‌వేర్ అనుకూలించే మూడు 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, సెఫ్టీ ప్రమాణాలు వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2025, 10:36 [IST]
English summary
Mahindra automotive sales 16 percent increase in 2024 december
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+