ఈ కార్లు జనాలకు విపరీతంగా నచ్చాయి.. మొదటి రోజే కొన్ని వేలమంది ఎగబడ్డారు.. ఇది ఊహించని రెస్పాన్స్!

భారత్‌లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా దేశీయ వినియోగదారుల కోసం అధునాతన కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. అందుకే కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. గత ఏడాది మహీంద్రా(Mahindra) దేశీయ మార్కెట్లో XEV 9e, BE 6 అనే ఎలక్ట్రిక్ SUV లను విడుదల చేసింది. ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇవి అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ కార్ల తయారీదారులకు సైతం బలమైన ప్రత్యర్థిగా నిలవబోతున్నాయి. మహీంద్రా శుక్రవారం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశీయ వినియోగదారులు ఈ కార్లను పోటీ పడి బుకింగ్ చేసుకున్నారు.

కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం, ఒకే రోజు రికార్డు స్థాయిలో XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ SUVలకు బుకింగ్స్ వచ్చాయి. మొదటి రోజే మొత్తం 30,179 బుకింగ్స్‌ కస్టమర్ల నుంచి వచ్చాయి. వీటి ద్వారా దాదాపు రూ. 8,472 (ఎక్స్-షోరూమ్) కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. కస్టమర్ల నుంచి అంచనాలకు మించి స్పందన రావడంతో కంపెనీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahindra Ev Cars Bookings Open

ఈ సంఖ్యలు చూసినట్లయితే మహీంద్రా ఎలక్ట్రిక్ SUV లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. మొదటి రోజు జరిగిన బుకింగ్స్‌లలో XEV 9e మోడల్‌ను ఎక్కువ మంది కస్టమర్లు బుకింగ్ చేసుకున్నారు. మొత్తం సంఖ్యలో దీని వాటా 56 శాతంగా ఉంది. అదే మరో మోడల్ BE 6 EVకి దాదాపు 44 శాతం బుకింగ్స్ వచ్చాయి. ఈ రెండు అధునాతన డిజైన్లతో, లేటెస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి.

XEV 9e ఎలక్ట్రిక్ SUVకి 16,900 ఆర్డర్లు వచ్చాయి. అదే BE 6 ఎలక్ట్రిక్ SUVకు 13,279 ఆర్డర్‌లు వచ్చాయి. డిమాండ్ పరంగా మార్కెట్లో రెండింటికి కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వీటిలో టాప్ ఎండ్ వేరియంట్లను చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. ప్రీమియం ఫీచర్ల పరంగా కస్టమర్లకు సంతృప్తిని ఇస్తాయి. ఇండియాలో మొదటి రోజు అత్యధికంగా బుకింగ్స్ అందుకున్న మోడల్‌గా XEV 9e రికార్డు సృష్టించింది.

Mahindra Be 6 And Xev 9e Bookings

గతంలో మొదటి రోజు అత్యధికంగా బుకింగ్స్ సాధించిన రికార్డు MG విండ్సర్ EV కి ఉంది, ఇది 15,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను అందుకుంది. ఇప్పుడు దానికంటే ఎక్కువగా మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ SUVకి 16,900 ఆర్డర్లు రావడం విశేషం. భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడి మార్కెట్‌ను ఛేజిక్కించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న టెస్లా కంపెనీకి ఈ కొత్త కార్ల లాంచ్‌తో మహీంద్రా గట్టి పోటీ ఇచ్చినట్లయింది.

మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ SUV ధర రూ.21.90 లక్షల నుండి మొదలవుతుంది. అదే BE 6 ధర రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆటోమొబైల్ పరిశ్రమలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలదే ట్రెండింగ్‌గా ఉంది. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న చాలా మోడళ్లలో ఈవీలే ఉంటున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా కార్లు కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

Be 6 And Xev 9e 30179 Bookings On First Day

డిమాండ్ మేరకు మహీంద్రా కంపెనీ ఇప్పటికే XEV 9E, BE6 కార్ల ఉత్పత్తిని మొదలుపెట్టింది. అనుకున్నదాని కంటే ఎక్కువ బుకింగ్స్ రావడంతో ఇప్పుడు ఈ ఉత్పత్తిని మరింత వేగవంత చేసింది. బుకింగ్ చేసుకున్న వారికి మార్చిలో డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు కార్లను కలిపి 2,281 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 17, 2025, 9:20 [IST]
English summary
Mahindra be 6 and xev 9e recorded 30179 bookings on first day full details check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+