మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ క్రేజ్ మామూలుగా లేదు.. రాత్రింబవళ్లు కార్ల తయారీకి కష్టపడుతున్న కంపెనీ

మహీంద్రా సంస్థ ఇటీవల విడుదల చేసిన BE 6 ఎలక్ట్రిక్ కారు బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ కారు మార్కెట్‌లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే విపరీతమైన బుకింగ్స్‌ను పొందింది. మొదటగా 300 యూనిట్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించుకున్న మహీంద్రా, పెరిగిన డిమాండ్ కారణంగా ఇప్పుడు ప్రొడక్షన్‌ను 999 యూనిట్లకు పెంచింది. బుకింగ్స్ భారీగా పెరగడంతో ప్రతి కస్టమర్‌కి ఈ కారు అందుబాటులో ఉండేలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కారు కోసం ఆగస్టు 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అధికారిక బుకింగ్స్ ఆగస్టు 23 ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. బుకింగ్ కోసం రూ.21,000 చెల్లించాలి. ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లు తమకు నచ్చిన బ్యాడ్జ్ నంబర్ (001-999)ను ఎంచుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20, అంటే ఇంటర్నేషనల్ బ్యాట్‌మ్యాన్ డే రోజున ఈ కారు డెలివరీలు మొదలవుతాయి.

Mahindra BE 6 Batman Edition Car Production Tripled Due to Overwhelming Demand

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు కేవలం దాని పవర్‌ఫుల్ ఇంజిన్ తోనే కాకుండా, దాని డిజైన్ తోనూ ఆకట్టుకుంటుంది. ఇది ఆల్-బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ కావడంతో బ్యాట్‌మ్యాన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎక్స్‌క్లూజివ్ సాటిన్ బ్లాక్ కలర్ పెయింట్, ముందు డోర్స్‌పై కస్టమ్ బ్యాట్‌మ్యాన్ డికాల్స్, వెనుక భాగంలో BE 6 × ది డార్క్ నైట్ బ్యాడ్జింగ్ ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

కారు వీల్స్‌కు సంబంధించి ఇందులో R20 అల్లాయ్ వీల్స్ ఉండటం వల్ల మరింత దూకుడుగా కనిపిస్తుంది. అలాగే సస్పెన్షన్ కాంపోనెంట్స్ కు అల్కెమి గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం విశేషం. కారు లోపల కూడా పూర్తిగా బ్యాట్‌మ్యాన్ థీమ్‌ను అనుసరించి డిజైన్ చేశారు. స్టీరింగ్ వీల్, సీట్లు, డ్యాష్‌బోర్డ్ ఇలా అన్నింటిలో బ్యాట్‌మ్యాన్ థీమ్‌కు సంబంధించిన చిన్న చిన్న డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.

Mahindra BE 6 Batman Edition Car Production Tripled Due to Overwhelming Demand

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ మెకానికల్‌గా స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఇది పెద్ద 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ రేంజ్ కారణంగా ఇది లాంగ్ డ్రైవ్స్ కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

59 kWh వేరియంట్ 230 bhp పవర్‌ను జనరేట్ చేయగా, 79 kWh వెర్షన్ 285 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. రెండు మోడల్స్‌లో టార్క్ మాత్రం 380 Nm ఉంటుంది. ఈ కారు ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇది 175 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

మహీంద్రా ఈ కారును రూ.27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ ధరలో ఇంత మంచి పర్ఫామెన్స్, రేంజ్ ఉన్న కారు రావడం వల్ల దీనికి ఇంత భారీ స్పందన వచ్చిందని నిపుణులు అంటున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 22, 2025, 13:30 [IST]
English summary
Mahindra be 6 batman edition car production tripled due to overwhelming demand
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+