ఛార్జింగ్ టెన్షన్ లేదు..రోడ్లు బాగోలేదన్న బాధలేదు..ఈ కారు ఎక్కితే రాకెట్ లా దూసుకుపోవాల్సిందే
మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూకుడు పెంచుతోంది. ఇటీవల విడుదల చేసిన తమ ప్రముఖ ఎలక్ట్రిక్ మోడల్ BE 6 ఎస్‌యూవీ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఊహించని విజయాన్ని సాధించింది. కేవలం కొన్ని సెకన్లలోనే 999 కార్లు అమ్ముడవడంతో ఇప్పుడు మహీంద్రా సంస్థ మరో స్పెషల్ ఎడిషన్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు పూర్తిగా ఆఫ్-రోడ్ లుక్‌లో ఉన్న కొత్త ఎస్‌యూవీ BE Rall-E టీజర్‌ను కూడా విడుదల చేసింది.
మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ విజయం సాధించడంతో కంపెనీ ఇప్పుడు తదుపరి స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఫార్ములా E ఛాంపియన్‌షిప్‌లో మహీంద్రా పాల్గొనడం, దాని పనితీరు నుంచి స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ కూడా త్వరలోనే బహుశా నవంబర్ 26, 2025 నాడు ఆవిష్కరించవచ్చు.

గత ఆగస్టులో విడుదలైన బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన సాటిన్ బ్లాక్ కలర్, గోల్డ్ యాక్సెంట్‌లు, ది డార్క్ నైట్ థీమ్‌తో ఇంటీరియర్ అంశాలు ఉన్నాయి. మొదట 300 కార్లు మాత్రమే అనుకున్నా, భారీ డిమాండ్ కారణంగా ఉత్పత్తిని 999 కార్లకు పెంచారు.. అన్నీ సెకన్లలో అమ్ముడయ్యాయి.
మరోవైపు మహీంద్రా తమ పూర్తిస్థాయి ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE Rall-E టీజర్‌ను విడుదల చేసింది. ఇది నవంబర్ 26, 2025 న అధికారికంగా ప్రదర్శించబడుతుంది. ఈ మోడల్ Mahindra XEV 9S 7-సీటర్ ఎస్‌యూవీ తో పాటు కనిపిస్తుంది. టీజర్‌లో గుండ్రటి ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ రూఫ్ లైన్ కనిపిస్తున్నాయి.

BE Rall-E లో BE 6 లో ఉన్న 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ 286bhp పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 550 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఇవ్వగలదని అంచనా. ఇందులో హెచ్‌యూడీ, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 ఏడీఏఎస్, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
BE 6 అనేది మహీంద్రా ఇంగ్లో స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేసిన మూడవ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV). ఈ కారు 59 kWh, 79 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 542 కి.మీ నుంచి 656 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది.

ఇందులో 5 సీట్లు, 455 లీటర్ల బూట్ స్పేస్, డ్యూయల్ స్క్రీన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16-స్పీకర్ హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరాలు వంటి అనేక హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా 2024 నవంబర్‌లో BE 6, XEV 9E కార్లను విడుదల చేసింది. ఇప్పటివరకు 30,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించింది.


Click it and Unblock the Notifications








