కొత్త మహీంద్రా కారు ముందు దిగ్గజ ఫార్చ్యూనర్ కారు జూజూబీ.. ప్రూఫ్ కావాలంటే ఈ వీడియో చూడండి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్‎యూవీని లాంచ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిని హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారుకు పోటీగా తన బీఈ 6(BE6)కారును ఆవిష్కరించింది. డ్రైవింగ్‌ అవసరాలు, వేర్వేరు ప్రాధాన్యతలకు అనుగుణంగా వెరైటీ వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రతి వేరియంట్లో అడ్వాన్స్‎డ్, బ్లెండింగ్ పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ, డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

జనవరిలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు భారతీయులను మాత్రమే కాకుండా విదేశీలను సైతం ఫిదా చేశాయి. జపాన్, కొరియా నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఆ కార్లను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఆ సమయంలో మహీంద్రా తన ఫ్యూచర్ కార్ల ప్రివ్యూతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Mahindra BE 6 vs Toyota Fortuner Price

ఆ కంపెనీ ఇండియాలో తన మొదటి బెస్పోక్ ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌తో నిర్మించిన BE6ని లాంచ్ చేసింది. ఈ కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు రూపొందించారు. ఇటీవల ఓ రోడ్డు మీద ఫార్చ్యూనర్ పక్కన వెళుతున్న వీడియో వైరల్ అయింది. ఈ మహీంద్రా BE 6 EV దాని రోడ్డు ప్రజెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫార్చ్యూనర్ దేశంలో సక్సెస్ ఫుల్ 7సీటర్ ఆఫ్ రోడింగ్ ఎస్‎యూవీ అన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఫార్చ్యూనర్‌కు ఇండియాలో పోటీదారుడు లేడు. 2021వరకు ఫోర్డ్ ఎండీవర్ దీనికి గట్టి పోటీ ఇచ్చినా నేడు అది లేదు. కాబట్టి, ప్రస్తుతానికి, ఫార్చ్యూనర్ దాని రేంజ్ లో టాప్ ఎస్‎యూవీగా కొనసాగుతోంది. మరోవైపు, మహీంద్రా కొత్త BE6 కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యూచర్ సూచిస్తుంది. ఇది బెస్పోక్ ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన మహీంద్రా మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ SUV. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఇది అమ్ముడవుతుంది.

Mahindra BE 6

మహీంద్రా BE6 రోడ్ ప్రజెన్స్, సాటిలేని దిగ్గజం ఫార్చ్యూనర్‌తో పోలిస్తే కూడా చాలామంది నుంచి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహీంద్రా BE6, టయోటా ఫార్చ్యూనర్ ఒకదానికొకటి పోటీ పడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. BE6 తో పోలిస్తే ఫార్చ్యూనర్ కొంచెం ఇరుకుగా కనిపిస్తోంది. అయితే ఫార్చ్యూనర్ పొడవుగా, ఎత్తుగా ఉంటుంది. కానీ BE6మాత్రం వెడల్పుగా ఉంది.

ఫార్చ్యూనర్ స్పెసిఫికేషన్లు: టయోటా ఫార్చ్యూనర్ ఎస్‎యూవీ ధర రూ. 33.78 లక్షల నుంచి రూ. 51.94 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఆఫ్షన్లలో లభించే 2.7లీటర్ పెట్రోల్ ఇంజిన్ 164 బిహెచ్‌పి పవర్, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.8లీటర్ టర్బో ఇంజన్ 201బిహెచ్‌పి పవర్, 420ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Mahindra BE 6 vs Toyota Fortuner Road

మహీంద్రా BE 6 స్పెసిఫికేషన్లు: మహీంద్రా BE 6 ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లు 59 kWh,79 kWhతో వస్తుంది. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 535 కి.మీ, 682 కి.మీ.ల పరిధిని అందిస్తాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 288బిహెచ్‌పి పవర్, 380ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది కేవలం 6.7 సెకన్లలోనే గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 175 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో, పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 20 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 16:09 [IST]
English summary
Mahindra be 6 vs toyota fortuner the new electric suv that s winning hearts
Read more on: #mahindra #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+