టాటాకు టెన్షన్ పెంచుతున్న మహీంద్రా.. హారియర్ ఈవీ కంటే తక్కువ ధరకే 500కిమీ రేంజ్ ఇచ్చే కార్లు

భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వార్ పీక్స్‎కు చేరింది. ఒక పక్క టాటా మోటార్స్ తమ కొత్త హారియర్ ఎలక్ట్రిక్ SUVతో దూసుకొస్తుంటే.. దానికి పోటీగా మహీంద్రా తమ BE 6, XEV 9e మోడళ్లను అప్‌డేట్ చేసి రంగంలోకి దింపింది.

జూలై 2, 2025న హారియర్ ఈవీల బుకింగ్స్ మొదలు కాగానే మహీంద్రా వెంటనే తమ కొత్త ప్రణాళికలను ప్రకటించింది. మహీంద్రా తమ ఎలక్ట్రిక్ SUVల ప్యాక్ 2 ట్రిమ్ ధరలను, డెలివరీ తేదీలను వెల్లడించింది. దీనితో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పోటీ మరింత వేడెక్కింది.

Mahindra

మహీంద్రా ఇప్పుడు తమ BE 6, XEV 9e మోడళ్లను రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తోంది. అవి 59kWh, 79kWh. ఇంతకుముందు పెద్ద బ్యాటరీ ప్యాక్ కేవలం టాప్ మోడల్ ప్యాక్ 3లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్యాక్ 2 ట్రిమ్ బుక్ చేసుకున్న వారు కూడా పెద్ద బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యంగా హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే.. 79kWh బ్యాటరీతో వచ్చే మహీంద్రా మోడళ్లు, అవే ఫీచర్లు ఉన్న టాటా హారియర్ ఈవీ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఇది కచ్చితంగా మహీంద్రాకు పెద్ద ప్లస్ పాయింట్.

Mahindra Electric Car

ప్యాక్ 2 వేరియంట్ల కస్టమర్ డెలివరీలు జూలై చివరి నాటికి మొదలవుతాయి. ధరల విషయానికి వస్తే మహీంద్రా BE 6 ప్యాక్ 2 ట్రిమ్ 59kWh వెర్షన్ ధర రూ.21.90 లక్షలు, మహీంద్రా BE 6 ప్యాక్ 2 ట్రిమ్ 79kWh వెర్షన్ ధర రూ.23.50 లక్షలుగా నిర్ణయించారు.

చిన్న బ్యాటరీ(59kWh)తో 400 కిలోమీటర్ల వరకు, పెద్ద బ్యాటరీ(79kWh)తో 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయని మహీంద్రా చెబుతోంది. ఇది చాలా ఆకర్షణీయమైన రేంజ్. మహీంద్రా ఎలక్ట్రిక్ SUVల ప్యాక్ 2 వేరియంట్లు అదిరిపోయే ఫీచర్లతో నిండి ఉన్నాయి.

ఫుల్ గ్లాస్ రూఫ్, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, రేస్-రెడీ డిజిటల్ కాక్‌పిట్, ప్రీమియం సేజ్ లెథరెట్ ఇంటీరియర్, డాల్బీ అట్మోస్‌తో 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‎తో వస్తుంది.

XEV 9e ఎలక్ట్రిక్ SUV (XEV 9e Electric SUV) విషయానికి వస్తే XEV 9e ప్యాక్ 2 ట్రిమ్ 59 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ. 24.90 లక్షలు (ఎక్స్-షోరూమ్), XEV 9e ప్యాక్ 2 ట్రిమ్ 79 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ. 26.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా నిర్ణయించారు.

Tata

ఈ ఎలక్ట్రిక్ SUV రియర్ వీల్ డ్రైవ్ మోడల్. దీని వెనుక భాగంలో అమర్చిన మోటార్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో 282bhp పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 59 kWh యూనిట్‌లో కూడా పవర్ అవుట్‌పుట్ దాదాపు ఇదే ఉంటుంది.

రెండు EVలు కూడా 11.2kW AC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ట్రిపుల్-స్క్రీన్ వైడ్ సినిమాస్కోప్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, వయర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్లు, వైర్లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ప్రీ-ఇన్‌స్టాల్డ్ OTT యాప్‌లు, మంచి సౌండ్ కోసం అకోస్టిక్ లామినేటెడ్ డోర్ గ్లాస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మహీంద్రా BE 6, XEV 9e రెండు మోడళ్ల ప్యాక్ 2 ట్రిమ్‌ల ధరలు, టాటా హారియర్ ఈవీ ఫియర్‌లెస్ ప్లస్, ఎంపవర్డ్ వేరియంట్ల కంటే తక్కువ. టాటా హారియర్ EV ఎంపవర్డ్ 75 వేరియంట్ ధర రూ.27.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

XEV 9e ప్యాక్ 2 వేరియంట్ ధర దీనికంటే దాదాపు రూ.లక్ష తక్కువ. టాటా హారియర్ EV ఫియర్‌లెస్ ప్లస్ 65 వేరియంట్ ధర రూ. 23.99 లక్షలు.. మహీంద్రా BE 6 ప్యాక్ 2 ధర దీనికంటే రూ.49,000 తక్కువ.

టాటా హారియర్ EV ఫియర్‌లెస్ ప్లస్ 75 వేరియంట్ ధర రూ. 24.99 లక్షలు.. మహీంద్రా BE 6 ప్యాక్ 2 (79kWh) ధర దీనికంటే రూ.1.49 లక్షలు తక్కువకే లభిస్తుంది. కొత్త బ్యాటరీ ప్యాక్‌లను అందించి, ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా, మహీంద్రా తమ రెండు ఈవీల ఆకర్షణను పెంచగలదని ఆశించవచ్చు. ఈ పోటీతో కస్టమర్‌లకు మంచి డీల్స్, ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో కొత్త జోష్‌ను నింపుతుంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్, అధునాతన ఫీచర్లను అందిస్తే కస్టమర్లు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఈ పోటీ వల్ల భవిష్యత్తులో మరింత మంచి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2025, 8:51 [IST]
English summary
Mahindra be 6 xev 9e new battery options cheaper than harrier ev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+