ఇదెక్కడి కారు భయ్యా! 135 సెకన్లలో కార్లన్నీ కొనేశారు.. మహీంద్రా BE6 హిస్టరీ క్రియేట్ చేసింది!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మహీంద్రా (Mahindra), ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా, తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించేందుకు వినూత్నమైన ప్రయత్నం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి, ప్రత్యేకమైన BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EVని ఆవిష్కరించింది. డిజైన్‌లోనే కాకుండా, పనితీరులోనూ సరికొత్త అనుభవాన్ని అందించేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు. బ్యాట్‌మ్యాన్‌ డార్క్ నైట్ స్టైల్, స్పెషల్ గ్రాఫిక్స్, ప్రత్యేక ఇంటీరియర్ టచ్‌లు ఈ వాహనానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. మొదట్లో ఈ ప్రత్యేక ఎడిషన్ EVని కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాలని మహీంద్రా నిర్ణయించింది.

అయితే, కస్టమర్ల నుంచి వస్తున్న ఆసక్తి, డిమాండ్ అంచనాలకు మించి పెరిగింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ కారుకు ఉన్న క్రేజ్ చూసి, కంపెనీ తక్షణమే నిర్ణయం మార్చుకుని ఉత్పత్తిని 999 యూనిట్లకు పెంచింది. ఆ తర్వాత బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్ విండో ఓపెన్ చేసిన క్షణం నుంచి, కేవలం కొన్ని సెకన్లలోనే బుకింగ్ వేగం ఆశ్చర్యపరిచేలా మారింది.

Mahindra Be6 Batman Ev Bookings 999 Units Sold In 135 Seconds Details

మొదటి రెండు నిమిషాలు కూడా పూర్తికాకముందే కేవలం 135 సెకన్లలోనే మొత్తం 999 యూనిట్లు బుక్ అయ్యాయి. ఈ వేగం మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EV ఎంతగానో ఎదురుచూస్తున్నారని, భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న నమ్మకం, ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. తమ వాహనాలకు టెక్నాలజీతో పాటు సాంస్కృతిక టచ్ ఇవ్వడం ద్వారా వినియోగదారుల హృదయాలను గెలుచుకోవడంలో మహీంద్రా మరోసారి విజయవంతమైంది.

ఈ ప్రత్యేక BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EV డెలివరీలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయని సమాచారం. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం ద్వారా అధికారికంగా డెలివరీ ప్రకటన వెలువడే అవకాశముంది. ధర విషయానికి వస్తే, ఈ ప్రీమియం ఎడిషన్ EV రూ.27.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో మాత్రమే దీన్ని అందిస్తున్నారు, అందులో ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకతను ప్రతిబింబించే డిజైన్ టచ్‌లు ఇచ్చారు.

Mahindra Be6 Batman Ev Bookings 999 Units Sold In 135 Seconds Details

డార్క్ కలర్ థీమ్‌తో ఈ కారు మొత్తం డిజైన్ ఒక సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా ఉంటుంది. బ్యాట్‌మ్యాన్ యూనివర్స్‌ నుండి ప్రేరణ పొందిన స్టైలింగ్ ఎలిమెంట్స్, ప్రత్యేక లైటింగ్ సెటప్, ఆటోమోటివ్ డిజైన్‌లో నూతనతను తెచ్చాయి. ఇది సాధారణ EVల మాదిరి కాకుండా, ఆటోమొబైల్ డిజైన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కల్చర్‌ను మిళితం చేసిన ప్రత్యేక మోడల్‌గా నిలుస్తోంది.

BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌లో 79kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ 286 bhp శక్తిని, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరులో ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్ SUV అనిపించేలా ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ARAI ధృవీకరించిన రేంజ్ 682 కి.మీ.గా ఉంటుంది. కానీ నిజ జీవిత డ్రైవింగ్‌లో, ఎయిర్ కండిషనింగ్ ఆన్‌లో ఉన్నప్పటికీ 500 కి.మీ.కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Mahindra Be6 Batman Ev Bookings 999 Units Sold In 135 Seconds Details

ఛార్జింగ్ సామర్థ్యానికి వస్తే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న DC ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్థాయి పనితీరు, ప్రత్యేకమైన డిజైన్, అరుదైన లిమిటెడ్ ఎడిషన్ స్టేటస్.. ఇవన్నీ కలిపి BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EVని భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలబెడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, August 24, 2025, 11:15 [IST]
English summary
Mahindra be6 batman ev bookings 999 units sold in 135 seconds details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+