ఒకే కారులో 9 మంది.. రెండు కుటుంబాలకు బెటర్ చాయిస్ ఇదే! మార్కెట్లో దీనికి డిమాండ్ పీక్స్‌లో..

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (Mahindra) అనే పేరు వినిపిస్తే, అది విశ్వసనీయతకు ప్రతీకగా గుర్తింపు పొందింది. దేశంలోని ప్రతి తరానికి, ప్రతి వర్గానికి చేరువైన బ్రాండ్‌గా మహీంద్రా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన మోడల్ మహీంద్రా బొలెరో (Bolero). ఇది కేవలం ఒక SUV మాత్రమే కాదు, భారతదేశపు రోజువారి జీవితానికి దగ్గరగా ఉన్న వాహనం అని చెప్పొచ్చు. 2000 సంవత్సరంలో మొదటిసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన బొలెరో, రెండు దశాబ్దాలకుపైగా కాలాన్ని విజయవంతంగా దాటింది. ఈ కాలంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో, అలాగే బొలెరో కూడా తనను తాను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగింది.

నేటికీ బొలెరోను ఆదరించే వారి సంఖ్య విశేషంగా పెరిగింది. మార్కెట్లో ఇప్పటివరకు 1.4 మిలియన్లకుపైగా యూనిట్లు అమ్ముడవడం ప్రజాదరణకు నిదర్శనం. బొలెరో విజయానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత, మరమ్మత్తు ఖర్చులు తక్కువగా ఉండటం. గ్రామీణ రోడ్లు, గుంతలైనా, పర్వత ప్రాంతాల ఎత్తైన మార్గాలైనా బొలెరో ఆగకుండా ముందుకు సాగుతుంది. ఇలాంటి దృఢమైన పనితీరు కారణంగానే రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, సాహస ప్రియులందరికీ ఒకే స్థాయిలో నమ్మకాన్ని కల్పించింది.

Mahindra Bolero 1 4 Million Sales Units Crossed

దీని పెర్ఫామెన్స్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి ఆదరణ లభించడానికి మరో కారణం మారుతున్న కాలానికి అనుగుణంగా మహీంద్రా కంపెనీ మార్పులు చేస్తూ వస్తోంది. కొత్త తరానికి సరిపోయేలా, యువతను ఆకర్షించే విధంగా బొలెరోకి ఆధునిక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బొలెరో నియో(Bolero Neo) అనే కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది సాంప్రదాయ బొలెరో దృఢత్వాన్ని కొనసాగిస్తూ, మరింత ఆధునిక ఫీచర్లతో, స్పోర్టీ డిజైన్‌తో రూపొందించబడింది.

బొలెరో నియోలో లభించే మాస్ లుక్, బలమైన ప్రెజెన్స్, అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ కారణంగా బాగా ఆదరణ పొందుతోంది. ఈ SUV ధరను చూస్తే, ఆ ప్రైస్ రేంజ్‌లో ఇంత క్లాస్, కంఫర్ట్ కలిగిన వాహనాలు చాలా అరుదు. అందుకే గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ బొలెరో ఇంకా ప్రజల తొలి ఎంపికగానే నిలుస్తోంది. కాలం ఎంత మారినా తన స్థానాన్ని కోల్పోకుండా నిలిచిపోయే ఒక భారతీయ లెజెండ్ అని చెప్పవచ్చు.

Mahindra Bolero 1 4 Million Sales Units Crossed

కొత్త మహీంద్రా బొలెరో నియో తన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని వేరియంట్ల విషయానికి వస్తే, బొలెరో నియో ఐదు వేరియంట్లలో N4, N8, N10, N10 (O), N11లలో లభిస్తుంది. ఈ వేరియంట్లు వినియోగదారుల అవసరాలను బట్టి అందుబాటులో ఉన్నాయి. ధర పరంగా చూస్తే, ఇది రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తోంది, ఇది తన సెగ్మెంట్‌లో చాలా పోటీదారంగా ఉంది.

ఇంజిన్ శక్తి విషయానికి వస్తే, మహీంద్రా బొలెరో, బొలెరో నియో మధ్య గణనీయమైన తేడా కనిపిస్తుంది. సాంప్రదాయ బొలెరోలో 1.5 లీటర్ 3-సిలిండర్ డీజిల్ ఇంజన్ (mHawk 75) ఉంది, ఇది 75 bhp పవర్, 210 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే బొలెరో నియోలో మరింత శక్తివంతమైన mHawk 100 ఇంజిన్ అందించారు, ఇది 98-100 bhp పవర్, 240-260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Mahindra Bolero 1 4 Million Sales Units Crossed

డిజైన్ పరంగా బొలెరో నియో ఒక ఆధునిక, స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ఇందులో కొత్త బాడీ-రంగు గ్రిల్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, విద్యుత్తుతో నియంత్రించబడిన డ్యూయల్-టోన్ ORVMలు, DRLలతో కూడిన హెడ్‌లైట్లు, అలాగే 15/16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ ఫీచర్లు కేవలం లుక్ మాత్రమే కాకుండా, వాహనానికి ప్రీమియం టచ్‌ను కూడా ఇస్తాయి. బొలెరో నియో ఇప్పుడు మొత్తం తొమ్మిది రంగుల్లో లభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, October 10, 2025, 13:08 [IST]
English summary
Mahindra bolero 1 4 million sales units crossed all details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+