మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి బొలెరో వచ్చేసింది.. కొత్త బోల్డ్ ఎడిషన్ అదిరిపోయింది!
మహీంద్రా కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ బొలెరో దేశంలో చాలా కాలంగా అమ్మకానికి ఉంది. 2000వ సంవత్సరంలో మార్కెట్‌లో అడుగుపెట్టి, రెండు దశాబ్దాలకుపైగా భారతీయుల మదిలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మహీంద్రా వాహనం, నిజంగా ఒక లెజెండ్ అని చెప్పాలి. పట్టణాల్లో తక్కువగా కనిపించినా, గ్రామీణ భారత్‌లో ఇది ఒక సంచలనం. పొలాలు, పల్లెలు, ఎత్తైన ప్రాంతాలు, లోతైన దారులు,, ఎక్కడైనా కూడా రయ్ మంటూ దూసుకుపోయే పనితీరుతో బొలెరో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. గంభీరమైన డిజైన్, మెరుస్తున్న మెటల్ బాడీ, శక్తివంతమైన ఇంజిన్ కలిగిన బొలెరో వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మల్టీ పర్పస్ వాహనంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, దీని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
స్కార్పియో తరువాత మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత విజయవంతమైన మోడల్‌గా నిలిచిన బొలెరో సరికొత్తగా వచ్చింది. తాజాగా కంపెనీ బొలెరో, బొలెరో నియో కొత్త బోల్డ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. పేరు చెప్పినట్లుగానే, మరింత ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. బొలెరోకు ఎప్పటికీ ప్రాక్టికల్ SUVగా పేరున్నా, కొత్త బోల్డ్ ఎడిషన్ మాత్రం దానికే స్టైలిష్ టచ్‌ను జోడిస్తోంది. టెక్నాలజీ పరంగా పెద్దగా మారనప్పటికీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి.

ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే ,ఇప్పటికే ఉన్న టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా తీసుకుని మరింత కాస్మెటిక్ అప్‌డేట్‌లతో తయారుచేయబడింది. యాంత్రికంగా పెద్దగా మార్పులేమీ లేవు. కానీ కారుకి మాస్ అట్రాక్షన్ రావాలంటే ముందు భాగంలో అప్‌డేట్స్ ముఖ్యం కాబట్టి, ఈ డిజైన్ అప్‌డేట్ ఖచ్చితంగా కొత్తగా కనిపించేలా చేస్తుంది. బోల్డర్ గ్రిల్స్, డార్క్ టోన్ ఫినిష్, ప్రత్యేకమైన బాడీ డెకల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి హైలైట్లు ఇందులో ఉంటాయి.
బొలెరో, బొలెరో నియో బోల్డ్ ఎడిషన్లను మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లను పరిచయం చేసింది. ఈ బోల్డ్ ఎడిషన్లలో డాష్‌బోర్డ్ డిజైన్ యథావిధిగా కొనసాగుతున్నా, పూర్తిగా నల్లటిగా మార్చిన ఇంటీరియర్ మాత్రం ఈ మోడళ్లకు క్లాసిక్ అనుభూతిని అందిస్తుంది. లోపల సీట్లు బ్లాక్ కలర్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉండటం కారణంగా ఆకట్టుకుంటుంది. స్టీరింగ్ వీల్, మెత్తని మెడ దిండ్లు, సీట్ బెల్ట్ కవర్లను కూడా జోడించారు.

మహీంద్రా బొలెరో బోల్డ్ ఎడిషన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన మోటార్ 74.9 bhp పవర్, 210 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ స్పెసిఫికేషన్ చూస్తే ఇది నిత్య జీవిత ప్రయాణాల్లో, ముఖ్యంగా రూరల్, అట్టడుగు ప్రాంతాల్లో వారికి బాగా సెట్ అవుతుంది. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు ఈ రోజుల్లో డిమాండ్ ఉన్న, బొలెరోలో ఇంకా ఆ ఫీచర్ అందుబాటులో లేదు.
బొలెరో నియో బోల్డ్ ఎడిషన్ మరింత శక్తివంతమైన 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 98.5 bhp పవర్,, 260 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనే వస్తోంది. శక్తి పరంగా చూస్తే, బొలెరో నియో, బొలెరో కంటే కొంచెం ఎక్కువ పనితీరును చూపిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








