ఒకే కారులో 9 మందిని తీసుకెళ్లొచ్చు.. 25 ఏళ్లు గడిచినా దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నడుస్తున్న మహీంద్రా (mahindra) కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన వాహనాలకు ఎప్పటిలాగే మంచి ఆదరణ లభిస్తోంది. అందులోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్ మహీంద్రా బొలెరో (bolero). ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు, కొత్త ఫీచర్లు మార్కెట్లోకి వచ్చినా, బొలెరోకి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ మార్కెట్లో బొలెరో తన సొంత ఇమేజ్‌తో నిలదొక్కుకుని, సాదాసీదా డిజైన్‌కి సరిపడే దృఢమైన పనితీరు, మన్నిక, నమ్మకంతో కస్టమర్ల మనసు గెలుచుకుంది. ఈ మోడల్ విడుదలై ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా అయినప్పటికీ, బొలెరోపై ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే కుటుంబ అవసరాలకు సరిపోయే వాహనం కావడంతో, చాలా మంది ఇప్పటికీ దీన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు.

ఇక అమ్మకాల విషయానికి వస్తే, 2025 ఆగస్టు నెలలో కూడా బొలెరో తన సత్తా చాటింది. ఒక్క ఆగస్టు నెలలోనే 8,109 యూనిట్లు విక్రయించబడింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 6,494 యూనిట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి. ఈ వృద్ధి బొలెరోపై ఇంకా ఎంత విశ్వాసం ఉందో చూపిస్తుంది. మార్కెట్లో ఎన్నో కొత్త SUVలు వరుసగా లాంచ్ అవుతున్నప్పటికీ, బొలెరోకు మాత్రం ఉన్న ప్రజాదరణ ఎప్పటికీ తగ్గట్లేదు.

Mahindra Bolero August 2025 Sales 25 Percent Growth Compared To Previous

ఇది కేవలం ఒక వాహనం కాదు, చాలా మంది కోసం కుటుంబంలో ఒక భాగంలా, నమ్మకమైన మోడల్‌గా నిలుస్తుంది. 25 ఏళ్ల తర్వాత కూడా బొలెరో అమ్మకాలు ఇంత బలంగా కొనసాగుతుండటం నిజంగా ప్రత్యేకమే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ కారుకు డిమాండ్ పెరగడానికి దాని సీటింగ్ కెపాసిటీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది వేరియంట్‌ను బట్టి 5 లేదా 9 సీట్ల కెపాసిటీతో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

ప్రస్తుతం బొలెరో మొత్తం మూడు వెర్షన్లలో మహీంద్రా బొలెరో, బొలెరో నియో, మహీంద్రా బొలెరో నియో ప్లస్ లలో అందుబాటులో ఉంది. మొదటగా, క్లాసిక్‌గా పేరుపొందిన మహీంద్రా బొలెరో ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.9.81 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.10.93 లక్షలు. ఈ వెర్షన్ పూర్తిగా 7-సీటర్ SUVగా మాత్రమే లభిస్తోంది. ఫ్యామిలీకి సరిపోయే స్పేస్, డ్యూరబుల్ డిజైన్‌తో ఇది ఇప్పటికీ ఎక్కువ ఆదరణ పొందుతోంది.

Mahindra Bolero August 2025 Sales 25 Percent Growth Compared To Previous

బొలెరో నియో, స్టైలిష్ ఫీచర్లతో వస్తూ, యువతరాన్ని ఆకట్టుకునే SUVగా నిలుస్తోంది. దీని ఎంట్రీ వేరియంట్ ధర రూ.9.97 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.12.18 లక్షలు. బొలెరో నియో కూడా 7-సీటర్ SUVగా అందుబాటులో ఉండి, బడ్జెట్‌లో బలమైన SUV కావాలనుకునే వారికి సరైన ఆప్షన్ అవుతోంది. ఇక బొలెరో నియో ప్లస్ విషయానికి వస్తే, ఇది మరింత స్పేస్, ఎక్కువ సీటింగ్ ఆప్షన్లతో ప్రత్యేకతను సంపాదించుకుంది.

దీని ఎంట్రీ-లెవల్ ధర రూ.11.41 లక్షలు, టాప్-ఎండ్ ధర రూ.14.06 లక్షలు. ఇందులో 9-సీటర్ ఆప్షన్ అందుబాటులో ఉండడం దీన్ని కుటుంబ పెద్దలకు లేదా ట్రావెల్ అవసరాలకు బాగా సరిపడే వాహనంగా మారుస్తోంది. అంతేకాకుండా, కంపెనీ బొలెరో నియో ప్లస్‌లో ఒక ప్రత్యేకమైన వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. అదే 5-సీటర్ అంబులెన్స్ వేరియంట్. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా రవాణా చేయడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.

Mahindra Bolero August 2025 Sales 25 Percent Growth Compared To Previous

మొత్తంగా చూసుకుంటే, బొలెరో సిరీస్ కేవలం SUV కాకుండా, అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది. క్లాసిక్ బొలెరో రూరల్, సెమీ-అర్బన్ యూజర్లకు, బొలెరో నియో యంగ్ జనరేషన్‌కు, బొలెరో నియో ప్లస్ పెద్ద ఫ్యామిలీలకు లేదా కమర్షియల్ అవసరాలకు సరిపోతుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా వీటి ధరలు తగ్గనున్నాయి. బొలెరో ధర గరిష్టంగా రూ.1.14 లక్షలు, బొలెరో నియో రూ.1.27 లక్షలు, నియో ప్లస్ ధర రూ.1.15 లక్షలు తగ్గనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2025, 9:33 [IST]
English summary
Mahindra bolero august 2025 sales 25 percent growth compared to previous
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+