దేశంలో ఎక్కువగా ఈ కంపెనీ కార్లను మాత్రమే జనాలు కొంటున్నారు.. ప్రస్తుతం 3వ స్థానం ఈ కంపెనీదే!
దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా... భారత మార్కెట్లో 'తగ్గేదేలే' అన్నట్లుగా దూసుకుపోతోంది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ.. తమ కార్ల విక్రయాల్లో జోరు చూపెడుతోంది. ప్రతి నెలా విడుదలయ్యే కార్ల సేల్స్ రిపోర్ట్‌లో ఎప్పుడైనా సరే మారుతీ సుజుకీ సంస్థ అగ్రస్థానంలో కనిపిస్తుంటుంది. అయితే రెండు, మూడు స్థానాల కోసం మాత్రం హ్యూందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. 2025 జనవరి నెల సేల్స్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే... 2.12 లక్షల యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ సంస్థ ఎప్పటిలానే అగ్రస్థానంలో కొనసాగింది. అయితే.. ఈసారి అనూహ్యంగా మహీంద్రా సంస్థ ఆ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ విశేషాలు తదితర అంశాలను ఈ కథనంలో పూర్తిగా చూసేద్దాం.
గత కొన్ని సంవత్సరాలుగా సేల్స్ పరంగా రెండో స్థానాన్ని దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ సంస్థ ఆక్రమిస్తూ ఉండేది. అయితే.. కొన్ని నెలల క్రితం నుంచి అమ్మకాల్లో హ్యూందాయ్‌కు సవాల్ విసురుతూ టాటా మోటార్స్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది. 2024 డిసెంబరు నెల అమ్మకాల్లోనూ రెండో స్థానాన్ని టాటా మోటార్స్ సంస్థనే సొంతం చేసుకుంది. కానీ, 2025 జనవరి నెలకు వచ్చేసరికి ఈ లెక్కలు మారిపోయాయి.

టాటా సంస్థ రెండో స్థానాన్ని కోల్పోవడమే కాకుండా మూడో స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కైవసం చేసుకుంది. జనవరి నెలలో మహీంద్రా సంస్థ ఏకంగా 50,659 కార్లను విక్రయించింది. ఒక్క నెలలో 50,000 కార్లను మహీంద్రా సంస్థ గతంలో ఫెస్టివ్ సీజన్‌లో మాత్రమే విక్రయించగలిగింది.
2024 డిసెంబరు నెలలో మహీంద్రా సంస్థ 41,424 కార్ల అమ్మకాలు జరపింది. ఇక 2024 జనవరి నెలలో 43,068 కార్లను విక్రయించింది. ఇది ఈ ఏడాది జనవరి నెలలో 18శాతం వృద్ధి కావడం గమనార్హం. ఇటీవలే మహీంద్రా బీఈ6, మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ వాహనాలు లాంఛ్ చేసిన ఈ సంస్థ.. ఈ వాహనాల డెలివరీలను గనుక మెదలుపెడితే సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

టాటా మోటార్స్ సంస్థ జనవరి నెల సేల్స్‌లో నాలుగో స్థానానికి పరిమితమైంది. గత నెలలో టాటా సంస్థ 48,316 కార్లను విక్రయించింది. ఇది 2024 జనవరి నెలతో పోలిస్తే 11శాతం తక్కువ. టాటా మోటార్స్ కంటే మహీంద్రా సంస్థ 2,600 కార్లను అధికంగా విక్రయించింది.
దేశీయ మార్కెట్లో టాటా సంస్థ 48,076 కార్లను విక్రయించింది. విదేశీ ఎగుమతలు పరంగా చూస్తే.. 240 కార్లతో అంతకుముందు ఏడాది 400 కంటే తక్కువ నమోదు చేసింది. మరోవైపు... హ్యూందాయ్ సంస్థ అమ్మకాలు మాత్రం జనవరి నెలలో కొద్ది మేర పెరిగాయి.

హ్యూందాయ్ సంస్థ గత నెలలో 65,063 యూనిట్లను విక్రయించగా.. ఇందులో దేశీయంగా 54,003 కార్లు, అంతర్జాతీయంగా 11,600 కార్లు ఉన్నాయి. హ్యూందాయ్ నుంచి క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీ 18,522 యూనిట్ల అమ్మకాలతో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానున్న నేపథ్యంలో ఈ కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ఈ పై నాలుగు కంపెనీలకు జనవరి నెల మంచి ఫలితాలనే ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ, వీటన్నింటిలో మహీంద్రా సంస్థ మాత్రం కీలకమైన వృద్ధి నమోదు చేసినట్లు కనబడుతోంది. మహీంద్రా, టాటా సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను రానున్న నెలల్లో తీసుకురానున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకే కాకుండా ఈవీ సెగ్మెంట్ మొత్తంగా అమ్మకాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








