మిడ్ సైజ్ ఎస్‎యూవీ అమ్మకాల్లో తోపు అనిపించుకున్న మహీంద్రా.. టాటా కూడా దీని వెనుకే

ఇండియా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో మూడోస్థానంలో ఉంది. కొన్నాళ్లుగా సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కు గుడ్ బై చెప్పి ఎస్‎యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కంపెనీలు కూడా ఈ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలోనే మార్కెట్ ఎక్కువగా నడుస్తోంది.

గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎస్ యూవీలకు మంచి డిమాండ్ వస్తోంది. సాధారణంగా, SUVలు వివిధ రకాల బాడీ స్టైల్స్‌లో అమ్ముడవుతుంటాయి. వాటిలో మిడ్ సైజ్ ఎస్ యూవీలు ఒకటి. 4.4 మీటర్ల నుండి 4.7 మీటర్ల వరకు పొడవు కలిగిన మిడ్-సైజు SUVలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. వాటికి సంబంధించిన ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యాయి.

Mahindra Sales

ఫిబ్రవరి నెలలో ఇండియాలో మొత్తం 28,204 మిడ్-సైజ్ ఎస్ యూవీలు అమ్ముడయ్యాయి. అంటే ఫిబ్రవరి 2024 ఇదే సమయంలో 30,386 మిడ్-సైజ్ SUVలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విషయంలో ఇండియాలో మిడ్-సైజ్ SUVల అమ్మకాలు 2,182 యూనిట్లు తగ్గాయి.

ఎప్పటి లాగే మహీంద్రా స్కార్పియో ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసిన మిడ్ సైజ్ ఎస్ యూవీగా అగ్రస్థానంలో ఉంది. గత నెలలో అమ్ముడైన మహీంద్రా స్కార్పియో కార్ల సంఖ్య 13,618. జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ స్కార్పియో నెలవారి అమ్మకాలను పరిశీలిస్తే కాస్త క్షీణత నమోదైంది.

Mahindra XUV

ఎందుకంటే గతేడాది ఫిబ్రవరి నెలలో మొత్తం 15,051 స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. అదేవిధంగా, జనవరి 2025లో 15,442 స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. ఈ విషయంలో ఫిబ్రవరిలో అమ్ముడైన స్కార్పియో కార్ల సంఖ్య సాధారణంతో పోలిస్తే 1500-1800 యూనిట్లు తగ్గినట్లు తెలుస్తోంది.

మహీంద్రా స్కార్పియో కార్లు రెండు వేర్వేరు మోడళ్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్. ఈ ర్యాంకింగ్‌లో స్కార్పియో తర్వాత మహీంద్రా ప్రొడక్ట్స్ 2వ, 3వ స్థానంలో ఉన్నాయి. దీని అర్థం ఇండియాలో అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న వాహనాలు మహీంద్రా తయారు చేసినవే.

Mahindra XEV

రెండవ స్థానంలో ఉన్న మహీంద్రా XUV700 ఫిబ్రవరిలో 7,468 యూనిట్లను విక్రయించింది. ఈ XUV700 అమ్మకాల సంఖ్య గతేడది ఫిబ్రవరి కంటే 922 యూనిట్లు ఎక్కువ అయినప్పటికీ 2025 జనవరితో పోల్చుకుంటే మాత్రం 931 యూనిట్లు తక్కువ. మూడో స్థానంలో మహీంద్రా XEV 9E ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిన ఎలక్ట్రిక్ కారు.

మహీంద్రా ఇటీవల రిలీజ్ చేసిన తాజా మహీంద్రా కారు ఫిబ్రవరిలో 2,205 యూనిట్లను విక్రయించింది. గత జనవరితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఈ జాబితాలో 4వ, 5వ స్థానాల్లో టాటా మోటార్స్ మిడ్-సైజ్ SUVలు సఫారీ, హారియర్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వాటి అమ్మకాల గణాంకాలు వరుసగా 1,562, 1,376.

Citron Sales

ఈ జాబితాలో హ్యుందాయ్ అల్కాజార్ ఆరో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో 1,264 అల్కాజార్ కార్లు అమ్ముడయ్యాయి. దీని తరువాత ఏడో, ఎనిమిదో స్థానంలో ఎంజీ హెక్టర్, జీప్ కంపాస్ ఉన్నాయి. అవి ఫిబ్రవరిలో వరుసగా 515, 120 యూనిట్లను విక్రయించాయి. 9వ స్థానంలో ఉన్న హ్యుందాయ్ టక్సన్ గత నెలలో 73 యూనిట్లను విక్రయించింది. వీటితో పాటు ఫిబ్రవరిలో 2 వోక్స్‌వ్యాగన్ టిగువాన్లు, ఒక సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కూడా అమ్ముడయ్యాయి.

మొత్తంగా ఈ అమ్మకాల నివేదికను పరిశీలిస్తే ఇండియాలో మిడ్-సైజ్ SUV మార్కెట్‌లో మహీంద్రా ఆధిపత్యం బలంగా ఉందని చూపిస్తుంది. హీంద్రా తాజా XEV 9E ఎలక్ట్రిక్ కారు ఈ స్థాయిలో అమ్ముడవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రాబోయే నెలల్లో ఈ ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు మహీంద్రా ఇతర మిడ్-సైజ్ SUVలను అధిగమించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 17:30 [IST]
English summary
Mahindra dominates mid size suv sales tata safari harrier and xev9e compete closely
Read more on: #mahindra #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+