ఎలక్ట్రిక్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఆనంద్ మహీంద్రా కార్లు.. డిమాండ్ మాములుగా లేదు.. షోరూమ్‌ల వద్ద క్యూ!

దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (mahindra and mahindra) పెట్రోల్, డీజిల్ ఇంధనాల కార్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా తన సత్తాను చాటడానికి కీలకంగా కృషి చేస్తుంది. ఈవీ మార్కె్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఇతర దేశాల తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి కొత్త XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ SUV లను తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి వీటికి మంచి ఆదరణ వస్తుందని తాజాగా విడుదల అయిన సేల్స్ డేటాను చూస్తే తెలిసిపోతుంది. మహీంద్రా వెల్లడించినదాని ప్రకారం, ఫిబ్రవరి 2025 నెలలో ఈ ఈవీ కార్లు భారీ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేశాయి. మొత్తం 3,196 యూనిట్ల సేల్స్‌తో ఇవి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో డిమండ్ ఉన్న మోడళ్లుగా అవతరించాయి.

ఈవీలకు ఇప్పుడు భారత్ అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఇలాంటి సమయంలో విదేశీ కంపెనీలు వరుసగా దేశంలోకి ఎంట్రీ ఇస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని తయారీ విదేశీ సంస్థలకు పోటీగా మేడ్‌ ఇన్ బ్రాండ్ కింది XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ SUVలను తీసుకొచ్చారు. ఆయన అంచనాలకు అనుగుణంగానే ఇవి మార్కెట్లో మంచి ఆదరణ సంపాదిస్తుండటం విశేషం.

Mahindra Electric Cars Sales Units

ఇవి మార్కెట్లోకి రాకముందే వీటిపై దేశీయ, అంతర్జాతీయ ఆటో పరిశ్రమతో పాటు ప్రజల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ కార్ల కోసం చాలా మంది ఎగబడ్డారు. ఒకే రోజులో XEV 9E, BE6 ఎలక్ట్రిక్ SUV లకు మొత్తం 30,179 రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయంటే వీటికి కస్టమర్ల నుంచి ఏ మేరకు ఆదరణ ఉందో తెలిసిపోతుంది.

ప్రారంభంలోనే 3 వేలకు పైగా కొనుగోళ్లు సాధించిన మహీంద్రా ఈవీ కార్స్ రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా సేల్స్‌ను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహీంద్రా BE 6 విషయానికి వస్తే, ఇది 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లో లభిస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 535 నుండి 682 కి.మీ వరకు దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

Mahindra Electric Car Be 6 Sales Units

ఈ మోడల్ ధర గురించి తెలుసుకున్నట్లయితే రూ. 18.90 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ. 26.90 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో మోడళ్లకు ఏమాత్ర తీసిపోకుండా అధునాతన ఫీచర్స్‌ను ఈ మోడల్‌లో అందించారు. వెంటిలేటెడ్ సీట్లు, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జర్‌, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా XEV 9E ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో ప్రారంభ ధర రూ.21.90 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.30.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా రూ. 656 కి.మీల లాంగ్ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ కారులో కూడా 5 మంది వెళ్లచ్చు.

Mahindra Electric Car Xev 9e Sales Units

ప్రయాణికుల సేఫ్టీ పరంగా దీనిలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ప్యాసింజర్-సైడ్ డిస్‌ప్లేకు సంబంధించి 12.3-అంగుళాల స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంఫర్ట్‌గా ప్రయాణించడానికి అనువైన సీట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఇతర పలు ఆప్షన్స్ ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2025, 17:42 [IST]
English summary
Mahindra electric cars be 6 and xev 9e 3196 sales units in february 2025
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+