5 నెలల్లోనే 20,000 మంది కస్టమర్లు ఎంచుకున్న కార్లు ఇవే.. మీరెందుకు మిస్ అవ్వాలి?
దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (Mahindra) తన ముద్రను మరింత బలంగా వేసుకుంటోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఈ కంపెనీ రూపొందించిన మోడళ్లు XEV 9E, BE6 మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. జనవరిలో భారీ అంచనాల మధ్య మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడళ్లకు ప్రారంభం నుంచే విపరీతమైన డిమాండ్ నెలకొంది. కంపెనీ మొదటగా టాప్ వేరియంట్‌ల డెలివరీలను మార్చి 20న ప్రారంభించింది. అప్పటినుండి ఒక్కొక్కటిగా ఈ కార్లు రోడ్డెక్కుతూ, కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ప్రారంభ దశలోనే ఈ రెండు మోడళ్లకు విపరీతమైన బుకింగ్‌లు రావడంతో మహీంద్రా డెలివరీ వ్యవస్థను వేగవంతం చేయాల్సి వచ్చింది. డెలివరీలు మొదలైన మొదటి 70 రోజుల్లోనే దాదాపు 10,000 కార్లు కస్టమర్లకు అందజేయడం ఒక రికార్డ్‌గా నిలిచింది.
అంచనాలకు మించి డిమాండ్ రావడంతో ఆ కాలంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కారు డెలివరీ అయినట్లు కంపెనీ గర్వంగా ప్రకటించింది. అంత వేగంగా మొదలైన ఈ విజయయాత్ర కేవలం 5 నెలల్లోనే మరో ఘనతను చేరుకుంది. దేశవ్యాప్తంగా 20,000 యూనిట్ల XEV 9E, BE6 మోడళ్లను విక్రయించామని మహీంద్రా అధికారికంగా వెల్లడించింది. ఇది కేవలం విక్రయాల గణాంకం మాత్రమే కాదు, వినియోగదారుల విశ్వాసానికి ప్రతిబింబమని చెప్పాలి.

ఇంతకుమించి, ఈ కొత్త మోడళ్లపై ప్రజల్లో ఏర్పడిన ఉత్సాహాన్ని మరోసారి రుజువు చేస్తూ, ఇప్పటివరకు ఈ కార్లు కలిపి 9.3 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని మహీంద్రా గర్వంగా వెల్లడించింది. అంటే, కస్టమర్లు కేవలం కొనుగోలు మాత్రమే చేయడం కాదు, తమ రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని కూడా ఇది స్పష్టం చేస్తుంది. ఈ విజయంతో, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది.
మహీంద్రా XEV9E మోడల్ బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి రోజే ఎక్కువ స్పందనను పొందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్క రోజులోనే 30,179 యూనిట్ల బుకింగ్‌లు నమోదు కావడం. ఇందులో ఎక్కువ మంది కస్టమర్లు టాప్ వేరియంట్‌ను ఎంచుకోవడం, ఈ కారు పట్ల ఉన్న ఆసక్తి మరియు విశ్వాసానికి నిదర్శనం. ఈ కారు మహీంద్రా అభివృద్ధి చేసిన ఆధునిక INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయబడింది.

ఈ ప్లాట్‌ఫామ్ మల్టీ-బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, విస్తృతమైన స్పేస్ అందించగల ప్రత్యేకత కలిగి ఉంది. XEV9Eలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు 79 kWh బ్యాటరీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. దీన్ని ప్రధానంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనువుగా రూపొందించారు. ఈ ఆప్షన్‌లో శక్తివంతమైన 210 kW ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు.
మరోటి 59 kWh బ్యాటరీ ప్యాక్ తక్కువ దూర వినియోగం కోసం సరిపోతుంది. ఈ వేరియంట్‌లో 170 kW ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. కేవలం రేంజ్ మాత్రమే కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా XEV9Eలో ఆకట్టుకునే అంశం. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ను 140 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌లు చేయాలనుకునే వారు ఈ కారును ఎంచుకోవచ్చు.

ఈ కార్లలో అమర్చాన బ్యాటరీని 20-80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. వీటిలో ఆకట్టుకునే ఫీచర్స్ చాలా ఉన్నాయ్. పనోరమిక్ గ్లాస్ సన్ రూఫ్,వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 43-అంగుళాల 3-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, EBDతో కూడిన ABS,7-సీటర్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా లైవ్ ఫీడింగ్ మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








