వావ్ మహీంద్రా! 3000 ఈవీలు డెలివరీ.. ఇంకో 27000 ఇవ్వాలి.. నెక్ట్స్ మీ వంతే !
మహీంద్రా తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. XEV 9e, BE 6 మోడళ్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో, కొనుగోలుదారులు ఏకంగా ఆరు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి ఆదరణకు కారణాలేంటి? ఎన్ని కార్లు అమ్ముడయ్యాయి? వెయిటింగ్ పిరియడ్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం.
మహీంద్రా ఇటీవల విడుదల చేసిన XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు మార్కెట్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ కార్లకు 30,179 బుకింగ్‌లు వచ్చాయి. వీటి విలువ దాదాపు రూ. 8,742 కోట్లు. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో బుకింగ్‌లు రావడం ఇదే మొదటిసారి.

ముఖ్యంగా XEV 9e మోడల్‌కు 15,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు రావడంతో, ఇది దేశంలోనే అత్యధికంగా బుక్ చేయబడిన ఎలక్ట్రిక్ వాహనంగా రికార్డు సృష్టించింది. మార్చి 20 నుండి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డెలివరీని ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే 3,000 యూనిట్ల 'బోర్న్ ఎలక్ట్రిక్' కార్లను డెలివరీ చేసి మహీంద్రా మరో మైలురాయిని చేరుకుంది.
ప్రస్తుతం ఈ రెండు కార్ల టాప్-స్పెక్ వేరియంట్ల డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయి. XEV 9e, BE 6 కొనుగోలుదారులలో ఎక్కువ మంది ప్యాక్ 3 అనే టాప్-స్పెక్ వేరియంట్‌ను ఎంచుకుంటున్నారు. దీనిని బట్టి వినియోగదారులు పర్యావరణ అనుకూలత కంటే ప్రీమియం ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది.

తక్కువ ధరలో లభించే మహీంద్రా కార్లు, చెప్పిన టైంకు డెలివరీ చేయడం వంటి కారణాలతో ఈ రెండు కార్లకు ఇంతటి భారీ డిమాండ్ రావడానికి కారణమయ్యాయి. ఎంట్రీ-లెవెల్ ప్యాక్ 1, ప్యాక్ 1 ఎబోవ్ వేరియంట్లను ఎంచుకున్న వినియోగదారులు 2025 ఆగస్టు వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుత బుకింగ్ డేటా ప్రకారం, XEV 9eకి 59శాతం మంది, BE 6కి 41శాతం మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక డిమాండ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో వెయిటింగ్ పీరియడ్ 6 నెలల వరకు ఉంది. వెయిటింగ్ సమయాన్ని తగ్గించడానికి, వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించడానికి మహీంద్రా దేశవ్యాప్తంగా డెలివరీలను పెంచే ప్రయత్నాల్లో ఉంది.

మహీంద్రా BE 6 గురించి చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది. చిన్న 59 kWh బ్యాటరీతో 557 కిలోమీటర్ల రేంజ్, పెద్ద 79 kWh బ్యాటరీతో 682 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ADAS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
BE 6 బేస్ మోడల్ ధర రూ. 18.90 లక్షల నుండి టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే కూడా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 59 kWh, 79 kWh. పెద్ద బ్యాటరీతో ARAI ధృవీకరించిన 656 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది.
చిన్న బ్యాటరీతో 542 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. XEV 9eలో 3-స్క్రీన్ డాష్‌బోర్డ్, 16-స్పీకర్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. XEV 9e ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. 30.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








