మాస్ జాతర అంటే ఇదే.. ఒకే రోజు 10ఇండియన్ టెస్లా కార్లను రిలీజ్ చేసిన మహీంద్రా
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో పలు సంస్థలకు ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అద్బుతమైన ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి. కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో మార్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలోకి టెస్లా కార్లు రాబోతుండడంతో ఆ కంపెనీ అందించే ఫీచర్లను ఇండియా కార్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవల దేశంలో ఎలక్ట్రిక్ విభాగంలో సునామీ సృష్టించింది మహీంద్రా. XUV400 అనే ఒకే మోడల్‌తో ఇప్పటి వరకు మార్కెట్లో పోరాడుతున్న మహీంద్రా.. ఇప్పుడు రెండు కొత్త మోడళ్లతో ఈ విభాగంలోకి ప్రవేశించింది. గతేడాది చివర్లో ప్రారంభించిన రెండు ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9e లకు బుకింగ్‌లు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

బుకింగ్ సంఖ్యలో ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈవీల డెలివరీలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ సహా అనేక మంది ప్రముఖులు 'ఇండియన్ టెస్లా'ను సొంతం చేసుకున్నారు. చెన్నైలోని ఒక మహీంద్రా డీలర్‌షిప్ ఒకే రోజు 10 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను డెలివరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోను దర్షన్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
మహీంద్రా BE 6 : ఈ చిన్న ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 18.90లక్షల రూపాయలు. దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర 26.90 లక్షల రూపాయలు. ఇది 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లలో లభిస్తుంది. చిన్న బ్యాటరీ వెర్షన్ 228 bhp శక్తిని, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీ వెర్షన్ 282 bhpశక్తిని, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

చిన్న బ్యాటరీ ప్యాక్ 535 కిలోమీటర్లు, పెద్దది 682 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆన్‌బోర్డ్ సెల్ఫీ కెమెరా, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, NFC కీ కార్డ్ యాక్సెస్, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.
మహీంద్రా XEV 9e : కూపే స్టైల్లో వచ్చే ఈ పెద్ద ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 21.9 లక్షల రూపాయలు. BE6లో అందించిన 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లే ఇందులో కూడా ఉన్నాయి. 59 kWh వెర్షన్ 228 bhp పవర్‌ని, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 79 kWh వెర్షన్ 282 bhp పవర్‌ని, 380Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కో-డ్రైవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ట్రిపుల్ 12.3-ఇంచుల స్క్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లు, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దల సేఫ్టీలో పూర్తి మార్కుల సాధించిన మొదటి కారు ఇది.
క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా XEV 9e మొత్తం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, ESP, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలు ప్రస్తుతం RWD కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్-మోటార్ AWD సెటప్ భవిష్యత్తులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








