ఈ కారుకు ఒక్కసారిగా భారీగా పెరిగిన డిమాండ్.. ఒకేసారి 8 మంది ప్రయాణించొచ్చు.. సేల్స్‌లో దుమ్ములేపింది
మహీంద్రా (Mahindra) ఆటోమొబైల్స్ పేరు వినగానే నమ్మకం, మన్నిక, పనితీరు అన్నీ మనసులోకి వస్తాయి. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. బొలెరో, థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లు మార్కెట్లో దూసుకుపోతుండగా, మహీంద్రా మరాజ్జో మాత్రం గత కొంతకాలంగా అమ్మకాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒక దశలో ఈ MPV మోడల్ ఉత్పత్తి నిలిపేస్తారని కూడా ఆటోమొబైల్ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఆరు నెలల్లో మహీంద్రా మరాజ్జో అమ్మకాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. కంపెనీ తాజాగా ప్రకటించిన ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగ గణాంకాల ప్రకారం, మరాజ్జో కారు విక్రయాలు 227 శాతం వరకు పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కేవలం 77 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో మొత్తం 252 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాల పరంగా ఇది మూడు రెట్లు పెరుగుదలని నమోదు చేసింది. మరాజ్జో అమ్మకాల్లో ఈ వృద్ధి, మార్కెట్‌లో ఈ MPV మోడల్‌కి మళ్లీ కొత్త ఊపును ఇచ్చినట్టే. ఒకప్పుడు అమ్మకాల పట్టికలో వెనుకబడిన ఈ కారు ఇప్పుడు తిరిగి తన స్థానం సంపాదించుకుంది.

వినియోగదారులు ఇప్పుడు మరాజ్జోలో ఉన్న సౌకర్యం, మైలేజ్, ఇంటీరియర్, అలాగే సిటీ డ్రైవ్‌లో కూడా సాఫ్ట్ హ్యాండ్లింగ్ వంటి అంశాలను గుర్తించి కొనుగోలు చేయడం ప్రారంభించారు. గతంలో అమ్మకాలు దాదాపు లేకుండా పోయిన స్థితి నుంచి, ఇప్పుడు మహీంద్రా మళ్లీ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఆశ్చర్యకరంగా, ఈ కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 MPV కార్ల జాబితాలో స్థానం సంపాదించింది.
ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకోవడం మరాజ్జోకు ఒక పెద్ద మైలురాయి అని చెప్పాలి. కొన్ని నెలల క్రితం వరకూ, ఈ కారు అమ్మకాలు లేవని కారణంగా మహీంద్రా మరాజ్జోను మార్కెట్ నుండి తొలగించబోతున్నది అనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ మహీంద్రా సంస్థ అధికారికంగా అలాంటి ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి, కంపెనీ మరాజ్జో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయలేదు, కేవలం పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో కొనసాగించింది.

ఈ నిర్ణయం ఇప్పుడు సరిగ్గా ఫలించింది. మరాజ్జోపై వినియోగదారుల విశ్వాసం క్రమంగా తిరిగి పెరిగింది. ఫ్యామిలీ యూజ్‌కి అనుకూలమైన విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన రైడింగ్ కంఫర్ట్, అలాగే మహీంద్రా నాణ్యత మీద ఉన్న నమ్మకం,, ఇవన్నీ కలిసి ఈ MPVను మళ్లీ ప్రజాదరణలోకి తీసుకువచ్చాయి. తక్కువ అమ్మకాలతో మొదలై, ఇప్పుడు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించడం మరాజ్జోకి ఒక గౌరవకరమైన రీ-ఎంట్రీ అని చెప్పవచ్చు.
మహీంద్రా మరాజ్జో ప్రత్యేకత కేవలం దాని డిజైన్ లేదా బ్రాండ్ నేమ్‌లోనే కాదు, దాని శక్తివంతమైన ఇంజిన్, సేఫ్టీ ఫీచర్లలో కూడా ఉంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అందించబడింది. దీని ఇంజిన్ 121 bhp పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, తద్వారా సిటీ డ్రైవ్ అయినా లేదా హైవే లాంగ్ జర్నీ అయినా ఈ కారు సౌకర్యవంతంగా నడుస్తుంది.

మరాజ్జోకు గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్టుల్లో 4-స్టార్ రేటింగ్ లభించింది. మైలేజ్ విషయానికొస్తే, మరాజ్జో సుమారు 17.3 kmpl అందిస్తుంది, ఇది తన సెగ్మెంట్‌లో ఉన్న ఇతర MPVలతో పోలిస్తే చాలా మెరుగైనదే. అంతేకాకుండా, 8 సీటర్ లేఅవుట్ ఉండటంతో రెండు కుటుంబాలు లేదా పెద్ద గ్రూప్ కలిసి కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. లాంగ్ టూర్స్, వీకెండ్ ట్రిప్స్ లేదా ఫ్యామిలీ వెకేషన్స్‌కి ఇది సరైన ఎంపికగా మారింది.


Click it and Unblock the Notifications








