రేసింగ్ లుక్‌తో మహీంద్రా BE6 ఫార్ములా E ఎడిషన్.. మొదటి 999 మందికి శుభాకాంక్షలు!

మహీంద్రా (Mahindra) తన BE 6 ఎలక్ట్రిక్ SUV ని ఒక ప్రత్యేకమైన కొత్త అవతారంలో మార్కెట్‌కు తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌కు ఫార్ములా E ఎడిషన్ (formula e edition) అనే పేరు పెట్టారు. పేరు వినగానే చాలామందికి ఇది ఫార్ములా E రేసుల్లో ఉపయోగించే కారు అనిపించవచ్చు. కానీ ఇది రేసింగ్ కార్ల నుండి ప్రేరణ పొంది తయారైన ఒక స్టైల్-ఫోకస్‌డ్ స్పెషల్ ఎడిషన్ మాత్రమే. ఫార్ములా E అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎలక్ట్రిక్ సింగిల్-సీటర్ రేసింగ్ సిరీస్. అక్కడ కనిపించే కార్ల డిజైన్, లివరీ, స్పోర్టీ ఎలిమెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ కూడా అదే రేసింగ్ ఆరా స్ఫూర్తితో రూపొందించబడింది.

ఈ స్పెషల్ ఎడిషన్‌లో బాడీపై ప్రత్యేక రేసింగ్ గ్రాఫిక్స్, షార్ప్ లైన్లు, కాన్ట్రాస్ట్ యాక్సెంట్లు, స్పోర్టీ బ్లూ-రెడ్ టచ్‌లు ఉంటాయి. మొత్తం లుక్ చూస్తేనే ఇది సాధారణ BE 6 కంటే ఎక్కడో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రయాణీకుల కోసం ఇన్‌టీరియర్‌లో కూడా రేస్-థీమ్ హైలైట్స్ జోడించారు. ప్రీమియం మెటీరియల్స్, స్పోర్టీ స్టిచింగ్, ఫ్యూచరిస్టిక్ డ్యాష్ డిజైన్ ఇవన్నీ కలిసి కేబిన్‌కి స్పోర్ట్స్ కార్ ఫీల్ ఇచ్చేలా ఉంటాయి.

Mahindra Introduces Be6 Formula E Edition In India

మహీంద్రా ఈ ఎడిషన్‌ను FE2, FE3 అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ పేర్లు కూడా ఫార్ములా E నుండి తీసుకున్న వాటిలాగే ఉండటంతో, ప్రీమియం టచ్‌ లేకుండా కూడా రేసింగ్‌ని గుర్తు చేస్తాయి. అయితే పనితీరు పూర్తిగా రోడ్-యూజ్‌కే అనుకూలంగా ఉంటుంది. ఫార్ములా E ట్రాక్‌లో దూసుకెళ్లే కార్ల పవర్, ఏరోడైనమిక్స్ ఇది కాదు; కానీ వాటి శైలి మాత్రం పూర్తిగా ప్రతిబింబించేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు.

మహీంద్రా BE6 ఫార్ములా E ఎడిషన్‌కి ధరలు కూడా దాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా నిర్ధారించింది. FE2 వేరియంట్ ధర రూ. 23.69 లక్షలు, అలాగే మరింత అప్‌గ్రేడ్ చేసిన FE3 వేరియంట్ ధర రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. రెండు మోడళ్లూ స్టైల్, ఫీల్, రేసింగ్ థీమ్ విషయంలో ఒకే DNA పంచుకుంటాయి కానీ ఫీచర్లలో ఉన్న చిన్నపాటి తేడాలు వాటి ధరల్లో కనిపిస్తాయి.

Mahindra Introduces Be6 Formula E Edition In India

ఈ ఎడిషన్‌ కోసం బుకింగ్‌లు 2026 జనవరి 14 నుండి, అంటే పొంగల్ పండగ రోజుననే ప్రారంభం కానున్నాయి. పండుగ సెలబ్రేషన్లో కొత్త కారును బుక్ చేసుకోవడానికి ఇదే పరఫెక్ట్ టైమింగు. ఇక బుక్ చేసిన వారికి కారును అందించే ప్రక్రియ 2026 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నుండి ప్రారంభమవుతుందని మహీంద్రా వెల్లడించింది. పండగతో మొదలై ప్రేమ దినంతో డెలివరీలు మొదలు కావడం చిన్న సర్ప్రైజ్ లానే అనిపిస్తుంది.

ఇంతటితో మహీంద్రా ఆగలేదు. ఈ స్పెషల్ ఎడిషన్ BE6 కొనుగోలు చేసే మొదటి 999 మంది కస్టమర్లకు గ్యారంటీడ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, మొత్తం కొనుగోలుదారులలో నుంచి ముగ్గురు అదృష్టవంతులకు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే E-ప్రిక్స్ రేస్‌ను లైవ్‌గా వీక్షించే అవకాశం ఇవ్వబడుతుంది. మనం టీవీలో చూస్తున్న రేస్‌ను నేరుగా లండన్ ట్రాక్‌లో నిలబడి చూడడం ఒక వేరే స్థాయి అనుభూతి.

Mahindra Introduces Be6 Formula E Edition In India

ఈ స్పెషల్ ఎడిషన్ BE6 ఫార్ములా E ఎడిషన్‌కి మహీంద్రా ఇచ్చిన విజువల్ టచ్ అసలు రేసింగ్ రక్తం ఉన్నవారినే టార్గెట్ చేసినట్టే ఉంటుంది. కారు బాహ్య రూపాన్ని మరింత ప్రత్యేకంగా చూపించేందుకు కంపెనీ ఎవరెస్ట్ వైట్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్, టాంగో రెడ్, స్టీల్త్ బ్లాక్ కలర్స్ అందించింది. ప్రతి రంగు ఒక ప్రత్యేక వైబ్‌ను ప్రీమియమ్ అట్రాక్షన్, అటిట్యూడ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 27, 2025, 9:26 [IST]
English summary
Mahindra introduces be6 formula e edition in india check price fe2 and fe3 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+