ఇది జస్ట్ నెంబర్ అనుకోకండి.. భారతీయులు ఒక కంపెనీపై ఉంచిన నమ్మకానికి గుర్తింపు

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి దారితీసిన మహీంద్రా (Mahindra) సంస్థ మరో విశేషమైన ఘనతను సాధించింది. ఇప్పటికే SUVల విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) పేరుతో తన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విభాగాన్ని విజయవంతంగా నడుపుతున్న ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ మహీంద్రా MLMML ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య భారత ఆటోమొబైల్ చరిత్రలో కొత్త పేజీని రాసిందని చెప్పాలి.

భారతదేశంలో 3,00,000 కంటే ఎక్కువ వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ మైలురాయిని దాటిన తొలి కంపెనీగా మహీంద్రా నిలిచింది. ప్రతి రోజూ పెరుగుతున్న పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాహనాలను తయారు చేయడమే ఈ సంస్థ లక్ష్యం. అందుకే, మహీంద్రా తన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మరియు ఫోర్-వీలర్ వాణిజ్య వాహనాల శ్రేణిని విస్తరించింది.

Mahindra Last Mile Mobility Achieves 3 Lakh Electric Commercial Vehicles Sales Milestone

ఈ వాహనాలు కేవలం డెలివరీ వ్యాపారాలకే కాకుండా, చిన్న వ్యాపారులకు, నగర రవాణాకు ఉపయోగపడుతున్నాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోడ్లపై పరుగులు తీస్తూ పర్యావరణ హితమైన ప్రయాణానికి మార్గం చూపుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ మరిన్ని సరికొత్త మోడళ్లను, ఆధునిక బ్యాటరీ టెక్నాలజీలను తీసుకువచ్చే ప్రణాళికలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, మహీంద్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విభాగంలో కూడా సత్తా చాటుతుంది.

ఈ కంపెనీ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దీనిలో ట్రియో సిరీస్, జోర్ గ్రాండ్, E-ఆల్ఫా వంటి త్రీ-వీలర్లు, మహీంద్రా ZEO ఫోర్-వీలర్లు ఉన్నాయి. ఈ వాహనాలు కేవలం సాంకేతికత పరంగానే కాదు, పర్యావరణ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వాహనాలు కలిపి 5 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి, ఇది నిజంగా విశేషమైన సంఖ్య.

Mahindra Last Mile Mobility Achieves 3 Lakh Electric Commercial Vehicles Sales Milestone

ఈ ప్రయాణం ద్వారా మహీంద్రా సుమారు 185 కిలోమెట్రిక్ టన్నులకు పైగా CO₂ ఉద్గారాలను తగ్గించింది, అంటే ఇది 4.3 మిలియన్లకు పైగా చెట్లు నాటడం వల్ల కలిగే పర్యావరణ ప్రభావానికి సమానం. పర్యావరణ పరిరక్షణలో మహీంద్రా చూపిన ఈ కృషి, భారతదేశం గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునే దిశగా ఒక పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. అదేవిధంగా, కంపెనీ వృద్ధి కూడా ఆశ్చర్యకరంగా కొనసాగుతోంది.

కేవలం 12 నెలల వ్యవధిలోనే 1 లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మడం ద్వారా, మహీంద్రా తనకు వినియోగదారుల నుండి లభించిన నమ్మకం, విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది. తన దశాబ్దాల అనుభవం, సాంకేతిక నైపుణ్యాలు, పర్యావరణానికి అంకితమైన దృక్పథంతో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) భారతదేశంలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విప్లవాన్ని ముందుకు నడిపిస్తోంది.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO సుమన్ మిశ్రా స్పందిస్తూ, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) తమ చరిత్రలో అత్యంత గర్వకారణమైన మైలురాయిని చేరుకుంది. 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ మైలురాయిని దాటడం మా కోసం గర్వకారణమైన విషయం. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది మా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ప్రతిబింబం అని పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 6, 2025, 16:31 [IST]
English summary
Mahindra last mile mobility achieves 3 lakh electric commercial vehicles sales milestone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+