కొత్త కారు విడుదల చేసిన మహీంద్రా.. ఎబోనీ ఎడిషన్‎తో మార్కెట్లో సంచలనం

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ 'ఎక్స్ యూవీ 700'కు మార్కెట్లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ మైలేజీ, సూపర్బ్ లుకింగ్, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారణంగా ఈ కారును కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రోడ్ల మీద ఎక్కువగా మహీంద్రా ఎక్స్ యూవీ 700 కార్లు కనిపిస్తున్నాయి.

మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే రెండు లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. ఎక్స్‌యూవీ 700ని మార్కెట్లోకి రిలీజ్ చేసి దాదాపు మూడేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మకాల్లో మంచి వృద్ధి సాధిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా XUV 700 ఇప్పుడు గత కొన్ని వారాలుగా బ్లాక్ ఎడిషన్ వెర్షన్లో ఇండియా కార్ మార్కెట్లో లాంచ్ అయిన ఎస్ యూవీల జాబితాలో చేరింది.

Mahindra Launches XUV700 Ebony

మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ (బ్లాక్ ఎడిషన్) లాంచ్ చేసింది. కొత్త ఎబోనీ ఎడిషన్ ఎక్సటర్నల్, ఇంటర్నల్ క్యాబిన్ లోపల కాస్మొటిక్ అప్ డేట్లతో వస్తుంది. గత రెండు వారాల్లో డార్క్ ఎడిషన్ లేదా బ్లాక్ ఎడిషన్ పొందిన టాటా సఫారీ, టాటా హారియర్, ఇతర SUVల తర్వాత మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ మార్చి 17న భారతదేశంలో రిలీజ్ అయింది. స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ఈ SUV సాధారణ వెర్షన్ లాగానే ఉంటుంది.

ఎబోనీ ఎడిషన్ అప్‌డేట్‌లు: ఎక్సటర్నల్ గా చూస్తే SUV స్టీల్త్ బ్లాక్ కలర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. కొన్ని కీలకమైన డిజైన్ అంశాంల్లో బ్రష్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, బ్లాక్ ఆన్ బ్లాక్ గ్రిల్ ఇన్సర్ట్స్, బ్లాక్డ్ అవుట్ ORVM ఉన్నాయి. దీనికి 18-ఇంచుల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.

Mahindra Launches XUV700 Ebony Edition Inner

అలాగే, బ్లాక్, సిల్వర్ ఎక్సటర్నల్ కలర్ ఈ SUV కి స్పెషల్ లుక్ తెస్తుంది. మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్‌లోని మిగిలిన భాగం ఇంటీరియర్‌పై అనేక కాస్మోటిక్ అప్ డేట్స్ అందించింది. క్యాబిన్‌లో సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్స్ వెంట బ్లాక్ లెథరెట్ అప్హోల్స్టరీ, బ్లాక్ ట్రిమ్స్, సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి.

డ్యూయల్ టోన్ థీమ్ కోసం లేత గ్రే కలర్ రూఫ్ లైనర్ జోడించారు. XUV700 ఎబోనీ ఎడిషన్ క్యాబిన్ లోపల ఉన్న కొన్ని ఇతర డిజైన్ అంశాలలో డార్క్ క్రోమ్ AC వెంట్స్ ఉన్నాయి. కారు బేసిక్ వెర్షన్‌లోని అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

Mahindra Launches XUV700 Ebony Edition Seat

వేరియంట్స్, ధర: మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్ AX7, AX7L ట్రిమ్స్ 7-సీటర్ ఫార్వాడ్ వెర్షన్‌లపై ఆధారపడి ఉంటుంది. AX7 బేస్ డ్ XUV700 ఎబోనీ ఎడిషన్ ధర ఇండియాలో ఎక్స్-షోరూమ్ రూ.19.64 లక్షల నుండి రూ. 21.79 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

https://www.youtube.com/watch?v=a8od_kkV_tA&t=1s

అలాగే మహీంద్రా XUV 700 ఎబోనీ ఎడిషన్ AX7L వేరియంట్ ధర రూ. 23.34 లక్షల నుండి రూ. 24.14 లక్షల(ఎక్స్-షోరూమ్ ) మధ్య ఉండనుంది. ప్రస్తుతం ఇండియాలోని చాలా బ్రాండ్లు వినియోగదారులకు డార్క్ ఎడిషన్లను అందిస్తున్నాయి. మహీంద్రా కొత్త XUV 700 ఎబోనీ ఎడిషన్ ఎంత ప్రజాదరణ పొందుతుందో చూడాలి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 16:00 [IST]
English summary
Mahindra launch xuv700 ebony edition creating a sensation in the market
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+