భారత గర్వాన్ని ప్రపంచానికి చూపిస్తోన్న ఆనంద్ మహీంద్రా.. ఆసీస్ రోడ్లపై XUV 3XO!

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. దేశీయ విపణిలో సుస్థిరంగా నిలబడిన ఈ సంస్థ, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మెల్లగా ఆదరణ సంపాదించుకుంటుంది. తాజాగా స్వదేశంలో తయారు చేసిన సరికొత్త మహీంద్రా XUV 3XO కాంపాక్ట్ SUVను కంపెనీ ఆస్ట్రేలియాలో విడుదల చేసింది. ఆస్ట్రేలియా మార్కెట్లో, ఈ SUVను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు, అవి AX5L, AX7L. AX5L వేరియంట్‌కి ధర AUD 23,490 (భారత రూపాయల్లో సుమారు రూ. 13.18 లక్షలు). AX7L వేరియంట్‌కి ధర AUD 26,490 (సుమారు 14.87 లక్షలు). ఈ ధరలతో, మహీంద్రా కాంపాక్ట్ SUV విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కొత్తగా తీసుకువచ్చిన ఈ మోడల్, భారత్‌లో అమ్ముడవుతున్న XUV 3XO కంటే డిజైన్ పరంగా పెద్ద తేడా లేకుండా ఉంటుంది. ఇంటీరియర్ సాంకేతికత, ఫీచర్ల విషయంలో అన్ని ఉండటం, దాని ప్రధాన విశిష్టత. మోడర్న్ స్టైల్, సేఫ్టీ ప్రమాణాలు, పూర్తి కంఫర్ట్‌తో కూడిన SUVను కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. సాధారణంగానే XUV 3XO డిజైన్‌లో సరికొత్త ఆకర్షణ ఉంటుంది. దీన్ని ఒకసారి చూశాక ఎవరినైనా ఆకట్టుకుంటుంది.

Made In India Xuv 3xo Suv

ముందు భాగంలో అద్భుతమైన LED హెడ్‌ల్యాంప్‌లు అట్రాక్టివ్ లుక్స్ ఇస్తాయి. వాటి చుట్టూ అమర్చిన సీ-ఆకారపు డేలైట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వెనక భాగంలో కనెక్ట్ అయ్యే టెయిల్ ల్యాంప్ బార్, SUVకి మరింత ప్రీమియం లుక్ అందిస్తుంది. అలాగే, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కింద భాగానికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. మొత్తం గా చెప్పాలంటే, మహీంద్రా తన కొత్త ఆవిష్కరణలతో అంతర్జాతీయ మార్కెట్లో తన గుర్తింపు మరింత బలపరుస్తోంది.

ఆస్ట్రేలియాలో XUV 3XO లాంచ్, 'మేక్ ఇన్ ఇండియా'కు మరొక గౌరవనీయమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ SUVలో మొత్తం ఐదు సీట్లు ఉంటాయి, వీటిని సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. కాబట్టి, కుటుంబంతోనైనా, స్నేహితులతోనైనా దూర ప్రయాణాల్లో కూర్చుని కంఫర్ట్‌గా ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది. తాజా మోడల్‌లో ఒకే ఒక పవర్‌ట్రెయిన్ ఎంపిక అందిస్తున్నారు.

Made In India Xuv 3xo Suv Launched In Australia

ఇది 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 110 bhp శక్తిని, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్‌ ఈజీగా ఉండటం కోసం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడింది. ఈ ఇంజిన్ చిన్న పరిమాణం కలిగినప్పటికీ, రోజువారీ ప్రయాణాల నుంచి హైవే రైడింగ్ వరకు అవసరమైన శక్తిని అందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వాహనం డిజైన్ కూడా దానికి బలమైన రోడ్ ప్రెజెన్స్ ఇస్తాయి.

దీని పొడవు 3990 మిల్లీమీటర్లు, వెడల్పు 1821 మిల్లీమీటర్లు, ఎత్తు 1647 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 2600 మిల్లీమీటర్లు కావడం వల్ల సీటింగ్ స్పేస్ కూడా విశాలంగానే ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే, ఎవరెస్ట్ వైట్, టాంగో రెడ్, గెలాక్సీ గ్రే, స్టీల్త్ బ్లాక్, సిట్రిన్ ఎల్లో వంటి జివ్వుమనే కలర్స్ వినియోగదారులకు నచ్చేలా ఉన్నాయి. ప్రతి షేడ్ SUVకి ప్రత్యేకంగా డైనమిక్, యాక్టివ్ లుక్ ఇస్తుంది.

Mhahindra Xuv 3xo Suv Launched In Australia

ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టిన మహీంద్రా XUV3XOలో అనేక ఫీచర్స్ అందించారు. 0.25-అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలు, ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కి, మరొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ,USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, సేఫ్టీకి 6 ఎయిర్‌బ్యాగులు, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి మొదలగునవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2025, 10:30 [IST]
English summary
Mahindra made in india xuv 3xo suv launched in australia details inside
Read more on: #mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+