ఐదు నెలల్లో కేవలం 37 మంది కొన్నారు.. రెండు ఫ్యామిలీలకు బెస్ట్, మంచి మైలేజ్.. ఏమైంది ఈ కారుకి?

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని మహీంద్రా (Mahindra) దేశీయంగా, అంతర్జాతీయంగా కార్ల అమ్మకాలతో దూసుకుపోతుంది. స్కార్పియో, XUV 3XO, XUV700, థార్ వంటి వంటి ప్రతీ మహీంద్రా మోడల్‌ కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. దీని పొడవైన SUVల సిరీస్‌ను భారతీయులు ఎంతో అభిమానంతో స్వీకరించారు. అందుకే, ఈ మధ్యకాలంలో అమ్మకాల పరంగా మహీంద్రా దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఎదగడం పెద్ద వార్తైంది. దాని ప్రస్తుత మోడళ్లన్నీ మార్కెట్లో హిట్లుగా నిలుస్తూ, ఒక విశిష్టమైన ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాయి. అయితే ఇలాంటి మెరుగైన సేల్స్ మధ్య ఒకటి మాత్రం ఆదరణ సంపాదించలేకపోతుంది. అదే మహీంద్రా మరాజ్జో ఎంపీవీ (Mahindra Marazzo Mpv). ఇది కంపెనీ ప్రారంభించిన ఏకైక MPV మోడల్‌. ఇది మాత్రం వినియోగదారుల నుండి సరైన స్పందన పొందలేకపోయింది.

అనుకూలనమైన ఇంటీరియర్‌ స్పేస్‌, రోజువారి ప్రయాణానికి సరిపడా మైలేజ్‌తో పాటు రెండు కుటుంబాలకు అనువుగా ఉండేలా 8 సీటర్ లేఅవుట్‌తో అడుగుపెట్టినప్పటికి దీన్ని ప్రజలు పెద్దగా కొనుగోలు చేయడం లేదు. త ఐదు నెలల గణాంకాల మీద ఒకసారి దృష్టి సారిస్తే, మహీంద్రా మరాజ్జో స్థితి నిజంగా ఎలా ఉందో స్పష్టమవుతుంది. జనవరి 2025లో ఒక్క యూనిట్లను కూడా ఎవరూ కొనకపోవడం దీని పరిస్థితిని తెలిపే ముఖ్య ఉదాహరణ.

Mahindra Marazzo Mpv 37 Sales

తర్వాతి నెల ఫిబ్రవరిలో కొంత కదలిక వచ్చినా, ఆ సంఖ్య కూడా కేవలం 17 యూనిట్ల వరకు మాత్రమే పరిమితమైంది. మార్చిలో విక్రయాలు మరింత తగ్గి 10 యూనిట్లకు చేరాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 6కి పడిపోగా, మేలో కేవలం 4 యూనిట్ల డెలివరీ జరిగింది. ఈ ఐదు నెలల్లో మొత్తం అమ్మకాల సంఖ్య కేవలం 37 యూనిట్లు. ఇలా ఒక్కొక్కటి ఒక్క అంకెల్లో అమ్ముడవడం పెద్ద నిరాశే.

మహీంద్రా వాహనాలన్నీ బలంగా మార్కెట్లో అమ్ముడుపోతున్న కూడా మరాజ్జో మాత్రం ఆ చరిత్రకు ఒక వింత భిన్న ఉదాహరణగా నిలుస్తోంది. ఈ గణాంకాలు చూస్తే ఒకసారి ఆలోచించాల్సిందే, వినియోగదారులు ఎందుకు దానిని దూరం పెట్టారు అని? దీనికి ఇతర కారణాలు ఏమైనా ఉండవచ్చు. మార్కెటింగ్‌ లోపాలు, సరైన ఫీచర్లు అందించలేకపోవడం లేదా కాస్త అధిక ధర వంటి అంశాలు కారు సేల్స్ తగ్గడానికి కారణాలుగా ఉండవచ్చు.

Mahindra Marazzo Mpv 37 Sales Units

మహీంద్రా మరాజ్జో MPV ధర ఇప్పుడు రూ.14.59 లక్షల నుండి రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యగా ఉండటం కారణంగా కొత్త కస్టమర్లు దీన్ని కొనడానికి ఆలోచన చేస్తున్నారు. 7-సీటర్, 8-సీటర్ వేరియంట్లలో లభించడం వలన, పెద్ద కుటుంబాలకూ, వాణిజ్య అవసరాలకూ ఇది ఒక సరైన ఎంపిక. ఇండియన్ మార్కెట్లో మరాజ్జోకు ఎదురైన పోటీ చాలా తీవ్రమైనది. మారుతి ఎర్టిగా దానితో పోటీ పడుతుంది.

ఆసక్తికరమైన విషయమేంటంటే, మరాజ్జో అమ్మకాల పరంగా ఈ విభాగంలో అతి తక్కువ ధర కలిగిన రెనాల్ట్ ట్రైబర్‌ కంటే కూడా వెనుకబడిపోయింది. ట్రైబర్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కువ స్పేస్‌, ఎక్కువ సౌకర్యం ఉన్న ఈ MPV ఎందుకు ప్రజాదరణ పొందలేకపోయిందో ఒక ప్రశ్నగా మిగిలింది. అసలు మరాజ్జో కారులో ఆకర్షించే ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. మూడు వరుసల సీట్లతో విశాలమైన క్యాబిన్ ఉంది.

Mahindra Marazzo

వెనుక ప్రయాణికుల కోసం డిఫ్యూజ్, డైరెక్ట్ ఫంక్షన్లతో AC వెంట్స్, సౌకర్యం కోసం రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లేదా బెంచ్ సీటు ఎంపిక, వెనుక సన్‌ బ్లైండ్స్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అయినా కూడా మార్కెట్లో ఇది నిలదొక్కుకోలేకపోవడం నిరాశను కలిగించింది. మహీంద్రా SUVల విభాగంలో దూసుకెళ్తంది,కానీ, మరాజ్జో మాత్రం MPV విభాగంలో ఎదురుచూపులతోనే మిగిలిపోయింది. ఈ ఫీచర్లు, విలువైన ఆచరణాత్మకత ఉన్నప్పటికీ, ఎప్పటికీ నిజమైన విజయాన్ని సాధించలేకపోయింది.

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2025, 9:55 [IST]
English summary
Mahindra marazzo mpv 37 sales units from 2025 january to may details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+