ఈ కారు కోసం షోరూమ్‌కు వచ్చే వారే లేరు.. ఇంత మంచి మోడల్‌ను కేవలం 6 మంది మాత్రమే కొన్నారు
దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ప్రస్తుతం దిగ్గజ కార్ల తయారీదారుగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్‌తో అదిరిపోయే కార్లను విడుదల చేస్తుంది. దాంతో, ఏప్రిల్ 2025 నాటికి మహీంద్రా మరోసారి హ్యుందాయ్, టాటా మోటార్స్‌లను వెనక్కి నెట్టి, భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది. ఈ సక్సెస్‌ను సాధించడంలో మహీంద్రా SUV ల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రత్యేకంగా స్కార్పియో, థార్, బొలెరో, 3XO, XUV 700 మోడళ్లు దేశవ్యాప్తంగా బాగా ఆదరణ పొందుతున్నాయి. వీటి డిమాండ్ ఎక్కడా తగ్గలేదు. వీటికి తోడు, కంపెనీ తాజాగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ SUV మోడళ్లు కూడా మార్కెట్లో మంచి స్పందన పొందుతున్నాయి. అయితే, ఈ ఈవీల డెలివరీలు మాత్రం ఇప్పటివరకు పరిమితంగా ఉండడం గమనార్హం.
అయితే, మహీంద్రా ICE వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2025లో ఐదు మోడళ్లను పది వేలకు పైగా యూనిట్లుగా విక్రయించడం విశేషం. ఇది కంపెనీకి ఒక రికార్డ్ స్థాయి విజయం. అయితే, ఈ అమ్మకాల మధ్య ఓ మోడల్ మాత్రం అంతగా మార్కెట్లో నిలవలేదు. ఆ మోడల్ ఏంటో తెలుసుకోవడం అవసరమే. అదే మహీంద్రా మరాజ్జో (Mahindra Marazzo). మార్కెట్‌లో MPVలకు (మల్టీ పర్పస్ వెహికల్స్) మంచి డిమాండ్ ఉంది.

అయిన కూడా మరాజ్జో మాత్రం వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఈ MPV ఒకప్పుడు కుటుంబ ప్రయాణాలకు అనువై కారు. ఎంతో మంది వినియోగదారులను ఆకర్షించిన ఈ మోడల్ ఇప్పుడు మార్కెట్లో తన స్థానం కోల్పోతున్నట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 2025లో ఈ కారును కేవలం ఆరుగురు మాత్రమే కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా మహీంద్రా డీలర్‌షిప్‌లను సందర్శించి ఎంపీని కొన్నది కేవలం ఆరుగురే అంటే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పాలి.
గత ఏడాది అదే నెలలో 20 యూనిట్లు అమ్ముడవగా, ఇప్పటి అమ్మకాల సంఖ్యతో పోలిస్తే 14 యూనిట్ల తేడా కనిపిస్తోంది. సంవత్సరానికొకసారి వస్తున్న ఈ గణనీయమైన తక్కువ అమ్మకాలు, ఈ మోడల్ పట్ల వినియోగదారుల ఆసక్తి ఎంత మేరకు తగ్గిపోయిందో స్పష్టంగా సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ తగ్గుదల ఒక్క నెలకే పరిమితం కాకుండా కొన్నేళ్లుగా కనిపిస్తోందని మొత్తం గణంకాలను చూస్తేనే తెలిసిపోతుంది.

2025 క్యాలెండర్ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పటివరకు మహీంద్రా కేవలం 33 మరాజ్జో యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. జనవరిలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. ఫిబ్రవరిలో కొంత ఊరట కనిపించి 17 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చిలో అది మరింత తగ్గి 10 యూనిట్లకు పరిమితమైంది. ఇక ఏప్రిల్‌కి వచ్చేసరికి, అమ్మకాలు మళ్లీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.
మహీంద్రా మరాజ్జో, MPV విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇది మార్కెట్లో మారుతీ ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా రూమియన్ వంటి మోడళ్లతో పోటీ పడుతోంది. ధర పరంగా చూస్తే, మరాజ్జో ఎక్స్-షోరూమ్ ధర రూ.14.59 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుంది. ఇది 7, 8 సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వలన కుటుంబ ప్రయాణాలకు అనువైన ఎంపికగా నిలుస్తుంది.

ఇంజిన్ విషయానికొస్తే, 1.5 లీటర్ డీజిల్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 121 bhp పవర్, 300 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. డ్రైవింగ్ అనుభవం సున్నితంగా ఉండేందుకు గేర్ షిఫ్ట్‌లు స్మూత్‌గా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. భద్రత పరంగా కూడా మరాజ్జో మంచి మోడల్. దాని అన్ని వేరియంట్లలో ఎయిర్‌బ్యాగులు, ABS,EBD వంటి వాటితో పాటు ఇతర సదుపాయాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








