ఈ కంపెనీ కార్లను కేవలం 30 రోజుల్లో 84 వేల మందికి పైగా కొన్నారు! జోరు మళ్లీ స్టార్ట్ అయ్యింది

గత కొన్ని నెలలుగా మహీంద్రా కంపెనీ స్థిరంగా తన మార్కెట్‌ను పెంచుకుంటూ వస్తోంది. భారతదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ సంస్థ తనదైన ముద్ర వేసుకుంటూ, వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది. మహీంద్రా ఇటీవల కాలంలో అనేక కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ప్రతిఫలంగా, కంపెనీ అమ్మకాల పరంగా మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇటీవల విడుదలైన మే నెల అమ్మకాల గణాంకాలు మరోసారి మహీంద్రా వ్యుహాన్ని తెలియజేస్తున్నాయి. డేటా ప్రకారం, కంపెనీ ఒక్క మే నెలలోనే మొత్తం 84,110 వాహనాలను విక్రయించింది. ఇది కేవలం గణాంకాల పరంగా మాత్రమే కాక, వ్యాపార పరంగా కూడా ఎంతో కీలకమైన మైలురాయిగా నిలుస్తోంది.

గత నెలతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి కావడం గమనార్హం, కంపెనీ మార్కెట్ ట్రెండ్‌లపై దృష్టిపెడితే, చాలా బలమైన అభివృద్ధిని సూచిస్తుంది. మహీంద్రా వాహనాలపై వినియోగదారుల నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. వాటి బలమైన నిర్మాణం, అధిక పనితీరు, అధునాతన ఫీచర్స్ కారణంగా సేల్స్‌లో పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా మల్టీ-యుటిలిటీ వాహనాలు (SUVs) విభాగంలో మహీంద్రా తమ ఆధిపత్యాన్ని మరింత బలంగా నిలిపేందుకు ప్రయత్నిస్తోంది.

Mahindra May 2025 Sales

అలాగే, దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల విభాగంలోనూ కంపెనీ తన సత్తా చాటుతోంది. ఇది కంపెనీ వ్యాపారాన్ని దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా విస్తరిస్తుందనే సంకేతం. అంతేకాదు, డీలర్ నెట్‌వర్క్ విస్తరణ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ మెరుగుదల, డిజిటల్ మార్కెటింగ్‌ పరంగా చేపట్టిన చర్యలు కూడా ఈ వృద్ధికి మరింత బలాన్నిచ్చాయి. పైన పేర్కొన్న మొత్తం 84,110 విక్రయాల్లో దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి.

మహీంద్రా మోటార్స్ ఈ ఏడాది మే నెలలో దేశీయ మార్కెట్‌లో ముఖ్యంగా SUV విభాగంలో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఒక్క SUV విభాగంలోనే 52,431 వాహనాలు అమ్ముడవడం గమనార్హం. ఇది గత ఏడాది మే 2024తో పోల్చితే 21 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశీయ విక్రయాలతో పాటు ఎగుమతులను కూడా కలిపినట్లయితే, కంపెనీ 54,819 SUVలు విక్రయించడంలో విజయం సాధించింది.

Mahindra May 2025 Sales Recorded 17 Percent

ఈ గణాంకాలు మహీంద్రా బ్రాండ్‌కి ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించాయి. అంతేకాదు, మహీంద్రా యుటిలిటీ వాహనాల విభాగంలో కూడా ప్రబలమైన వృద్ధిని సాధించింది. ఈ విభాగంలో 24 శాతం వృద్ధి నమోదు చేయడం, మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది. ముఖ్యంగా, ఎగుమతుల పరంగా వృద్ధి మరింత విశేషంగా కనిపిస్తోంది. ఎగుమతుల విక్రయాలు ఏకంగా 55 శాతం పెరిగాయి*, ఇది మహీంద్రా ఉత్పత్తులపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తి పెరుగుతోందని సూచించే సంకేతం.

ఇక వాణిజ్య వాహనాల విభాగంలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. మొత్తం వాణిజ్య వాహన అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి గానీ, పడిపోయే స్థాయి క్షీణత గానీ చోటు చేసుకోలేదు. కానీ, ఇందులోని తేలికపాటి వాహనాల విభాగం మాత్రం స్వల్పమైన అభివృద్ధిని సాధించింది. ఈ విభాగంలో 14 శాతం పెరుగుదల నమోదయ్యింది, ఇది గ్రామీణ, చిన్న వ్యాపార అవసరాలను తీర్చే వాహనాలపై ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

Mahindra sales

మహీంద్రా వాహన విక్రయాల్లో మరో ఒక ముఖ్యాంశం అదే 3-వీలర్లు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగం. ఈ విభాగంలో కూడా కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది. మే నెలలో మొత్తం 6,635 వాహనాలు విక్రయించగా, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం వృద్ధిగా నమోదు చేయడం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నదీ, స్థిరంగా పెరుగుతున్న ట్రెండ్‌ను ఇది స్పష్టంగా సూచిస్తోంది.

ఇంకా, ఎగుమతుల పరంగా చూస్తే ఈ విభాగం మరింత బలంగా ఎదుగుతోంది. ఒక్క 3-వీలర్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతుల్లోనే 37 శాతం పెరుగుదల నమోదవడం విశేషం. మొత్తం 3,652 వాహనాలు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం అంతర్జాతీయ స్థాయిలో కూడా పట్టు సాధిస్తున్నదనే సూచనగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2025, 10:50 [IST]
English summary
Mahindra may 2025 sales recorded 17 percent growth more details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+