రోడ్డు మీద తిరిగే యాక్షన్ హీరో వచ్చేశాడు.. ఇది సాధారణ SUV కాదు.. బోల్డ్ ఎడిషన్ ఎంట్రీ అదిరింది!
భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (Mahindra And Mahindra) ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆశ్చర్యపరచడంలో ముందుంటుంది. తాజాగా కంపెనీ తమ రెండు ప్రజాదరణ పొందిన SUV మోడళ్లైన బొలెరో, బొలెరో నియోలకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చి 'బోల్డ్ ఎడిషన్ (Bold Edition)' పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్లు మామూలు మోడళ్లతో పోల్చితే లుక్స్ పరంగా మరింత ఆకర్షణీయంగా, గ్లామర్‌తో నిండినవిగా కనిపిస్తున్నాయి. బ్లాక్ ట్రీట్‌మెంట్, స్టైలిష్ డెకల్స్, బాడీ కలర్ గార్డ్స్ వంటి ఫీచర్లు SUV రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. వీటి లుక్స్ చూస్తే ఒక రేంజ్ ఉంది అనిపిస్తుంది. ఇవి ఇప్పటికే మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న వెర్షన్లతో పోలిస్తే సుమారుగా రూ. 40,000 ఎక్కువ ధరకు లభిస్తాయి.
దీన్ని మహీంద్రా డీలర్-స్థాయిలో ప్రత్యేక యాక్సెసరీ ప్యాక్ రూపంలో అందిస్తోంది. అంటే వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతూ, ప్రతీసారీ కొత్తదనంతో ముందుకు వస్తున్న మహీంద్రా, తన ఐకానిక్ SUV 'బొలెరో'కి కొత్తగా ఒక గ్లామరస్ లుక్‌ను అందించింది. దీని డిజైన్‌లో చాలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి.

ధర విషయానికొస్తే, బొలెరో బోల్డ్ ఎడిషన్‌ను మీరు రూ.10.02 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక ఎడిషన్ సాధారణ వెర్షన్ కంటే సుమారు రూ. 40,000 ఎక్కువ ఖర్చు కావచ్చు, కానీ దానికి తగినట్టే స్టైల్ రూపంలో విలువను అందిస్తోంది. అలాగే, దీని డిజైన్ గురించి చూసినట్లయితే, ముందుగా హెడ్‌లైట్‌లపై ఉన్న డార్క్ క్రోమ్ ఫినిష్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది.
ఫ్రంట్ గ్రిల్, డోర్ హ్యాండిల్స్ మీద అదే డిజైన్ కొనసాగి, వెనుక ఫెండర్‌లపై పెట్టిన "వెంటిలేటర్లు" వాహనానికి స్పోర్టీ లుక్‌ని జోడించాయి. ముందు భాగంలో బ్లాక్-అవుట్ ఫాగ్ లైట్లు, వాటితో కలిపిన బ్లాక్ టోన్ బంపర్ SUV రూపాన్ని మరింత గంభీరంగా తీర్చిదిద్దాయి. అంతే కాదు, బోల్డ్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు ఈ వాహనం ప్రత్యేకతను ప్రతీచోట గుర్తుచేస్తూనే ఉంటాయి. బాహ్య డిజైన్ మాదిరిగానే, ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి.

నలుపు రంగుతో లేత గోధుమ రంగు హైలైట్‌లతో వస్తున్న సీట్లూ, స్టీరింగ్ అప్హోల్స్టరీ SUV లోపలికి మోడెర్న్ టచ్‌ను తీసుకొచ్చాయి. డోర్ సిల్ ప్లేట్లు, మెట్స్ వంటి అంశాలు ప్రయాణానికి ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి. మహీంద్రా బొలెరో బోల్డ్ ఎడిషన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 74.9 bhp పవర్, 210 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అలాగే మహీంద్రా బొలెరో నియో బోల్డ్ ఎడిషన్ కూడా కొత్త బోల్డ్ ఎడిషన్ బ్యాడ్జ్‌తో పాటు డార్క్ క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. నియో ఎడిషన్‌లో హెడ్‌లైట్ల చుట్టూ, డోర్ హ్యాండిల్స్‌పై, ముందు గ్రిల్‌కు చుట్టూ, పైకి చూసే రూఫ్ రెయిల్స్‌పైనా, బంపర్ పక్కన ఫాగ్ లైట్ సరౌండ్లలోనూ, వీల్ ఆర్చ్‌ల వద్ద, అలాగే డోర్ క్లాడింగ్‌పై ఈ డార్క్ క్రోమ్ టచ్ SUVకి ఒక విలక్షణమైన స్వరూపాన్ని అందించింది.

బొలెరో నియో బోల్డ్ ఎడిషన్ ఒక సాధారణ వాహనం కంటే చాలా భిన్నంగా అనిపిస్తుంది. ఇది N10, N10(O) వేరియంట్లలో వస్తుంది. బొలెరో నియో బోల్డ్ ఎడిషన్ 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 98.5 bhp పవర్, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర ధర రూ.11.90 లక్షల నుండి రూ.12.58 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.


Click it and Unblock the Notifications








