400 కి.మీ మైలేజ్! సెన్సేషన్ ట్రక్‌ను లాంచ్ చేసిన మహీంద్రా.. బొలెరో ఫ్యాన్స్‌కి బంపర్ గిఫ్ట్

భారతదేశపు నంబర్ 1 పికప్ వాహన బ్రాండ్‌గా పేరుగాంచిన మహీంద్రా (Mahindra), మరోసారి తన శక్తివంతమైన కొత్త వాహనంతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. వ్యాపార, ఇతర అవసరాలకు అనుగుణంగా ఉండేలా కొత్తగా బొలెరో మాక్స్ పికప్ హెచ్‌డీ సీఎన్‌‌జీ (Bolero MaXX Pik-Up HD CNG)ని విడుదల చేసింది. ఈ కొత్త బొలెరో పికప్ ట్రక్ డిజైన్ పూర్తిగా ప్రాక్టికల్ అవసరాలకు అనుగుణంగా ఉంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీని ఫీచర్లు, సామర్థ్యం రూపొందించబడ్డాయి. ఇది గరిష్టంగా 1.85 టన్నుల పేలోడ్‌ను మోయగలదు, అంటే, పెద్ద పరిమాణంలో సరుకులను తరలించాల్సిన చిన్న వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది నిజంగా సూపర్ ఎంపిక అవుతుంది. దీని ధర వచ్చేసి రూ.11.19 లక్షల ఎక్స్-షోరూమ్

ఇది పవర్, పనితీరు పరంగా కూడా వెనుకబడదు. ఈ ట్రక్ 2.5-లీటర్ టర్బోచార్జ్డ్ CNG ఇంజిన్‌‌తో పనిచేస్తుంది. 61 కిలోవాట్ల పవర్‌ను, 220 Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేయగలదు, అంటే, లోడ్ ఎక్కువైనా, గుట్టల మీద ప్రయాణించినా మంచి పెర్ఫామెన్స్‌ను ఇస్తుంది. ఇది రోజు పనిచేసే లాజిస్టిక్స్ అవసరాల కోసం, దూర ప్రాంతాల్లో సరుకుల డెలివరీ వంటి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడినట్లు మహీంద్రా స్పష్టం చేసింది.

Mahindra New Bolero Maxx Pickup Hd Cng Truck

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, వ్యాపార లాభదాయకతను కోరుకునే వారి కోసం ఇది సరైన మోడల్. CNG వేరియంట్ కావడం వల్ల, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, ఇంధన ఖర్చులపై భారం తగ్గుతుంది. మహీంద్రా కొత్త బొలెరో మాక్స్ పికప్ ట్రక్‌ 180 లీటర్ల సామర్థ్యం గల పెద్ద CNG ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ ట్యాంక్ పూర్తిగా నింపితే, సుమారుగా 400 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలదు.

అంటే మధ్యతరగతి డిస్ట్రిబ్యూటర్లు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు, లేదా దూర ప్రాంతాల సరుకు రవాణా చేసే వారికి ఇది ఖర్చు తక్కువగా, పనితీరు ఎక్కువగా ఉండేలా ఉపయోగపడుతుంది. దీని ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. పవర్ స్టీరింగ్ డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. పట్టణ రహదారుల్లోనూ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ మెరుగైన కంట్రోల్, తక్కువ శ్రమతో వాహనాన్ని నడిపే అవకాశం కల్పిస్తాయి.

రోడ్ల స్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ ట్రక్‌కు బలమైన 16-అంగుళాల టైర్లు అమర్చబడ్డాయి. ఇవి ముందుకు వెనకకు రెండూ సరిపోయేలా ఉండి, వాహనానికి గట్టి పట్టును అందిస్తాయి. అదేవిధంగా, మన్నికైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వ్యవస్థ వలన, ఎలాంటి భూభాగమైనా, ఖచ్చితమైన స్థిరత్వం, షాక్‌ అబ్జార్ప్షన్ కలిగి ఉండటం వల్ల సరుకులే కాదు, డ్రైవర్‌కు కూడా కంఫర్ట్ కలుగుతుంది.

వాణిజ్య వాహనాలకు సాధారణంగా లభించని సౌకర్యాలు ఈ మోడల్‌లో కనిపించడమే కాదు, మోడరన్ టెక్నాలజీతో ఒక కొత్త ప్రమాణంగా నిలుస్తోంది. డ్రైవర్ కంఫర్ట్ విషయంలో మహీంద్రా స్పష్టమైన దృష్టిని చూపింది. అన్ని వాతావరణాల్లో డ్రైవింగ్ అనుభవం ఏ మాత్రం ఇబ్బందిగా ఉండకూడదని భావిస్తూ, ఈ పికప్ ట్రక్‌కి వాతావరణ నియంత్రణ వ్యవస్థ (AC), Heater లాంటి హై యుటిలిటీ ఫీచర్లు అందించబడ్డాయి.

ఇవి సుదూర ప్రయాణాల్లో, ఎండైనా చలిగానీ, డ్రైవర్‌ను సౌకర్యంగా ఉంచేలా సహాయపడతాయి. అదనంగా, డ్రైవర్‌కు అనుగుణంగా సీటింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండేలా ఎత్తు-సర్దుబాటు చేయగల ఎర్గోనామిక్ డ్రైవర్ సీట్ ఏర్పాటు చేయబడింది. ఇది నడిపే వ్యక్తికి ఎక్కువ సేపు కంఫర్ట్‌ను ఇస్తుంది. అంతేకాదు, D+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ వలన, డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూర్చొనగలరు.

ఇది మహీంద్రా మొట్టమొదటి CNG పికప్ అయినప్పటికీ, దీనిలో ఉపయోగించిన టెక్నాలజీ పూర్తిగా లేటెస్ట్‌ా ఉంటుంది. ముఖ్యంగా, iMAXX టెలిమాటిక్స్ సొల్యూషన్ అనే కనెక్టెడ్ టెక్నాలజీని ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా పనితీరు, ఖర్చు నియంత్రణ, రూట్ ఆప్టిమైజేషన్, రియల్ టైమ్ డేటా వంటి అనేక అంశాలపై ఒక ఐడియా వస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2025, 15:41 [IST]
English summary
Mahindra new bolero maxx pickup hd cng truck launched in india at rs 11 19 lakh
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+