నెలకు రూ.13 వేలతో కొత్త బొలెరో సొంతం.. వేరియంట్ల వారీగా ఆన్-రోడ్ ధర, EMI వివరాలు
భారతీయ SUV మార్కెట్లో ఎప్పటినుంచో తనదైన స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన మహీంద్రా బొలెరో SUV తాజాగా విడుదలైంది. ఈసారి కంపెనీ డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, అన్నింటిలోనూ గణనీయమైన మార్పులు చేసింది. బొలెరో అనగానే మనసుకు వచ్చే దృఢమైన బాడీ, మస్క్యులర్ లుక్, గ్రామీణ రోడ్లను కూడా సులభంగా జయించే పవర్, ఇవన్నీ కొనసాగుతూనే, కొత్త వెర్షన్‌లో ఆధునిక టచ్ జోడించబడింది. ఇప్పుడు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి బొలెరో ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇది రూ.7.99 లక్షల నుండి రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ SUV వేరియంట్ల వారీగా ఆన్-రోడ్ ధర, EMI గురించి ఇక్కడ ఈ కథనంలో అందించడం జరిగింది.
కొత్త మహీంద్రా బొలెరో పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి వేరియంట్ ప్రత్యేకతను కలిగి ఉంది. వాటిలో B4 వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 9.53 లక్షలు. దీన్ని రూ.3 లక్షల డౌన్ పేమెంట్తో బుక్ చేస్తే, మిగిలిన రూ. 6.53 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల(60 నెలల) కాలానికి నెలకు సుమారు రూ. 13,500 EMI చెల్లించాలి.

ఇందులోని B6 వేరియంట్ ధర సుమారు రూ. 10.35 లక్షలు(ఆన్-రోడ్)గా ఉంది. ఈ వేరియంట్‌ను రూ.3 లక్షల డౌన్ పేమెంట్తో కొనుగోలు చేస్తే, మిగతా రూ. 7.35 లక్షల వరకు రుణం పొందవచ్చు. బ్యాంకులు అందించే 9% వడ్డీ రేటు ప్రకారం, 5 సంవత్సరాల రుణ కాలవ్యవధికి నెలవారీగా రూ. 15,200 EMI చెల్లించాలి. ఈ EMI సౌకర్యం వల్ల పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టకుండా సులభంగా కారు తెచ్చుకోవచ్చు.
తదుపరి B6 (O) వేరియంట్ మరింత ఫీచర్లు, సేఫ్టీతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 10.82 లక్షలు. మీరు రూ. 3 లక్షల డౌన్ పేమెంట్తో కొనుగోలు చేస్తే, రూ. 7.82 లక్షల వరకు రుణం పొందవచ్చు. అదే 9% వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల పాటు నెలవారీ రూ. 16,200 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేరియంట్‌లో అదనపు కంఫర్ట్, లగ్జరీ టచ్ కారణంగా ఆకర్షణీయంగా మారింది.

ఇక బొలెరోలో టాప్-ఎండ్ వెర్షన్‌గా B8 వేరియంట్ ఉంటుంది. ఇది పూర్తి ఫీచర్ లోడ్‌తో, ఆధునిక SUVలతో పోటీ పడేలా రూపుదిద్దుకుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 11.53 లక్షలు. దీన్ని రూ. 3 లక్షల డౌన్ పేమెంట్తో కొనుగోలు చేస్తే, మిగిలిన రూ. 8.53 లక్షల వరకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో, మీరు 5 సంవత్సరాల పాటు నెలవారీ రూ. 17,700 EMI చెల్లించాలి.
కొత్త మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ 2025 సాంకేతికంగా, డిజైన్ పరంగా, సౌకర్యాల పరంగా ముందడుగు వేసింది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది కేవలం పవర్‌ఫుల్‌గా కాకుండా, మైలేజీని కూడా అందిస్తుంది. సాధారణంగా ఈ ఇంజిన్ 14 నుండి 16 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రోజువారీ ప్రయాణం నుండి లాంగ్ రైడ్‌ల వరకు, ఈ బొలెరో ప్రతి సందర్భంలోనూ బలమైన పనితీరు చూపిస్తుంది.



Click it and Unblock the Notifications








