7 మంది కలిసి వెళ్లొచ్చు.. ఒక కి.మీ వెళ్లడానికి కేవలం రూ.1.2 చాలు! ఇలాంటి ఈవీ ఇప్పటిదాకా రాలేదు!

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు సాధారణ కుటుంబాలపై పెద్ద భారం అయ్యాయి. రోజూ ఆఫీస్‌కి వెళ్లేవారైనా, పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లేవారైనా... ప్రతి కిలోమీటర్‌కి ఫ్యూయల్ ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందించే తక్కువ రన్నింగ్ ఖర్చు, సులభమైన నిర్వహణ, మినిమమ్ మెయింటెనెన్స్ ప్రజలను సహజంగానే ఈవీల వైపు తిప్పుతోంది. ఈ మార్పును స్పష్టంగా గమనించిన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ ఎలక్ట్రిక్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఫ్యామిలీ సెగ్మెంట్‌కి సరిపోయే మోడళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీదారైన మహీంద్రా కూడా ఇదే దారిలో ముందడుగు వేసి కొత్తగా XEV 9S అనే ప్రీమియం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.

ఇంగ్లోవ్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ మోడల్ డిజైన్, సేఫ్టీ, పనితీరులో కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగానే ఉంది. ఈ కారుకు సంబంధించిన ఆకట్టుకునే విషయం ఏమిటంటే, రన్నింగ్ ఖర్చు. XEV 9S నడపడానికి కిలోమీటర్‌కు కేవలం రూ.1.20 మాత్రమే ఖర్చవుతుంది. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇది అనేక రెట్లు తక్కువ. అంతేకాదు, ఈ కారును నిర్వహించడానికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా కిలోమీటర్‌కు కేవలం 40 పైసలు మాత్రమే ఉండటం ప్రత్యేకత.

Mahindra New Car Xev 9s Price Battery And Running Cost Details Inside

అంటే ఒక కుటుంబం రోజూ 30-40 కి.మీ ప్రయాణించినా నెలాఖరులో బిల్లు చూసి భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మహీంద్రా XEV 9Sను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో కీలకమైనది దీని బ్యాటరీ, పనితీరు సామర్థ్యం. కుటుంబ అవసరాలు ఏవైనా సరే, వినియోగదారుడి బడ్జెట్‌ను, డ్రైవింగ్ రేంజ్‌ను, ప్రయాణ అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మూడు భిన్నమైన బ్యాటరీ ఎంపికలను అందించడం కంపెనీ ఆలోచనలోని ప్రాక్టికల్ దృక్పథాన్ని చూపిస్తుంది.

ఈ మోడల్‌ 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉండగా, ఇవన్నీ ఎక్కువ కాలం పనిచేసే LFP సెల్స్‌తో తయారై ఉండటం విశేషం. ఈ సెల్స్‌ జీవితకాలం ఎక్కువగా ఉండడం, సేఫ్టీ పరంగా విశ్వసనీయంగా ఉండటం ఇవన్నీ వినియోగదారులకు నమ్మకాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ బ్యాటరీలకు కంపెనీ జీవితకాల వారంటీ ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక వినియోగం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండవు.

Mahindra New Car Xev 9s Price Battery And Running Cost Details Inside

ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అందుబాటులో ఉన్న సమాచారం వెల్లడిస్తోంది. దీని వల్ల లాంగ్ ట్రిప్స్‌కి కూడా ఈ కారు సులభంగా సరిపోతుంది. ఛార్జింగ్ టైమ్ విషయానికి వస్తే, DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో 20-80% ఛార్జ్‌కి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకునేలోపే కారు మళ్లీ ప్రయాణానికి సిద్ధమైపోతుంది.

పర్ఫార్మెన్స్ పరంగా కూడా XEV 9S తన క్లాస్‌లో బలమైన స్థాయిని చూపిస్తుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 210 kW పవర్‌ను, అలాగే 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి వల్ల కారు కేవలం 7 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని దాటుతుంది. అలాగే గరిష్టంగా 202 kmph స్పీడ్‌ను చేరుకోగలగడం ఈవీలకు ఉన్న పర్ఫార్మెన్స్ క్యాప్ అన్న అపోహలనూ చెదరగొడుతోంది.

Mahindra New Car Xev 9s Price Battery And Running Cost Details Inside

మహీంద్రా XEV 9S ధరలను పరిశీలిస్తే, రూ. 19.95 లక్షల ప్రారంభ ధరతో ఇది ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో ఉన్నప్పటికీ, అందించే ఫీచర్లను చూస్తే ఇది కుటుంబ వినియోగానికి చాలా సరైన, విలువైన ఎంపికగా నిలుస్తోంది. టాప్ వేరియంట్ ధర రూ. 29.45 లక్షల వరకు చేరినప్పటికీ, రేంజ్, సేఫ్టీ, టెక్నాలజీ కలిని చూస్తే ఈ కారును ఫ్యామిలీ లగ్జరీ ఈవీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

More from DriveSpark

Article Published On: Saturday, November 29, 2025, 11:33 [IST]
English summary
Mahindra new car xev 9s price battery and running cost details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+