మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల ధరలు వచ్చేశాయ్.. వీటి ఫర్ఫామెన్స్ ముందు మిగతా కార్లు తేలిపోవాల్సిందే!
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అందిరికి తెలిసిందే. గత మూడు నాలుగేళ్ల నుంచి ఈవీలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా గత ఏడాదిలో ఇది మరింత పెరిగింది. సాంప్రదాయ ఇంధన కార్ల అమ్మకాలతో పాటు ఎలక్ట్రిక్ కార్స్ కూడా పోటీ పడి మరి సేల్స్‌ను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు కూడా వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఇటీవల దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్తగా BE 6,XEV 9e ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది. అయితే వీటి ధరలను తాజాగా ఇప్పుడు ప్రకటించింది. ఈ కార్ల కోసం చాలా మంది గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవి SUV (ఎస్‌యూవీ) కార్స్. వీటితో పాటు మహీంద్రా మరో రెండు వేరియంట్లను కూడా అదనంగా తీసుకొచ్చింది.
ఈ ఎలక్ట్రిక్ కార్స్ బుకింగ్స్ ఫిబ్రవరి 14, 2025 నుండి మొదలువుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. BE 6,XEV 9e ఎలక్ట్రిక్ కార్లకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా బుకింగ్ చేసుకున్న వారికి త్వరలో డెలివరీలు ప్రారంభించనున్నారు. వీటి ఉత్పత్తిని కూడా మహీంద్రా మరింత వేగవంతం చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ కూడా అధునాతన సాంకేతికతతో వస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక వీటి ధరల విషయానికి వస్తే, BE 6 SUV 59 kWh బ్యాటరీ కెపాసిటీ కలిగిన మోడల్ ధర రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే, టాప్ వేరియంట్ 79 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.26.90 లక్షల నుంచి మొదలవుతుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యాక్ 1,2,3 లలో లభిస్తుంది.
ప్యాక్ వన్ అబోవ్ ధర రూ.20.5 లక్షలు, ప్యాక్ టూ రూ. 21.90 లక్షలు, ప్యాక్ త్రీ సెలెక్ట్ రూ. 24.50 లక్షలు. ఇక XEV 9e గురించి తెలుసుకున్నట్లయితే ప్యాక్ వన్ ధర రూ. 21.9 లక్షలు, ప్యాక్ టూ ధర రూ. 24.9 లక్షలు, ప్యాక్ త్రీ సెలెక్ట్ రూ. 27.90 లక్షలు, ప్యాక్ త్రీ రూ. 30.5 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు.

దీని ప్యాక్ వన్ అబోవ్ వేరియంట్ ధర గురించి మహీంద్రా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. BE 6e ఫీచర్స్‌ను చూసినట్లయితే, 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. లోపల అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, డ్రైవర్ అలర్ట్‌నెస్ సిస్టమ్, లెవల్ 2+ ADAS, EBDతో కూడిన ABS సిస్టం వంటివి ఉన్నాయి.
XEV 9e కూడా రెండు బ్యాటరీ ఆప్షన్స్ 59kWh, 79kWh ప్యాక్‌లో లభిస్తుంది. చిన్న బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 542 కి.మీల దూరం వరకు రేంజ్‌ను అందిస్తుంది. అదే పెద్ద బ్యాటరీతో 656 కి.మీ లాంగ్ రేంజ్ వరకు ప్రయాణిస్తుందని మహీంద్రా పేర్కొంది. దీనిలో లేటెస్ట్ ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. కారు లోపల సీట్లు చాలా విశాలంగా ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి.

భారత్‌లో ప్రస్తుతం ఈవీలకు మంచి ఆదరణ నేపథ్యంలో పలు కార్ల తయారీదారులు పోటీ పడుతూ మరి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నారు. పోటీ కారణంగా వరుసగా పలు మోడళ్లను తీసుకొస్తున్నారు. ఇప్పుడు మహీంద్రా ఈవీ విభాగంలో పైచేయి సాధించడానికి ఈ కొత్త కార్లతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








