సరికొత్త చరిత్రను లిఖించిన మహీంద్రా స్కార్పియో.. ఈ అరుదైన క్షణంలో స్పెషల్ కారు లాంచ్

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో మహీంద్రా(Mahindra) కంపెనీకి గొప్ప పేరుంది. దేశీయ ప్రజలకు అధునాతన ఫీచర్స్, సరికొత్త డిజైన్ కలిగిన కార్లను అందిస్తూ, అమ్మకాల పరంగా ఇతర కంపెనీలకు బలమైన పొటీనిస్తూ దూసుకుపోతుంది. మహీంద్రా కార్లకు దేశంలో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ స్కార్పియో N అమ్మకాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ SUV మార్కెట్లోకి విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,00,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫెర్ఫామెన్స్‌కు చాలా మంది అట్రాక్ట్ కావడంతో ఈ కారు సేల్స్ ఈ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. స్కార్పియో-ఎన్ విజయవంతం కావడంతో దీనికి గుర్తుగా మహీంద్రా ఇప్పుడు కొత్తగా 'స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్' కారును విడుదల చేసింది.

స్కార్పియో N 2 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును అధిగమించడంపై కంపెనీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బాడీ, చూపు తిప్పనివ్వని రూపంతో ప్రస్తుతం అమ్మకాల రికార్డును సృష్టిస్తోంది. ఈ లెక్కన దేశంలో స్కార్పియోకు ఆదరణ తగ్గడం లేదని అర్థం అవుతుంది. స్కార్పియో-ఎన్ అధునాతన ఫీచర్స్, బోల్డ్ లుక్స్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌తో ఆకట్టుకోగా, కొత్త మోడల్ కూడా అదే విధంగా ఆదరణ సంపాదిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.

Scorpio N Carbon Edition

ఈ అరుదైన క్షణంలో వచ్చిన స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.19.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది Z8, Z8L అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.24.89 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇది 7 సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబంతో కలిసి దేవాలయాలకు, ఇతర టూర్స్‌కు ఎక్కువగా వెళ్తున్నారు. ఇలాంటి వారికి ఇది బాగా సెట్ అవుతుంది.

స్కార్పియో N 2 లక్షల అమ్మకాలను ఘనంగా జరుపుకోవడానికి గుర్తుగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ దాని సాధారణ పాత మోడల్ కంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది. దీనిని మెటాలిక్ బ్లాక్ పెయింట్‌తో అలంకరించారు. స్మోక్డ్ క్రోమ్ యాసలు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ స్టిచింగ్‌తో డిజైన్ చేసిన సీట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. బ్లాక్ కలర్‌లో స్టైలిష్ లుక్ అందించే కారు కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

Mahindra Scorpio N 2 Lakh Sales

స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ఆకట్టుకునే హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లతో అందంగా కనిపిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే, స్కార్పియో ఎన్ SUV లో ఉన్నట్లుగానే అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో కొనుగోలుకు లభిస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. దీని మైలేజ్ 12.12 నుండి 15.94 kmpl వరకు వస్తుంది.

ఇంటీరియర్ కూడా నల్లటి థీమ్‌తో వచ్చింది. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, వైపర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగులు, ADAS, ESC, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Mahindra New Scorpio N Carbon Edition Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, February 25, 2025, 12:15 [IST]
English summary
Mahindra new scorpio n carbon edition launched in india here price features details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+