తక్కువ ధరలో 7 సీటర్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. ఫ్యామిలీకి బెస్ట్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీలు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా(Mahindra) ఇటీవల కాలంలో తన దూకుడు పెంచింది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లను సైతం వరుసగా విడుదల చేస్తుంది. జనవరి నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో తన ఈవీలను ప్రదర్శించింది. తాజాగా BE 6 EVను లాంచ్ చేసింది. ఇండియాలో ఈవీ విభాగంలో టాటా మోటార్స్ కంపెనీ అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పుడు దీనికి బలమైన పోటీగా అవతరించడానికి మహీంద్రా పట్టుదలతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అందుకే ఈ కంపెనీ రాబోయే రోజుల్లో ఇండియా టెస్లా మారిపోయే అవకాశం ఉంది. మహీంద్రా కంపెనీ తన భారతీయ వినియోగదారుల కోసం XUV700 SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ XEV 7eను విడుదల చేయాడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఈవీలు తీసుకొచ్చి భారత్‌లో బలమైన ఈవీ సంస్థగా అవతరిస్తున్న మహీంద్రా తన కొత్త మోడల్‌తో టాటాకు పోటీనిచ్చినట్లవుతుంది.

జనవరిలో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మహీంద్రా XEV 7e ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరిస్తారని వార్తలు వచ్చినప్పటికి ఈ మోడల్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేయలేదు. అయితే ప్రస్తుతం BE 6కి భారతీయ మార్కెట్లో బలమైన డిమాండ్‌ రావడంతో 7e ను అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇది కూడా ప్రసిద్ధ మోడల్‌గా అవతరిస్తుందని మహీంద్రా అంచనాలు పెట్టుకుంది.

Mahindra New Xev 7e

XUV700 SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ XEV 7e 2025 మధ్య భాగంలో లేదంటే ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కారు డిజైన్ XUV.e8 కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు. ఇది భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే రూపంతో వస్తుంది. XEV 9e EV భవిష్యత్ డిజైన్‌కు భిన్నంగా ఇది ఉంటుంది. XUV700 SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌‌లో డజన్ల కొద్ది అత్యాధునికి ఫీచర్స్ ఉంటాయి.

దీని డిజైన్ విషయానికి వస్తే, ఎక్స్‌టీరియర్‌లో నిలువుగా ఉన్నటువంటి త్రిభుజాకార LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా మారిన ముందు, వెనుక బంపర్లు, LED లైట్ బార్స్ కారుకు అందంగా కనిపిస్తాయి. అలాగే కొత్త అల్లాయ్ వీల్స్‌ను ఏరో ఇన్సర్ట్‌లతో అందించడంతో ఎక్స్‌టీరియర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని లోపల ఎక్కువ మంది కూర్చునేలా విశాలమైన మూడు-వరుసల సీటింగ్ లేఅవుట్ అందించారు. పెద్ద కుటుంబ గల వారికి ఇది బెస్ట్ కారు అవుతుంది.

Mahindra New Xev 7e Electric Suv

7 సీటర్ ఆప్షన్‌లో లభిస్తున్న XEV 7e SUV ఎలక్ట్రిక్ తక్కువ ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలోనే లాంచ్ చేయడం ద్వారా భారతీయ వినియోగదారులు చాలా మంది ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేసే అవకాశం ఉందని మహీంద్రా భావిస్తుంది. దీని లోపల ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంటీరియర్‌లో అనేక ప్రీమియం సౌకర్యాలు ఉండనున్నాయి.

క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌‌తో ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్ సంతోషించే విషయం. ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, లెవల్ 2 ADAS వాటిని కలిగి ఉంది. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లో లభిస్తుంది. 79 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ అందించవచ్చు. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ దూరం వరకు ప్రయాణించవచ్చు.

59 kWh బ్యాటరీ ప్యాక్‌‌ను కూడా ఇవ్వవచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను XUV700 SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ లోపల అందించనున్నారు. మహీంద్రా కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2025, 10:30 [IST]
English summary
Mahindra new xev 7e electric suv will launch in this year here all details check
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+