రూ.8.94 లక్షలకే అదిరిపోయే మహీంద్రా కారు లాంచ్.. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీపైనే!
భారతీయ SUV విభాగంలో మరోసారి మహీంద్రా తన ముద్ర వేసింది. ఓ ఏడాది క్రితం మార్కెట్‌లోకి వచ్చిన XUV 3XO మోడల్ కేవలం 12 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడవడం అనేది దాని సక్సెస్‌కు నిదర్శనం. ప్రీమియం లుక్, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు ఇవన్నీ కలిపి XUV 3XOను కేవలం SUVగా కాకుండా, ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలబెట్టాయి. తాజాగా, ఈ మోడల్ లైనప్‌లోకి 'REVX' అనే సరికొత్త వెర్షన్ వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 8.94 లక్షలుగా నిర్ణయించారు. ఇది మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్స్, ఆకట్టుకునే ఫీచర్స్‌తో విడుదల అయింది. కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నవారు దీన్ని హాయిగా ఎంచుకోవచ్చు. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎక్స్‌టీరియర్ చూస్తే REVX సిరీస్‌లో కొన్ని కొత్త అంశాలు కనిపిస్తాయి. డ్యూయల్-టోన్ రూఫ్, స్టైలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్యాడ్జింగ్, అలాగే కొత్త కలర్స్‌తో ఆకర్షణీయమైన బాడీ గ్రిల్ వంటివి ఈ వెర్షన్‌కి మరింత ఆకర్షణ చేకూర్చాయి. లోపలికి వచ్చాక కూడా ఇది సాధారణ SUVగా అనిపించదు, ఫీచర్ల పరంగా, డిజైన్ పరంగా ఇది మంచి ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన కారు.

XUV 3XO REVX సిరీస్ లోపలికి చూస్తే ప్రీమియం ఇంటీరియర్ అనుభవాన్ని అందిస్తుంది. నీటిగా కనిపించే లెథరెట్ సీట్లు, ఎలివేటెడ్ డిజైన్, క్లాస్‌కు తగ్గట్టైన ఫినిషింగ్‌తో ఈ SUV లోపలకి అడుగుపెట్టగానే వేరే స్థాయిలో ఉన్న భావన కలుగుతుంది. దీని సన్‌రూఫ్ అనేది ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా ఇది హయ్యర్-ఎండ్ కార్లలో మాత్రమే కనిపించే ఫీచర్. కానీ XUV 3XO REVX సిరీస్‌లో రూ.10 లక్షల లోపు కారులోనే లభిస్తోంది.
కొత్తగా REVX మోడల్ మూడు వేరియంట్‌లలో REVX M, REVX M(O), REVX Aలలో అందుబాటులో ఉంది. ఇవన్నీ వినియోగదారుల వేర్వేరు అవసరాలకు తగినట్లుగా రూపొందించబడ్డాయి. REVX M(O) వేరియంట్ ధర వచ్చేసి ఎక్స్-షోరూమ్ ధర రూ.9.44 లక్షలు. ఇది వాల్యూ ఫర్ మనీగా చెప్పవచ్చు. ఇది సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో పాటు, ఆధునిక ఇంటీరియర్ డిజైన్, మెరుగైన టెక్స్చర్‌లు, ఫినిషింగ్, ప్రయాణికుల సౌకర్యం విషయంలో మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది.

REVX M వేరియంట్‌తో పోల్చితే, M(O)లో కాస్త ఎక్కువ ప్రీమియం టచ్ ఉంటుంది. దానితో పాటు టెక్ ఫీచర్లలోనూ ఆధునికత ఉంటుంది, యువతను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా చేస్తుంది. REVX A వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ రూ.11.79 లక్షలు. ఇది REVX లైనప్‌లోని టాప్-ఎండ్ వేరియంట్. దీని హైలైట్ అంటే దాని శక్తివంతమైన 1.2L mStallion TGDi టర్బోపెట్రోల్ ఇంజిన్. 130 bhp పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
REVX సిరీస్ తన లుక్, ఫీచర్లు, పనితీరు మాత్రమే కాదు, కలర్స్ విషయంలో కూడా వినియోగదారులపై గొప్ప ఇంప్రెషన్ వేస్తోంది. ఈ సిరీస్‌లోని మూడు వేరియంట్లు ఐదు ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కలర్స్ లభిస్తున్నాయి. గెలాక్సీ గ్రే, నెబ్యులా బ్లూ, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్‌లలో ఇవి ఆకట్టుకుంటాయి. ఈ కలర్స్‌తో పాటు డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్షన్లు ఉండటం వలన మరింత స్పోర్టీ ఫినిషింగ్ వస్తుంది.
XUV 3XO REVX సిరీస్‌లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలాగే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు.ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు, 4-స్పీకర్ ఆడియో సెటప్ ఉంటుంది.సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అలాగే అన్ని నాలుగు చక్రాల్లో డిస్క్ బ్రేకులు లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








